
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కేరళ జట్టును వరుసగా మూడు సార్లు గైడ్ చేసిన లైన్ హ్యూమ్ విజయం దిశగా నడిపించాడు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్ బాస్టర్స్ జట్టు ఢిల్లీ డైనమోస్ జట్టును 3-1తేడాతో ఓడించింది.
ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన కేరళ జట్టు కేవలం రెండింటిలోనే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా ఢిల్లీ డైనమోస్ జట్టు మళ్లీ ఓడిపోయి చివరి నుంచి మొదటి స్థానంలో కూర్చుంది.
రెనె మూల్ స్టీన్ అనంతరం కేరళ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తోన్న డేవిడ్ జేమ్స్ జట్టుకు వరుసగా రెండు విజయాలను అందించాడు. ఆట మొదలైన పన్నెండో నిమిషంలో ప్రీతమ్ కోతల్ గోల్ చేసి మొదటి గోల్‌ను సాధించాడు.
అంతా బాగానే జరుగుతుందనకున్న కేరళ జట్టుకు 40వ నిమిషంలో హామ్‌స్ట్రింగ్‌కు గాయమవడంతో డిమిటర్ బెర్బాటవ్ రంగ ప్రవేశం చేశాడు. దీంతో జట్టు సర్దుకోవడానికి కాస్తంత సమయం పట్టింది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ జట్టు ఒక గోల్‌ను సాధించింది.
ఆట ముగిసే సమయానికి లైన్ హ్యూమ్ చేసిన మూడు గోల్‌లతో కేరళ జట్టు 3పాయింట్ల స్కోరును సొంతం చేసుకోగా ఢిల్లీ ఒకే ఒక్క పాయింట్‌తో కూలపడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.