Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేపాల్ ఆటగాళ్లతో గొడవకు దిగిన భారత జట్టు.. వరుసగా రెండో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో..!

భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు మరీ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ప్లేయర్లు.. అయితే ఆటతో కాకుండా పాకిస్తాన్ ప్లేయర్లతో గొడవతోనే ఈ మ్యాచ్‌కు ఎక్కువ గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌లో మరోసారి భారత ఆటగాళ్లు గొడవ పడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా భారత్ 2-0తో ఘన విజయం సాధించడం గమనార్హం.

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ల నేపాల్, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 64వ నిమిషంలో ఈ గొడవ జరిగింది. భారత ప్లేయర్ రాహుల్ భేకె.. నేపాల్ ఆటగాడు బిమల్ ఘర్తీ ఇద్దరూ హెడర్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో భేకె కింద పడిపోయాడు. దీంతో కోపం వచ్చిన భేకె.. మగర్ వైపు దూసుకెళ్లాడు. దీంతో రెండు జట్ల ప్లేయర్లు గొడవకు దిగారు.

India and Nepal

అయితే ఈ ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందే.. మహేష్ సింగ్ అందించిన బంతిని టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ అద్భుతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్‌కు 1-0 ఆధిక్యం దక్కింది. అనంతరం 70వ నిమిషంలో ఛెత్రీ అందించిన అసిస్ట్‌ను అందుకున్న మహేష్ సూపర్ గోల్‌తో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది.

India and Nepal

అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మేనేజర్ ఇగొర్ స్టిమాక్ వల్ల గొడవ జరిగింది. త్రో-ఇన్ తీసుకుంటున్న పాక్ ప్లేయర్‌ను అడ్డుకున్న స్టిమాక్.. అతని చేతుల్లో నుంచి బంతిని కింద పడేశాడు. దీంతో భారత్, పాక్ రెండు జట్ల ఆటగాళ్లు మైదానంలోనే కొట్టుకున్నారు. ఈ గొడవలో స్టిమాక్‌కు రెడ్ కార్డు ఇచ్చారు అంపైర్లు. అలాగే స్టిమాక్‌ను మైదానంలో నుంచి బయటకు పంపేశారు కూడా.

Story first published: Sunday, June 25, 2023, 17:07 [IST]
Other articles published on Jun 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+