Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జోరుమీదున్న టీమిండియా.. ఫైనల్ చేరుకున్న ఛెత్రీ సేన!

సాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఈ టీం.. మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం నాడు లెబనాన్‌తో హోరాహోరీగా జరిగిన సెమీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో అదనపు సమయం ఆడించారు. ఈ టైంలో కూడా రెండు జట్లు ఖాతా తెరవలేకపోయాయి.

ఇక చివర్లో షూటవుట్ పెట్టగా.. భారత్‌ 4-2తో లెబనాన్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇరు జట్లూ గోల్స్‌ చేయడంలో విఫలం కావడంతో స్కోరు 0-0 తో నిలిచింది. దీంతో షూటౌట్‌కు ఆడాల్సివచ్చింది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ తరఫున సునీల్‌ ఛెత్రి, అన్వర్‌ అలీ, మహేష్‌ సింగ్‌, ఉదాంత్‌ సింగ్‌లు గోల్‌ చేశారు.

SAFF Championship 2023

భారత్ తరఫున తొలి అవకాశాన్ని గోల్‌గా మరల్చిన సునీల్ ఛెత్రి.. తమన డగౌట్‌లో ఉత్సాహం నింపాడు. ఇదే సయమంలో లెబనాన్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అయితే లెబనాన్‌ ప్లేయర్ హసన్‌ కొట్టిన తొలి కిక్‌ను భారత గోల్‌ కీపర్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత వలీద్‌ షోర్‌, సాదిక్‌ గోల్స్‌ చేశారు. అయితే, నాలుగో కిక్‌ను ఖలీల్‌ బాదర్‌ బయటకు కొట్టేశాడు.

ఈ గోల్ ముగిసిన వెంటరనే వ దీంతో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరడం ఇది 13వసారి కావడం గమనార్హం. ఆట ఆరంభమైన తొలి 10 నిమిషాలు భారత్‌ను లెబనాన్‌ వణికించింది. రెండో నిమిషంలో నదిర్‌కు సువర్ణావకాశం లభించినా.. షాట్‌ గురి తప్పడంతో భారత్‌ ఊపిరి పీల్చుకొంది.

నెమ్మదిగా కుదుటపడిన ఛెత్రి సేన దాడుల ఉధృతిని పెంచింది. 16వ నిమిషంలో లెబనాన్‌ గోల్‌ పోస్టుపై దాడి చేసినా.. గోల్‌ మాత్రం సాధించలేకపోయింది. కాగా, 42వ నిమిషంలో లెబనాన్‌ కెప్టెన్‌ హసన్‌ కొట్టిన కిక్‌ను భారత కీపర్‌ అడ్డుకొన్నాడు. ఇక, సెకండా్‌ఫలో కూడా ఇరు జట్లూ గోల్‌ కోసం తీవ్రంగా పోరాడినా గోల్‌ మాత్రం చేయలేకపోయాయి.

SAFF Championship 2023

ఎక్స్‌ట్రా టైమ్‌లో ఛెత్రికి రెండు చక్కని అవకాశాలు లభించినా.. అతడు టార్గెట్‌ మిస్‌ కావడంతో షూటౌట్‌ అనివార్యమైంది. మంగళవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో కువైట్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో కువైట్‌ 1-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. అదనపు సమయంలో అబ్దుల్లా అల్‌ బ్లోషి (105+2వ) లేటు గోల్‌తో కువైట్‌కు విజయాన్నందించాడు.

నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్‌ చేయడంలో విఫలం కావడంతో.. మ్యాచ్‌ ఫలితం అదనపు సమయానికి దారి తీ సింది. ఎక్స్‌ట్రాటైమ్‌ మొదటి హాఫ్‌లో ధీపరీ ఇచ్చిన పాస్‌ను బ్లోషి నెట్‌లోకి పంపి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

Story first published: Sunday, July 2, 2023, 9:51 [IST]
Other articles published on Jul 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+