Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎటికెపై గోయెంకా వ్యాఖ్యలు: గందరగోళం సృష్టించాయి

కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో ఎడిషన్ చాంపియన్లు అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా వ్యాఖ్యలు.. సంతోషానికి మారుపేరైన కోల్‌కతా నగర ఫుట్‌బాల్ అభిమానుల మధ్య గందరగోళం స్రుష్టించారని ఐ - లీగ్ మాజీ చాంపియన్ మొహున్ బగన్ చీఫ్ కోచ్ సంజయ్ సేన్ అన్నాడు.

ఎటికె క్లబ్ హెడ్ ఇన్వెస్టర్ సంజీవ్ గోయెంకా పలు సందర్భాల్లో ఐఎస్ఎల్, ఐ - లీగ్‌లను విలీనం పట్ల అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. కోల్‌కతా నగరంలో ఒక్క క్లబ్ జట్టు మాత్రమే ఉండాలన్న భావనలో సంజీవ్ గోయెంకాలో ఉంది. మరో రెండు వారాల్లో ఐ - లీగ్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొహున్ బగన్ చీఫ్ కోచ్ సంజయ్ సేన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రతి సిటీలోనూ ఒక్క టీం మాత్రమే ఉండాలి

ప్రతి సిటీలోనూ ఒక్క టీం మాత్రమే ఉండాలి

‘కోల్ కతా నగరంలో ఇతర జట్ల కంటే అట్లెటికో డి కోల్ కతా క్లబ్ జట్టు మాత్రమే అత్యంత ప్రజాదరణ గల టీం. ప్రతి సిటీలోనూ ఒక్క టీం మాత్రమే ఉండాలి. ప్రతి సిటీలో ఒకటి కంటే ఎక్కువ జట్లు ఎందుకు?'అని ఈ నెల 18న జరిగిన ఐఎస్ఎల్ టైటిల్ పోరులో మూడేళ్లలో రెండోసారి అట్లెటికో డి కోల్‌కతా జట్టు విజయం సాధించిన తర్వాత సంజీవ్ గోయెంకా పై వ్యాఖ్యలు చేశారు.

గందరగోళం సృష్టించిన సంజీవ్ గోయెంకా వ్యాఖ్యలు

గందరగోళం సృష్టించిన సంజీవ్ గోయెంకా వ్యాఖ్యలు

సంజీవ్ గోయెంకా వ్యాఖ్యలు కోల్‌కతా నగరంలో భారీగా గల ఫుట్ బాల్ క్రీడ మద్దతు దారుల మధ్య గందరగోళం నెలకొల్పారని, ఆయన వ్యాఖ్యలు ఫుట్ బాల్ క్రీడకు వారసత్వంగా వస్తున్న మొహున్ బగన్, ఈస్ట్ బెంగాల్ క్లబ్‌లే లక్ష్యంగా ఉన్నాయని సంజయ్ సేన్ వ్యాఖ్యానించాడు. తాను దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేసినా వివాదానికి దారి తీస్తుందన్నాడు.

ఏ క్లబ్ కు అత్యధిక అభిమానులు ఉన్నారో తెలుస్తుంది

ఏ క్లబ్ కు అత్యధిక అభిమానులు ఉన్నారో తెలుస్తుంది

సంజీవ్ గోయెంకా సరైన రీతిలో స్పందిస్తే బాగుంటుందన్నాడు. రాబోయే రోజుల్లో ఏ క్లబ్ కు అత్యధిక అభిమానులు ఉన్నారో తెలుస్తుందని స్పష్టం చేశాడు. ‘వారు మేకపిల్లలా అటూఇటూ గెంతడం తప్ప, మేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని పేర్కొన్నాడు. తనపై అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించిన నేపథ్యంలో సంజీవ్ గోయెంకా వ్యాఖ్యలపై సంజయ్ సేన్ ఆచితూచి స్పందించాడు.

ఇండియన్ సూపర్ లీగ్, ఐ - లీగ్ విలీనమయ్యేందుకు రంగం సిద్ధం

ఇండియన్ సూపర్ లీగ్, ఐ - లీగ్ విలీనమయ్యేందుకు రంగం సిద్ధం

2017 - 18 నుంచి ఇండియన్ సూపర్ లీగ్, ఐ - లీగ్ విలీనమయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయమై ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల ఫుట్‌బాల్ క్లబ్‌ల మధ్య విభేదాలు ప్రస్పుటంగా బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో మొహున్ బగన్ క్లబ్ తిరిగి ఐ - లీగ్ టైటిల్ గెలుచుకోవడంపైనే అంతా కేంద్రీకరించింది. వచ్చేనెల మొదటి వారంలో మొహన్ బగన్, చర్చిల్ బ్రదర్స్ మధ్య తొలి పోటీ పడనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+