Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రేపటి నుంచి ఐ లీగ్ ప్రారంభం: షెడ్యూల్ ఇదే

హైదరాబాద్: ఐ లీగ్ పదో ఎడిషన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. శనివారం డిఫెండింగ్ చాంపియన్లు బెంగళూరు ఎఫ్‌సి జట్టుతో షిల్లాంగ్ లాజొంగ్ టీమ్ పోటీ పడనున్నది. కోల్‌కతాలోని బారసాత్ స్టేడియంలో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టుతో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. నార్త్ ఈస్ట్ ఇండియన్ క్లబ్ షిల్లాంగ్ లాజోంగ్ జట్టుతోనూ బెంగళూరు ఎఫ్ సి టీం పోటీ పడుతుంది.

ఆదివారం మొహున్‌బగన్ జట్టుతో గోవా జెయింట్స్ చర్చిల్ బ్రదర్స్ తలపడుతుంది. ఇంతకుముందు ఎఐఎఫ్ఎఫ్ లైసెన్సింగ్ ప్రమాణాలకు అందుబాటులో లేక చర్చిల్ బ్రదర్స్ జట్టు గత మూడు ఐ లీగ్ ఎడిషన్లకు దూరంగా ఉంది. కానీ ఇప్పుడు రెండుసార్లు ఐ - లీగ్ చాంపియన్లు‌గా నిలిచిన బెంగళూరు ఎఫ్ సి జట్లతో తలపడుతున్నది.

దీనికి తోడు రెండు కొత్త టీమ్‌లు మినర్వ పంజాబ్, చెన్నై సిటీ ఎఫ్ సి జట్లు తొలిసారి తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర జట్లు ముంబై ఎఫ్‌సి, డిఎస్‌కె శివాజియన్స్ కూడా తలపడనున్నాయి.

I-League 2016/17: Schedule of game week 1 and channel information

ఐ - లీగ్ టోర్నీలో తొలి వారం జరిగే షెడ్యూల్:
జనవరి 7, శనివారం:
ఈస్ట్ బెంగాల్ వర్సెస్ ఐజ్వాల్ ఎఫ్ సి - సాయంత్రం 4.30 గంటలు (టెన్ 2/హెచ్‌డిలో ప్రత్యక్ష ప్రసారం).
బెంగళూరు ఎఫ్ సి వర్సెస్ షిల్లాంగ్ లాజోంగ్ - రాత్రి 7 గంటలు (టెన్ 2/హెచ్‌డిలో ప్రత్యక్ష ప్రసారం)

జనవరి 8, ఆదివారం:
చెన్నై సిటీ ఎఫ్ సి వర్సెస్ మినర్వ పంజాబ్ - సాయంత్రం 4.30 గంటలు (టెన్ 2/హెచ్‌డిలో ప్రత్యక్ష ప్రసారం).
మొహున్ బగన్ వర్సెస్ చర్చిల్ బ్రదర్స్ - రాత్రి 7 గంటలు (టెన్ 2/హెచ్‌డిలో ప్రత్యక్ష ప్రసారం)
ముంబై ఎఫ్ సి వర్సెస్ డిఎస్ కె శివాజీయన్స్ రాత్రి 7 గంటలు (ప్రత్యక్ష ప్రసారం లేదు)

సుబ్రతా పాల్ సారథ్యంలో డిఎస్‌కె శివాజీయన్స్‌
పుణె కేంద్రంగా ఐ - లీగ్ టోర్నీలో పాల్గొంటున్న డిఎస్ కె శివాజియన్ జట్టు పూర్తిగా కొత్త లుక్ సంతరించుకున్నది. అనుభవం గల ప్లేయర్లు సంజు ప్రధాన్, సోరం పౌరెరీ, రికీ ఎల్, నిర్మల్ ఛెత్రిలతోపాటు సుబ్రతా పాల్ వంటి స్టాల్ వర్ట్ కూడా ఈ జట్టులో భాగస్వాములుగా ఉన్నారు. జెర్రీ లాల్రింజువాలా, హాలీ చరణ్ నార్జారే, సుమీత్ పస్సీలను జట్టు మేనేజర్ డేవ్ రోజర్స్ ఇటీవల నియమించారు.

డిఎస్‌కె శివాజియన్స్ జట్టు ఈ నెల 8న ముంబై ఎఫ్ సి టీంతో తలపడుతుంది. ఈ జట్టులో మాజీ రియల్ మాడ్రిడ్ ప్లేయర్ జువాన్ ఖ్వెరో, ఆసియా ఖండం ఆటగాళ్ల జాబితాలో నార్త్ కొరియన్ ఇంటర్నేషనల్ కిం సాంగ్ యాంగ్ టీంలో చోటు దక్కించుకున్నాడు. విదేశీ ఆటగాళ్ల జాబితాలో ఐరిష్ మిడ్ ఫీల్డర్ షన్ మైక్ ఫాల్, సెర్బియా సెంటర్ బ్యాక్ సాషా కొలుంజియా ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+