Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐ లీగ్: మినర్వ పంజాజ్ మెంటార్‌గా అభినవ్ బింద్రా

చండీగఢ్: వచ్చేనెల ఏడో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐ - లీగ్ టోర్నీలో నూతన జట్టుగా మినర్వ పంజాబ్ ఫుట్ బాల్ క్లబ్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం తమ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు గురువుగా ఒలింపిక్ స్వర్ణ పతకధారి, ప్రముఖ భారతీయ షూటర్ అభినవ్ బింద్రాను నియమించింది.

ఐ లీగ్‌లో వచ్చేనెల 8వ తేదీన మినర్వ పంజాబ్ క్లబ్ ప్రయాణం మొదలవుతుంది. పంజాబ్ మినర్వ వచ్చేనెల ఎనిమిదవ తేదీన మరో నూతన జట్టు చెన్నై ఎఫ్ సి తలపడనున్నది. మినర్వ పంజాబ్ చీఫ్ రంజిత్ బజాజ్ ఫోన్‌లో మాట్లాడుతూ 'నాకు బింద్రాతో మంచి సంబంధాలు ఉన్నాయి. బీజింగ్ ఒలింపిక్స్‌కు ముందు నిర్వహించిన శిక్షణలో ఆయన అంకిత భావాన్ని నేను గమనించా. ఆ తర్వాత ఆయన స్వర్ణ పతకం గెలుచుకోగలిగాడు' అని అన్నాడు. 'ఆయన ఎలా శిక్షణ ఇస్తాడు, ఇతర ప్లేయర్లలో ఎలా ప్రేరణ కల్పిస్తాడు. ఆయన ఇందులో మాస్టర్ అని నాకు తెలుసు. అందుకే ఆయనను మా టీం గురువుగా వచ్చి చేరాలని బింద్రాను ఆహ్వానించాం' అని తెలిపాడు.

'ఆయన ప్రతి నెలా రెండు, మూడుసార్లు తమ టీం ఫుట్‌బాలర్లకు మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తాడు. ఇప్పటికే ఒకసారి క్లాస్ నిర్వహించడం జరిగింది' అని తెలిపాడు. బింద్రాతోపాటు మినర్వ పంజాబ్ ఎఫ్ సి క్లబ్ కూడా చండీగఢ్‌లోని బింద్రా హై పెర్పార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకున్నది. చండీగఢ్ లో గల ఈ ట్రైనింగ్ సెంటర్ సమీపాన మినర్వ పంజాబ్ జట్టు ఆటగాళ్లు ఫిట్ నెస్ శిక్షణ పొందుతున్నారు.

టీం కోచ్ సురిందర్ సింగ్ కూడా బింద్రాను అభినందించాడు. 'అభినవ్ మాకు గంటన్నర క్లాస్ తీసుకున్నాడు. వెనుకబడి ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి ముందుకు దూసుకెళ్లడం ఎలా అన్న విషయమై ఆయన బోధన సమ్మతంగానే ఉంది. అద్భుతమైన బింద్రా సమ్మతమైన పద్ధతిని తెలుసుకునేందుకు ఫుట్ బాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్ లో తమ జట్టు గత పెర్పార్మెన్స్ కంటే మెరుగ్గా ఆడుతుందని ఆశిస్తున్నా' అని సురిందర్ సింగ్ అన్నాడు.

బాల్లోన్ డి’ఓర్ తోనే ముగింపు: నేయ్మార్

బాల్లోన్ డి’ఓర్ తోనే ముగింపు: నేయ్మార్

ఫిఫా ప్రతియేటా ఇచ్చే బాల్లోన్ డి'ఓర్ అవార్డు గెలుచుకోకుండా తాను ఫుట్ బాల్ నుంచి వైదొలగనని లా లీగ లీగ్ జెయింట్స్ ఎఫ్ సి బార్సిలోనా స్టార్ ప్లేయర్ కమ్ ఫార్వర్డ్ ప్లేయర్ నేయ్మార్ తేల్చి చెప్పాడు. హ్యాపీగా ఉండేందుకే తాను ఫుట్ బాల్ ఆడుతున్నానన్నాడు. కానీ వ్యక్తిగత గౌరవం కోసం కాదని స్పష్టంచేశాడు. ఈ ఏడాది ఫుట్ బాల్ అత్యున్నత అవార్డు ‘బాల్లోన్ డి'ఓర్' అవార్డుకు ఎంపిక చేసిన ముగ్గురు క్రీడాకారుల జాబితాలో తన పేరు రానందుకు బాధ లేదన్నాడు.

ఆ అవార్డు ఫుట్ బాల్ ఆటకు ప్రేరణ

ఆ అవార్డు ఫుట్ బాల్ ఆటకు ప్రేరణ

బాల్లోన్ డి'ఓర్ అవార్డు ఫుట్ బాల్ ఆటకు ఒక ప్రేరణ వంటిదని, దాన్ని గెలుచుకోకుండా తాను మరణించనని శపథం చేశాడు. ఈ బ్రెజిలియన్ ఫార్వర్డ్ పేరు గత ఏడాది జాబితాలో చోటు చేసుకున్నా అవార్డును ఆయన సహచర ప్లేయర్ లియానెల్ మెస్సీ ఎగరేసుకుపోయాడు. అదొక్కటి మినహా తాను, తమ బార్సిలోనా జట్టు చాలా హ్యాపీగా ఉన్నామన్నాడు. ఒకవేళ బాల్లోన్ డి'ఓర్ అవార్డు గెలుచుకోకుండా జరిగే మార్పేమీ లేదని, తాను ఆ అవార్డు కోసం ఫుట్ బాల్ ఆడటం లేదన్నాడు.

రియల్ మాడ్రిడ్ కంటే మూడు పాయింట్లు తక్కువ

రియల్ మాడ్రిడ్ కంటే మూడు పాయింట్లు తక్కువ

తాను సంతోషంగా ఉండేందుకు మాత్రమే ఆడుతున్నానని, ప్రతిఏటా ఒక్కరికి మాత్రమే బాల్లోన్ డి'ఓర్ అవార్డు లభిస్తుందని గుర్తుచేశాడు. ఈ ఏడాది లా లీగ టోర్నీలో తమ చిరకాల ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే మూడు పాయింట్లు తక్కువగా ఉన్నా.. టైటిల్ గెలుచుకునే అవకాశాలకు కొదవలేదన్నాడు. దీన్ని కైవసం చేసుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం సాగించాల్సి ఉంటుందన్నాడు. తాము కేవలం తమ మ్యాచ్ లపై మాత్రమే కేంద్రీకరించామని, రియల్ మాడ్రిడ్ గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నాడు.

లియానెల్ మెస్సీ, లూయిస్ సౌరేజ్‌లతో సంబంధాలు

లియానెల్ మెస్సీ, లూయిస్ సౌరేజ్‌లతో సంబంధాలు

గత ఏడాది కేవలం 11 పాయింట్లతో సెకండాఫ్ లో ప్రవేశించినా టైటిల్‌ను గెలుచుకున్నామని గుర్తుచేశాడు. ప్రతి మ్యాచ్ కూడా క్లిష్టతరంగానే ఉంటుందని చెప్పారు. తమ సహచర ప్లేయర్లు లియానెల్ మెస్సీ, లూయిస్ సౌరేజ్ లతో సంబంధాలు చాలా బాగున్నాయన్నాడు. తాము చరిత్ర స్రుష్టిస్తామని చెప్పాడు. ఒక బ్రెజిలియన్, ఒక అర్జెంటైనీయన్, మరొక ఉరుగ్వేయన్ ప్లేయర్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో ప్రత్యర్థులమైనా వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని చెప్పాడు. తమ సహచరుడు అండ్రెస్ ఇనైస్టా వంటి ఆటగాళ్లు ప్రపంచంలోనే లేరని తేల్చి చెప్పాడు. ఆయన చాలా చాలా విభిన్నమైన ఆటగాడని తెలిపాడు. రెస్ట్ నుంచి మ్యాచ్ వరకు క్లాసికల్‌గా వ్యవహరించే ఆటగాడని, చాలా క్వాలిటీలు గల మిడ్ ఫీల్డర్ అని ప్రశంసించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+