ఐఎస్ఎల్ కంటే ఐ లీగ్ చాలా టఫ్: అనాస్ ఎడాథోడికా
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) కంటే భారత పుట్ బాల్ ప్రేమికులు ఐ లీగ్ నిర్వహించాలని కోరుతున్నారని మొహున్ బగన్ క్లబ్ జట్టులో కొత్తగా చేరిన డిఫెండర్ అనాస్ ఎడాథోడికా చెప్పాడు. 'ఐఎస్ఎల్ కంటే ఐ లీగ్ చాలా కష్టమైంది' అని అన్నాడు. ఆయన మొహున్ బగాన్ జట్టులో కొత్తగా చేరిన ప్లేయర్. జట్టు సభ్యులతోపాటు ప్రాక్టీస్ లో పాల్గొంటున్న అనాస్ ఎడాథోడికా మీడియాతో మాట్లాడారు.
ఆదివారం కోల్‌కతాలోని రవీంద్ర సరోవర్ స్టేడియంలో చర్చిల్ బ్రదర్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో శుభారంభాన్ని అందుకోవాల్సి ఉందన్నాడు. 'ఐఎస్ఎల్ టోర్నీలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నారు. వారంతా టాప్ క్లాస్ ప్లేయర్లు. ఐ లీగ్ టోర్నీలో అత్యధికులు భారత ఆటగాళ్లే ఆడుతున్నారు. వారంతా చాలా పోటీదారులు. గత ఏడాది నేను ఐ-లీగ్‌లో పాల్గొనలేదు. ఈ ఏడాది ఐ లీగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా' అని ఢిల్లీ డైనమోస్ ప్లేయర్ అనాస్ అన్నాడు.

మొహున్ బగన్ తరఫున ఆడటానికి కారణం ఉంది
తాను మొహున్ బగన్ తరఫున ఆడటానికి కారణం ఉన్నదన్నాడు. ఒక మాజీ ముంబై ఎఫ్ సి, మాజీ పుణె ఎఫ్ సి ప్లేయర్‌గా ‘మొహున్ బగన్ వంటి గొప్ప క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడటం ఒక సవాలే. నాకు అవకాశమొచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. నేను చాలా కష్టపడాల్సి ఉంది' అని అనాస్ ఎడాథోడికా వ్యాఖ్యానించాడు.

11 ఆటగాళ్లతో కూడిన జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యం
‘కింగ్ షుక్ (దేబ్ నాథ్), రాజు (గైక్వాడ్) భాయి వంటి ఆటగాళ్లు ఇక్కడ ఉన్నారు. తొలి 11 ఆటగాళ్లతో కూడిన జట్టులో చోటు దక్కించుకోవడం అంత తేలిక కాదు. నా ఫుట్‌బాల్ కెరీర్‌లో 2009, 2010లలో నాతో పలువురు ఆటగాళ్లు, వ్యక్తులు చెప్పేవాళ్లు. ఒకసారి కోల్‌కతా జట్ల తరఫున ఆడి చూడు అని సూచించే వాళ్లు. నేను ముంబై, పుణె జట్లలో నాలుగేసి ఏండ్ల చొప్పున ఆడా' అని అనాస్ వివరించాడు.

మొహున్ బగన్ క్లబ్ చాలా పెద్దది
‘మొహున్ బగన్ క్లబ్ చాలా పెద్దదని ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం మొహున్ బగన్ అకాడమీ కోచ్ జో పాల్ అంచేరి నాతో చెప్పాడు. ఈ జట్టులో ఆడాలని సలహా ఇచ్చాడు. గతేడాది నాకు అవకాశం ఎక్కడ లభిస్తుందని ఆయన్ను నేను అడిగాను' అని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అనాస్ తోపాటు ట్రైనింగ్ లో పాల్గొంటున్న జెజె లాల్పౌఖ్లా మాట్లాడుతూ గత ఏడాది బెంగళూరు ఎఫ్ సి జట్టు తరఫున ఎఎఫ్ సి కప్ టైటిల్ పోరులో నిలవడం భారత ఫుట్ బాల్ ఆటకు మంచి పేరొచ్చిందన్నాడు. ఈ ఏడాది ఎఎఫ్ సి టోర్నీ టైటిల్ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తామన్నాడు.

టాప్ 3 ముంబై ఎఫ్ సి టార్గెట్: సంతోశ్ కశ్యప్
ఐ లీగ్ టోర్నీలో టాప్ 3 జట్లలో చోటు దక్కించుకోవడమే తమ లక్ష్యమని ముంబై ఎఫ్ సి చీఫ్ కోచ్ సంతోశ్ కశ్యప్ వ్యాఖ్యానించాడు. తమ జట్టు ముందు ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఆకర్షణీయమైన మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంటామన్నాడు. ముంబై ఎఫ్ సి జట్టు నుంచి మీరు అత్యంత ఆకర్షణీయంగా, అటాకింగ్ వ్యూహంతో ఆటను చూస్తారన్నాడు. గత ఆరేళ్లుగా తాము ఇప్పటివరకు ఒక విధానంతో ఆడామని, లక్ష్య సాధనకు క్రుషి చేస్తామన్నాడు. మొహున్ బగన్ సారథి స్టీవెన్ డయాస్ మాట్లాడుతూ జట్టు ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను జిపిఎస్ వ్యవస్థ ద్వారా పరిశీలిస్తామన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications