జోస్ మౌరిన్హోతో నో ప్రాబ్లం.. తేల్చేసిన పాల్ పోగ్బా

హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా తనకు జట్టు మేనేజర్ జోస్ మౌరిన్హోతో ఎటువంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. కానీ వారిద్దరి మధ్య సంబంధాలు మరీ బలహీనంగా ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. గత జనవరిలో ట్రాన్స్ ఫర్ విండోలో మాంచెస్టర్ సిటీ జట్టులో చేరిపోవాలని పోగ్బా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మాంచెస్టర్ యునైటెడ్ జట్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో సెవిల్లా జట్టుతో జరిగిన 16 ఎగ్జిట్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ ఫ్రాన్స్ మిడ్ ఫీల్డర్ ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించాడు. బ్రింగ్టన్, హోవ్ అల్బియన్, టొట్టెన్ హం జట్లపై గతవారం జరిగిన మ్యాచుల్లో యునెటైడ్ మాంచెస్టర్ యునైటెడ్ జట్లు విజయం సాధించడంలో పాల్ పోగ్బా కీలక పాత్ర పోషించాడు.

థ్రిల్లింగ్ విజయాల సాధనలో ముందున్న పోగ్బా
శనివారం ఎఫ్ఎ కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో వింబ్లేలో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంలో అలెక్సిస్ సాంచెజ్‌కు సాయం చేయడంలో సహకరించాడు. ఇంతకుముందు ప్రీమియర్ లీగ్ టోర్నీలో మాంచెస్టర్ సిటీ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు థ్రిల్లింగ్‌గా గోల్స్ సాధించి విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. కానీ మేనేజర్ జోస్ మౌరిన్హోతో ఎటువంటి సమస్యలు లేవని పాల్ పోగ్బా తెలిపాడు.

జోస్ మౌరిన్హోతో విభేదాల్లేవన్న పోగ్బా
‘నాకు ఆయన (జోస్ మౌరిన్హో)తో ఎటువంటి విభేదాలు లేవు. ఆయన నాకు సమస్య అని నేను భావించడం లేదు' అని పోగ్బా ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. ‘ఆయన మాంఛెస్టర్ యునైటెడ్ క్లబ్ జట్టుకు నన్ను కెప్టెన్‍గా నియమించి నాపై గురుతర బాధ్యతలు పెట్టారు. నేను ఒక ఆటగాడిగా మెరుగైన ఆటతీరు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు' అని పాల్ పోగ్బా అన్నాడు.

జోస్ మౌరిన్హో నిర్ణయాల అమలు బాధ్యత తనదేనన్న పోగ్బా
‘ఆయన (జోస్ మౌరిన్హో) మా జట్టు కోచ్. జట్టు కోచ్ కం మేనేజర్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని ఒక ప్లేయర్‌గా అమలు చేయడం నా బాధ్యత. వాటిని నేను ఆమోదించాల్సిందే. ఆయన నిర్ణయాలకు అనుగుణంగా పిచ్‌పై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది' పాల్ పోగ్బా తేల్చేశాడు.

ట్రాన్స్‌ఫర్ విండో ఆఫర్‌పై మాంఛెస్టర్ సిటీ మేనేజర్ ఇలా
ప్రీమియర్ లీగ్ టోర్నీలో తొలిసారి చాంపియన్స్‌గా ఎదిగిన జట్టు మాంఛెస్టర్ సిటీ జట్టు మేనేజర్ కం కోచ్ పెప్ గౌర్డియోలా మాట్లాడుతూ గత జనవరిలో ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా పాల్ పోగ్బా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించానని తెలిపాడు. పాల్ పోగ్బాకు ట్రాన్స్‌ఫర్ విండో ఆఫర్ ఇచ్చానని చెప్పాడు.

మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు నుంచి తరలి వెళ్లేందుకు పోగ్బా ‘నో'
కానీ పోగ్బా మాత్రం ఓల్డ్ ట్రాఫ్ఫర్డ్ జట్టు వైపు తరలి వెళ్లేందుకు సిద్దంగా లేడు. లీగ్ 1 చాంపియన్స్ పారిస్ సెయింట్ జెర్మైన్ జట్టుతో కలిసి పని చేయాలని పోగ్బా ప్రయత్నాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి మాంఛెస్టర్ యునైటెడ్ జట్టుతోనే కొనసాగిస్తున్నా. ఎఫ్ఎ కప్, వరల్డ్ కప్ టోర్నీ వరకు ఈ జట్టుతోనే ఉంటాననని తెలిపాడు. ఇంతకుముందు గానీ, ఇక ముందు గానీ ట్రాన్స్‌ఫర్ గురించి నేను ఆలోచించను' అని పోగ్బా తేల్చి చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications