గత 21 ఏళ్లలో ఇదే అత్యుత్తమం: ఫిఫా ర్యాంకుల్లో భారత్ పైకి
హైదరాబాద్: ఫిఫా తాజా ర్యాకింగ్స్‌లో భారత్ 96వ స్థానానికి చేరుకొంది. గత 21 ఏళ్లలో ఇది భారత్‌కు రెండో అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. ఇక ఆసియాలో ఇరాన్ మొదటి స్ధానంలో ఉండగా భారత్ 12వ స్థానంలో ఉంది. 1996 ఫిబ్రవరిలో భారత పుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 94వ ర్యాంకు సాధించింది.
గత రెండేళ్లుగా భారత్ నిలకడగా ఆడుతోంది. ఇప్పటివరకు తలపడిన 15 మ్యాచుల్లో 12 గెలిచింది. చివరి 8 మ్యాచుల్లో ఓటమి లేకుండా విజయపథంలో దూసుకుపోతోంది. టీమిండియా 96వ ర్యాంకుకు చేరుకోవడం పట్ల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్, జట్టు కోచ్ కాన్‌స్టంటైన్ సంతోషం వ్యక్తం చేశారు.

యూఏఈలో 2019లో నిర్వహించే ఏఎఫ్‌సీ ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడమే తమ ముందున్న మొదటి లక్ష్యమని జట్టు కోచ్ కాన్‌స్టంటైన్ తెలిపారు. ఇటీవలే కాన్ఫడరేషన్స్ కప్ గెలిచిన జర్మనీ అగ్రస్ధానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్ధానంలో, అర్జెంటీనా మూడో స్ధానంలో కొనసాగుతోంది.
ఫిఫా ర్యాంకుల్లో టాప్-10 జట్లు:
1) Germany
2) Brazil
3) Argentina
4) Portugal
5) Switzerland
6) Poland
7) Chile
8) Colombia
9) France
10) Belgium
96) India
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications