ఐ లీగ్: 8వ వారం షెడ్యూల్, ఛానెల్ సమచారం
హైదరాబాద్: ఐలీగ్ శుక్రవారం (ఫిబ్రవరి 10) నాటికి 8వ వారానికి చేరుకుంది. చర్చిల్ బ్రదర్స్‌పై ఐజ్వాల్ ఎఫ్‌సి విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి ఎగబాకింది. లీగ్‌లో భాగంగా ఈ వారం ఈస్ట్ బెంగాల్, మొహున్ బాగన్‌ల మధ్య జరిగే మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది.
ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ఈస్ట్ బెంగాల్ జట్టు రెండో స్ధానంలో ఉన్న మొహున్ బాగన్ జట్టుతో కోల్‌కతా డెర్బీ స్టేడియంలో తలపడనుంది. పుట్‌బాల్ అభిమానులందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి.
మరోవైపు బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో బెంగుళూరు ఎఫ్‌సి జట్టు మినర్వా పంజాబ్ ఎఫ్‌సి జట్టుతో ఆడనున్న మ్యాచ్ కూడా ప్రతిష్టాత్మకం కానుంది. టోర్నీలో ముందుకెళ్లాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత మూడు మ్యాచ్‌ల్లో బెంగుళూరు ఎఫ్‌సి జట్టు ప్రదర్శన అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల ద్వారా బెంగుళూరు ఎఫ్‌సి కేవలం ఒక్క పాయింట్ మాత్రమే దక్కించుకుంది. లీగ్ టేబుల్‌లో బెంగుళూరు ఎఫ్‌సి ఐదో స్ధానంలో ఉంది.
8వ వారంలో జరగనున్న మ్యాచ్‌లు:
శుక్రవారం, ఫిబ్రవరి 10
ఐజ్వాల్ ఎఫ్‌సి Vs చర్చిల్ బ్రదర్స్ - 2:05 PM (IST) (LIVE on TEN 2)
శనివారం, ఫిబ్రవరి 11
షిల్లాంజ్ లాజోంగ్ Vs డీఎస్కే శివాజియన్స్ - 4:35 PM (IST) (No LIVE Telecast)
చెన్నై సిటీ ఎఫ్‌సి Vs ముంబై ఎఫ్‌సి - 7:05 PM (IST) (LIVE on TEN 2)
బెంగుళూరు ఎఫ్‌సి Vs మినర్వా పంజాబ్ ఎఫ్‌సి - 7:05 PM (IST) (No LIVE Telecast)
ఆదివారం, ఫిబ్రవరి 12
ఈస్ట్ బెంగాల్ Vs మొహున్ బాగన్ - 4:35 PM (IST) (LIVE on TEN 2)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications