Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

21 ఏళ్ల తర్వాత చైనాతో బీజింగ్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న భారత్

India to play China in an international friendly in October in Beijing

హైదరాబాద్: భారత పుట్‌బాల్‌ జట్టు త్వరలో చైనాతో మ్యాచ్‌ ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఓ స్నేహపూర్వక మ్యాచ్‌లో తలపడనుండటం విశేషం. ఆసియా కప్‌ 2019కు సన్నాహకంగా భారత పుట్‌బాల్ జట్టు చైనాలో పర్యటించనుంది.

చైనాలో భారత పుట్‌బాల్ జట్టు మ్యాచ్‌ ఆడబోతుండడం ఇదే తొలిసారి. వచ్చే జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు యుఏఈలో ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీకి సన్నాహకంగా భారత ఫుట్‌బాల్‌ జట్టు అక్టోబర్‌ 8 నుంచి చైనాలో పర్యటించనుంది.

ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, మ్యాచ్‌ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. మ్యాచ్‌ను అక్టోబర్ 13(శనివారం) నిర్వహించాలని ఏఐఎఫ్‌ఎఫ్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పుట్‌బాల్ జట్టు 97వ, చైనా 75వ స్థానంలో ఉన్నాయి.

ఈ రెండు జట్లు చివరిసారిగా 1997లో కొచ్చి వేదికగా జరిగిన నెహ్రూ కప్‌లో పోటీ పడ్డాయి. ఇప్పటి వరకూ చైనాతో 17 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే, నాలుగు దేశాల టోర్నీలో భాగంగా ఇటీవలే అండర్-16 భారత జట్టు చైనాలో పర్యటించింది.

Story first published: Saturday, July 21, 2018, 11:41 [IST]
Other articles published on Jul 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+