Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత పుట్‌బాల్‌కు మంచిరోజులు: 13 నెలల్లో 15 అంతర్జాతీయ మ్యాచ్‌లు

హైదరాబాద్: భారత పుట్‌బాల్‌కు మంచిరోజులు వచ్చాయి. భారత జాతీయ పుట్‌బాల్ జట్టు 13 నెలల కాలంలో 15 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నట్లు ఆల్ ఇండియా పుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. వీటిలో ఎనిమిది మ్యాచ్‌లు స్వదేశంలో జరగడం విశేషం.

ఆల్ ఇండియా పుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) తన మార్కెటింగ్ పాట్నర్స్ పుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)తో కలిసి ఈ ఏడాది మార్చి మొదట్లో భారత జాతీయ పుట్ బాల్ జట్టు అడనున్న 15 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించింది.

మార్చి 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలంలో ఈ 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 8 మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్స్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. ఇంటర్నెట్‌లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాం హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు.

భారత పుట్ బాల్ జట్టు జూన్ 6వ తేదీన అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా నేపాల్‌తో తలపడనుంది. దీంతో పాటు అక్టోబర్ 2017 నుంచి నవంబర్ 2017 మధ్య కాలంలో భారత పుట్ బాల్ జట్టు రెండు ట్రైనింగ్ క్యాంపులకు హాజరవుతుంది.

ఈ ట్రైనింగ్ క్యాంపుల తర్వాత స్వదేశంలో జరిగే ఎఫ్ఎఫ్సీ ఆసియా కప్‌లో భాగంగా అక్టోబర్‌ 10న మకావ్‌తో, నవంబర్ 14న మయన్మార్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే ఎఫ్ఎఫ్సీ ఆసియా కప్‌లో భాగంగా ఈ ఏడాది మార్చిలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+