ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలం పాటలో భారత కెప్టెన్ సునీల ఛెత్రి అత్యధిక ధర పలికాడు. ముంబై సిటీ ఎఫ్‌సీ అతడిని రూ. 1.2 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసింది. ఐఎస్ఎల్ వేలంలో ఛెత్రిని దక్కించుకునేందుకు మొత్తం 8 జట్లు పోటీపడ్డాయి.
వేలంపాటలో సునీల్ ఛెత్రి ప్రారంభ ధర రూ. 80 లక్షలు వద్ద మొదలైంది. అతడితోపాటు కరణ్‌జీత్ సింగ్, రాబిన్ సింగ్, అనాస్ ఎడతొడికా, అరాట ఇజుమీ, తోయ్ సింగ్, ఇగ్వెన్సస్‌లు వేలంపాటలో ఉన్నారు. గతేడాది ఐ-లీగ్‌తో ఒప్పందం కారణంగా ఐఎస్ఎల్ తొలి సీజన్‌లో వీళ్లంతా ఆడలేదు.
మొత్తం 113 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా, 8 జట్లలో ఐదేసి స్ధానాలు ఖాలీగా ఉన్నాయి. సునీల్ ఛెత్రితో పాటు మరో ఆటగాడు రూ. కోటి రూపాయల క్లబ్‌లో చేరాడు. పూణె ఎఫ్‌సీ మిడ్ ఫీల్డర్ యూగెన్షన్ లింగ్డోను కోటి రూపాయలు వెచ్చించి వేలంపాటలో దక్కించుకుంది.
అక్టోబర్ 3వ తేదీన ఐఎస్ఎల్ రెండో సీజన్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత్తా, చెన్నై ఎఫ్‌సీతో తలపడుతుంది. వేలంలో అమ్ముడు పోయిన టాప్ 10 ఆటగాళ్లు వీరే.

Jackichand Singh (FC Pune City) - Rs 45 lakh
Thoi Singh (Chennaiyin FC) - Rs 86 lakh
Anas Edathodika (Delhi Dynamos) - Rs 41 lakh
Eugeneson Lyngdoh (Pune) - Rs 1.05 crore
Sunil Chhetri (Mumbai City FC) - Rs 1.2 crore
Arata Izumi (Atletico de Kolkata) - Rs 68 lakh
Robin Singh (Delhi) - Rs 51 lakh
Karanjit Singh (Chennaiyin) - Rs 60 lakh
Rino Anto (Kolkata) - Rs 90 lakh
Seityasen Singh (NorthEast United FC) - Rs 56 lakh