Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA U-17 World Cup: అమ్మకు ప్రేమతో సరికొత్త హెయిర్ స్టైల్

హైదరాబాద్: ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌కు తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. తొలి పోరులో భాగంగా శుక్రవారం భారత్ యువ జట్టు పటిష్ట అమెరికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 0-3తో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత పుట్‌బాల్ ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కలిశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను భారత పుట్‌బాల్ జట్టు అభిమానులతో పంచుకుంది. ఓ భారత ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్రేక్‌ది బియర్డ్‌, స్పైక్స్‌ లాంటి వినూత్న హెయిర్‌ స్టైల్‌తో క్రికెటర్లు అలరిస్తుంటే.. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ జితేంద్ర సింగ్‌ మాత్రం హెయిర్‌ స్టైల్‌తో తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

India players meet parents before World Cup debut

జట్టులో డిఫెండర్ అయిన జితేందర్ సింగ్ హిందీలో మా (తల్లి) అని కనిపించేలా జుత్తు కత్తిరించుకొని తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఇలా ప్రత్యేకంగా కనిపిస్తున్న జితేందర్ హెయిర్‌ స్టయిల్ ఫొటోను భారత ఫుట్‌బాల్ జట్టు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+