Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతాపై ముంబై పంజా విసురుతుందా?

ముంబై: తొలి రెండు ఐఎస్‌ఎల్‌ ఎడిషన్లలో ఏడవ, ఆరవ స్థానానికి పరిమితం కావడంతో కసిగా ప్రీ సీజన్‌ ప్రాక్టీస్‌లో పాల్గొని ముచ్చటగా మూడో ఎడిషన్‌కు సిద్ధమైన ముంబై సిటీ ఎఫ్‌సి మంగళవారం ముంబైలో జరిగే మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ అట్లెటికో డీ కోల్‌కతాను మట్టి కరిపిస్తుందా? అన్న అంచనాలు ఉన్నాయి. కోల్‌కతా సారధి పొస్టిగ, మరో ప్లేయర్‌ జైరూ గాయాలతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్న నేపథ్యంలో డిఫెన్సివ్‌గా దూకుడు ప్రదర్శిస్తున్న ముంబై సిటీకి సానుకూలాంశమే.

తొలుత ఎఫ్‌సి పుణె సిటీ, తర్వాత నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌లపై హోరాహోరీగా పోరాడి మ్యాచ్‌ గెలుచుకున్న ముంబై సేనలో సారధి డియాగో ఫోర్లాన్‌ ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తాడు. అయితే డిఫెన్స్‌తోనే పైచేయి సాధిస్తారా? లేక ఇతర ప్రయోగాలు చేస్తారా? అన్న విషయం చూడాలి. లేక మాజీ చాంపియన్లే గెలుస్తారా? అన్న విషయమ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు తేలిపోతుంది.

కోల్‌కతా తన సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2 - 2 స్కోర్‌తో డ్రాగా ముగిస్తే.. కోచిలో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాక్‌ బస్టర్స్‌పై 50 వేల మంది కేరళ ఫ్యాన్స్‌ మధ్య స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ బోర్జా ఫెర్నాండేజ్‌తో కలిసి అట్లెటికో కోల్‌కతా ఫార్వర్డ్‌ అటాకింగ్‌పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నది.

In-form Mumbai take on resurgent Atletico

ఇక మిడ్‌ఫీల్డ్‌లో జావిలారా, దౌటీ, పొస్టిగ, ఇయాన్‌హుమ్‌ ముందుపీఠిన నిలిచి జట్టుకు నాయకత్వం వహిస్తారు. జట్టు మేనేజ్‌మెంట్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్లేయర్లను రీప్లేస్‌ చేసుకొనేందుకు వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌కు వెళ్లిపోతుంది. ప్రస్తుతం ముంబై సిటీ ఎఫ్‌సి రెండు వరుస విజయాలతో ఆరు పాయింట్లు, అట్లెటికో డీ కోల్‌కతా నాలుగు పాయింట్లు కలిగి ఉన్నాయి. నార్త్‌ఈస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ ద్వారా జట్టును గెలిపించిన డియాగో ఫోర్లాన్‌ ఈ సీజన్‌లోనే జట్టు సారధిగా బాధ్యతలు స్వీకరించడం.. ఆ వెనువెంటనే మెరుపులు మెరిపించడం ముంబైకి కలిసివచ్చే అవకాశం.

అంతకుముందు పుణె సిటీ ఎఫ్‌సితో జరిగిన మ్యాచ్‌లో సున్నితమైన టచ్‌తో ఫోర్లాన్‌.. డిఫెడ్రికో గోల్‌కు సహకరించడంతో వరుసగా రెండు విజయాలకు కారకుడయ్యాడు. వీరితోపాటు లెఫ్ట్‌ బ్యాక్‌వైపు సేనా రాల్టే వేగంగా పరుగులు తీస్తూ ప్రత్యర్థి జట్టును హడలెత్తించగలడు. నార్త్‌ఈస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన క్రిస్జియాన్‌ వాడోజ్‌నే మళ్లీ రంగంలోకి దించే అవకాశముంది.

అలాగని అట్లెటికో డీ కోల్‌కతాలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇయాన్‌ హుమ్‌ ప్రారంభ మ్యాచ్‌లోనే పెనాల్టీని గోల్‌గా మార్చాడు. జావీ లారా, స్పానియార్డ్‌ బోర్జా డిఫెన్సివ్‌ ఆటగాళ్లు. ఇక వింగర్‌ సమీగ్‌ డౌటీ ప్రత్యర్థులకు సమస్యలు సృష్టించడంలో దిట్ట.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+