Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీకు గోల్స్ కావాలంటే నన్ను జట్టులోకి తీసుకోండి

If you need a striker, I'm the guy - Bolt's message to Beckham and Futbol Miami

హైదరాబాద్: పరుగుల బోల్ట్ కొద్ది రోజుల ముందే తనకు ఎంతో కాలంగా తీరని కోరిక అంటూ ఫుట్‌బాల్ క్రీడకు సిద్ధమయ్యాడు. అయితే అతనికి మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఓ ఈవెంట్‌లో ఆడమని అందులో ప్రదర్శన నచ్చితే జట్టులో తీసుకుంటామని చెప్పింది. అలా జట్టులో చేరిన బోల్ట్ ఇప్పుడు దానికి 'గుడ్ బై' చెప్పి మియామీకి చెందిన జట్టులో చేరనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే మియామీ ఫుట్‌బాల్ జట్టు ప్రారంభమైంది. ఆ ప్రమోషన్ నిమిత్తం చేసిన వీడియోలో బోల్ట్ ఇలా అన్నాడు. ఎంఎల్ఎస్ పేరుతో ప్రారంభమైన ఈ జట్టుకు 'స్ట్రైకర్ కావాలంటే చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను' అంటూ బోల్ట్ చెప్పాడు. మీకు గోల్స్ కావాలంటే నన్ను తీసుకోండి. అని పేర్కొన్నాడు. ఈ కామెంట్‌పై జట్టు యజమానుల దగ్గర్నుంచి పలు చర్చలు జరుగుతున్నాయి.

కొత్త జట్టు తయారేందుకు కావాల్సిన సన్నిహితులు లేక యాజమాన్యం ఇబ్బందులు పడుతోంది. రాబోయే సీజన్‌కు ఈ ఫుట్‌బాల్ జట్టు వస్తుందనే నమ్మకాల్లేవ్. కానీ, 2020 సంవత్సరం సీజన్‌లో ఖచ్చితంగా పాల్గొంటుందంటూ యాజమన్యాం చెబుతోంది. ఈ నేపథ్యంలో బోల్ట్‌ను తీసుకుని అతనిలోని నైపుణ్యం ఇంకా మెరుగుపర్చనున్నారని సమాచారం.

జమైకాకు చెందిన పరుగుల వీరుడైన బోల్ట్ కొద్ది రోజుల క్రితమే ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోని పరుగుల పోటీకి స్వస్తి చెప్పాడు. ఎనిమిది సార్లు స్వర్ణాన్ని గెలుచుకున్న 31 ఏళ్ల బోల్ట్ చాలా సార్లు రికార్డులు కైవసం చేసుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 15:15 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+