న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

డిఫెండింగ్ చాంప్ జర్మనీకే సునీల్ చెత్రి మద్దతు

Ill put my money on Germany, says Indian skipper Chhetri

హైదరాబాద్: రష్యాలో 2018 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభించడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చేనెల 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు జరిగే సాకర్ కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి మద్దతు పలికాడు. సరిగ్గా నెల రోజుల్లో ప్రారంభం కానున్న సాకర్ మహా సంరంభానికి తటస్థ మద్దతుదారుడిగా ఉన్న సునీల్ చెత్రి.. తిరిగి వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకునే సామర్థ్యం జర్మనీ జట్టుకు ఉన్నదని పేర్కొన్నాడు.

ఉమ్మడిగా జర్మనీ ఆటగాళ్ల వ్యూహం
నాలుగేళ్ల క్రితం జరిగిన సాకర్ ఫైనల్స్ మ్యాచ్‌లో అర్జెంటీనాపై 1 - 0 స్కోర్ తేడాతో జర్మనీ విజయం సాధించింది. ఒక ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ ఛెత్రి మాట్లాడుతూ తాను తటస్థంగా ఉంటానని చెప్పాడు. 'నేను మంచి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించడానికి ప్రాధాన్యం ఇస్తాను. జర్మనీ జట్టు ఆటతీరును నేను ప్రేమిస్తాను. జర్మనీ ఆటగాళ్లు ఉమ్మడిగా మ్యాచ్ ఆడతారు. బ్రెజిల్ ఆటగాళ్ల తీరు చాలా ఆసక్తిగా ఉంటుంది. స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్‌లో బంతిపై చాలా మంచి నియంత్రణ సాధిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల జట్లు విభిన్నంగా ఆడుతున్నాయి. వివిధ ఫుట్‌బాల్ జట్లు విభిన్నంగా ఆడుతుంటాయి' అని తెలిపారు.

జూన్ 17న మెక్సికోతో జర్మనీ జట్టు ఢీ:

జూన్ 17న మెక్సికోతో జర్మనీ జట్టు ఢీ:

‘నేను ఒక జట్టును ఒక క్లియర్ ఫేవరెట్‌గా పరిగణించలేదు. నేను జర్మనీ జట్టుపై పెట్టుబడి పెట్టా. పెద్ద టోర్నమెంట్లలో జర్మనీ జటగాళ్లు చాలా బాగా ఆడతారు. రష్యాలో తొలిసారి జరుగనున్న సాకర్ కప్ టోర్నమెంట్‌లోనూ జర్మనీ జట్టు మరింత మెరుగ్గా ఆడాలని కోరుకుంటా' అని సునీల్ ఛెత్రి అన్నాడు. వచ్చే నెల 14వ తేదీ నుంచి రష్యాలో జరుగనున్న సాకర్ టోర్నీలో జర్మనీ జట్టు.. జూన్ 17వ తేదీన మెక్సికో టీమ్‌తో తలపడనుంది.

సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో దూసుకెళ్తున్న బెంగళూరు ఎఫ్‌సీ:

సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో దూసుకెళ్తున్న బెంగళూరు ఎఫ్‌సీ:

భారత్‌లో దేశీయంగా సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్న బెంగళూరు ఎఫ్ సీ.. ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్ పోరులో మాత్రం చెన్నైయిన్ ఎఫ్‌సి చేతిలో ఓటమి పాలైంది. కానీ ప్రస్తుతం ఆసియా ఫుట్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సీ) కప్ టోర్నమెంటులో బీఎఫ్‌సీ టీం నాకౌట్ దశలో అర్హత సాధించేందుకు కష్టపడుతుంది.

ముంబైలో ఒకటో తేదీ నుంచి ఖండాంతర ఫుట్‌బాల్ టోర్నీ

ముంబైలో ఒకటో తేదీ నుంచి ఖండాంతర ఫుట్‌బాల్ టోర్నీ

ఇదిలా ఉంటే ముంబైలో నాలుగు ఖండాంతర కప్ టోర్నమెంట్‌లో భారత్ జట్టు పాల్గొననున్నది. జూన్ ఒకటో తేదీ నుంచి న్యూజిలాండ్, చైనీస్ తైపై, కెన్యాతోపాటు పలు దేశాలతో కలిసి ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడనున్నది.

మాంఛెస్టర్ యునైటెడ్‌కు మౌరిన్హో సహచరుడి గుడ్ బై:

మాంఛెస్టర్ యునైటెడ్‌కు మౌరిన్హో సహచరుడి గుడ్ బై:

మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు మేనేజర్ జోస్ మౌరిన్హోకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రుయి ఫారియా జట్టు నుంచి వైదొలుగనున్నాడు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతా భారమైన హ్రుదయంతో మాంఛెస్టర్ యునైటెడ్ జట్టును వీడాలని భావిస్తున్నట్లు రుయి ఫారియా తెలిపాడు. తాను వీడేందుకు ఇదే సరైన సమయం అని చెప్పాడు. రెండేళ్ల క్రితం మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు కోచ్‌గా జోస్ మౌరిన్హో బాధ్యతలు స్వీకరించే నాటికే రుయి ఫారియా అసిస్టెంట్ మేనేజర్‌గా సేవలందిస్తున్నాడు.

జోస్ మౌరిన్హోకు ధన్యవాదాలు ఇలా:

జోస్ మౌరిన్హోకు ధన్యవాదాలు ఇలా:

‘మేనేజర్ జోస్ మౌరిన్హోకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొన్నేళ్లుగా ఆయన నన్ను నమ్మారు. ఇది ఒక విద్యార్థి కల' అని రుయి ఫారియా తెలిపాడు. జోస్ మౌరిన్హో మాట్లాడుతూ ఒకనాడు తెలివైన విద్యార్థి రుయి ఫారియా అని, అతడు ఇప్పుడు ఫుట్ బాల్ నిపుణుడు, ఒక మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించేందుకు అర్హత సాధించాడని ప్రశంసించాడు.

Story first published: Wednesday, May 23, 2018, 14:06 [IST]
Other articles published on May 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X