For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఎస్‌ఎల్‌తో భారత క్రీడాకారులకు లబ్ధి

By Pratap

న్యూఢిల్లీ: దేశంలో ఫుట్‌బాల్‌ ప్రోత్సాహానికి నిర్వహిస్తున్న ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)తో భారత్‌ క్రీడాకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ కాంస్టాంటైన్‌ వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞులైన విదేశీ ఆటగాళ్లు, విదేశీ కోచ్‌లతో దేశీయ క్రీడాకారులు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకొనేందుకు సానుకూల అవకాశం ఉన్నదన్నారు.

2014లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఐఎస్‌ఎల్‌ పట్ల ఇంతకుముందు కొన్ని ఉత్తమ లీగ్‌లలో ఆడిన పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు ఆకర్షితులు అవుతున్నారన్నారు. తద్వారా భారత ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశమున్నదని తెలిపారు.

'విదేశీ క్రీడాకారుల నియామకంతో జట్టులోని క్రీడాకారులు పరస్పరం తమ అనుభవాలను తెలుసుకొనే వీలుంది. పరిజ్ఞానం బదిలీ కావొచ్చు. ఉన్నత స్ఠాయి టోర్నమెంట్లలో ఆడిన భారత్‌లో నిర్వహించే ఐఎస్‌ఎల్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. విదేశీ క్రీడాకారుల ఆటతీరుపై అవగాహన కల్పించుకుని ముందుకెళ్లవచ్చు.

Indian players will benefit from ISL, says Stephen Constantine

ప్రతి రోజు ఇది ఉమ్మడిగా లభించే ఏకైక మార్గం' అని అన్నారు. ఐఎస్‌ఎల్‌ ప్రకటించగానే కోచ్‌పదవి కోసం బ్రెజిలియన్‌ లెజెండ్‌ జింకో.. మూడో ఎడిషన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎఫ్‌సి గోవాకు బయలు దేరి వచ్చారు. మరి కొందరు కోచ్‌లు కూడా ఐఎస్‌ఎల్‌లో శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సరైన కోచ్‌ ఉంటేనే క్రీడాకారుడు మెరుగైన ఆటతీరు ప్రదర్శించగలుగుతాడు. ఐఎస్‌ఎల్‌తో భారత క్రీడాకారుడు పురోగతి సాధించేందుకు మార్గం సుగమం అయింది' అని అన్నాడు.

దుబాయిలో శిక్షణ పూర్తితో తిరిగొచ్చిన పుణె

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టోర్నీ కోసం ముంబై సిటీ ఎఫ్‌సి జట్టు సర్వ సన్నద్ధమైంది. ఇతర జట్లను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణ కోసం దుబాయికి వెళ్లింది. శిక్షణలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) క్లబ్‌, దుబాయి కల్చరల్‌ స్పోర్ట్స్‌. ఆల్‌ వాస్ల్‌, ఆల్‌ అరాబీ జట్లతో నాలుగు స్నేహ పూర్వక పోటీలు జరిగాయి. ఫ్రెండ్లీ మ్యాచ్‌లతో జట్టు సభ్యులో నైతిక స్థైర్యాన్ని పెంపొందించినట్లవుతుంది.

జట్టు కోచ్‌ అలెగ్జాండ్రే గౌమారెస్‌ మాట్లాడుతూ 'ముంబై సిటీ జట్టు ఎదురులేని శక్తిగా ఎదిగింది. ఇది చాల మంచి పరిమాణం. వాస్తవంగా వేడి పరిస్థితులతో కొంత కఠినమైన ప్రత్యర్థులతో ఆడాల్సి వస్తున్నది' అని అన్నాడు. ముంబై సిటీ ఎఫ్‌సి సిఇవో ఇంద్రాణిల్‌ దాస్‌ బ్లా మాట్లాడుతూ గతానికంటే మెరుగ్గా తమ జుట్టు సిద్ధమైందన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడితో అదనపు ఎక్సర్‌సైజ్‌లు, ఇతర ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. క్రీడాకారుల మధ్య పరస్పర సహకారం పెంపుదలతో జుట్టులో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు.

ఢిల్లీ డైనమో మిడ్‌ ఫీల్డర్‌ మార్కోస్‌ తెబార్‌

విదేశీ ఆటగాళ్ల రాకతో ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ప్రమాణాలు మెరుగయ్యాయని ఢిల్లీ డైనమోస్‌ డిఫెన్సివ్‌ మిడ్‌ఫీల్డర్‌ మార్కొస్‌ తెబార్‌ వ్యాఖ్యానించాడు. రియల్‌ మాడ్రిడ్‌ అకాడమీలో శిక్షణ పొంది కొద్దికాలం పాటు లాగోస్టెరాలోని స్పానిష్‌ క్లబ్‌ తరుఫున ఆడిన మార్కోస్‌.. ఢిల్లీ డైనమో ఫ్రాంచైసీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

వివిధ దేశాల క్రీడాకారుల అనుభవాలను తెలుసుకొనేందుకు గాను, తన ఆటతీరు మెరుగు పరుచుకొనేందుకు గాను భారత్‌ తనకు నూతన వేదిక కల్పించిందన్నాడు. గత ఆటతీరు ఆధారంగానే తనను ఢిల్లీ డైనమో ఎఫ్‌సి చేర్చుకున్నడన్నాడు. ఒక జట్టు సభ్యుడిగా కొత్త ఫుట్‌బాల్‌ కల్చర్‌ తెలుసుకుంటూ మెరుగైన ఆటతీరుతో జట్టు విజయానికి కృషిచేయడమే తన లక్ష్యమన్నాడు.

శిక్షణ కోసం బ్రిటన్‌, స్వీడన్‌లకు వెళ్లినప్పుడు ఆయా దేశాల క్రీడాకారులతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడినప్పుడు చాలా విషయాలు నేర్పుతాయన్నాడు. లీగ్‌ టోర్నీ గెలుచుకోవడానికి వీలుగా తమ టీం పిచ్‌పై చాలాకష్ట పడిందన్నాడు. ఈ టోర్నీలో వివిధ దేశాల క్రీడాకారులతోపాటు భారత ఆటగాళ్లు కూడా ఉన్నారని మార్కోస్‌ అభిప్రాయ పడ్డాడు.

జట్టు సభ్యుల మధ్య భాష సమస్య మినహా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపాడు. ఇతర జట్ల కంటే శక్తిమంతంగా తయారయ్యేందుకు కోచ్‌ చెప్పే సూచనలకు, శిక్షణకు అనుగుణంగా ముందుకెళుతున్నామని తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+