
హైదరాబాద్: ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పుట్ బాల్ జట్టు టాప్-100లో చోటు కోల్పోయింది. గురువారం ఫిఫా తాజాగా ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరు స్థానాలు దిగజారి 103వ ర్యాంక్‌లో నిలిచింది. దీంతో పాటు ఆసియా ర్యాంకింగ్స్‌లో కూడా భారత్ 18వ స్థానానికి పడిపోయింది.
ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో పెద్ద జట్లతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత 2017లో తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పుట్ బాల్ జట్టు అత్యుత్తమ ర్యాంకు 94గా ఉంది. దీనిని ఫిబ్రవరి 1996లో భారత్ దక్కించుకుంది.