Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2020 ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యం

India to host FIFA U-17 Womens World Cup 2020

హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. 2020లో జరగనున్న ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఫిఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో అధికారికంగా ప్రకటించారు.

అమెరికాలోని మియామీలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుందన్న విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇన్‌ఫాంటినో అన్నారు.

భారత్‌లో మహిళల ఫుట్‌బాల్ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడనుంది. 2017లో పురుషుల అండర్-17 మెన్స్ వరల్డ్‌కప్ తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న రెండో ఫిఫా టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. 2018 ఉరుగ్వేలో జరిగిన అండర్-17 మహిళల వరల్డ్ కప్‌లో మెక్సికోను స్పెయిన్ ఓడించి విజేతగా నిలిచింది.

ఇక న్యూజిలాండ్, కెనడా జట్లు మూడు, నాలుగో స్థానంలో నిలిచాయి. ఆల్‌ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సెక్రటరీ కుశాల్ దాస్ మాట్లాడుతూ "ఉమెన్స్ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు తమకు ఇచ్చినందుకు ఫిఫాకు ధన్యవాదాలు. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంట్ నిర్వహణ ఎంతో ఉపయోగపడుతుంది" అని అన్నారు.

Story first published: Saturday, March 16, 2019, 14:08 [IST]
Other articles published on Mar 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+