న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

షేర్వానీ లుక్‌లో: హీరో వెంకటేష్ చేతుల మీదుగా హైదరాబాద్ ఎఫ్‌సి జెర్సీ ఆవిష్కరణ

Hyderabad FC Launches Jersey Ahead of Indian Super League 2019-20

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) కొత్తగా ఈ ఏడాది హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ప్రవేశించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20 నుంచి ఆరంభం కానున్న 6వ సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తలడనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడుగా ఎన్నికైన మహమ్మద్ అజహరుద్దీన్, సినీ నటుడు వెంకటేశ్ హాజరయ్యారు. హైదరాబాద్ సంస్కృతి, నిజాం నవాబుల నగర వారసత్వాన్ని ప్రతిబింబించేలా షేర్వానీ లుక్‌లో పసుపు, నలుపు రంగులతో జెర్సీని రూపొందించారు.

నా పిల్లల మీద ఒట్టు.. నేను మ్యాచ్ ఫిక్సింగ్‌ చేయలేదు: టీమిండియా క్రికెటర్నా పిల్లల మీద ఒట్టు.. నేను మ్యాచ్ ఫిక్సింగ్‌ చేయలేదు: టీమిండియా క్రికెటర్

వెంకటేశ్ మాట్లాడుతూ

వెంకటేశ్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా సినీ నటుడు వెంకటేశ్ మాట్లాడుతూ "ఓ క్రీడాభిమానిగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఫ్రాంచైజీకి స్వాగతం పలుకుతున్నా. ఐఎస్‌ఎల్‌లో తలపడేందుకు ఇప్పుడు మనకంటూ ఓ జట్టు ఉందని సంతోషం కలుగుతోంది. హైదరాబాద్‌ నుంచి పలువురు అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో ఎనిమిది మంది హైదరాబాదీలే. ఈ క్లబ్‌తో మళ్లీ నగరానికి సాకర్‌ వైభవం రావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

అజహరుద్దీన్ మాట్లాడుతూ

అజహరుద్దీన్ మాట్లాడుతూ

హెచ్‌సీఏ ఆధ్యక్షుడు అజహరుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌ ఎఫ్‌సీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొమ్మిదేళ్ల క్రితమే తాను ఫుట్‌బాల్‌ అభివృద్ధికి తపించానని, అది కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చారు. కోచ్ ఫిల్ బ్రౌన్ దిశానిర్దేశంలో ఐఎస్‌ఎల్ టోర్నీలో హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని పేర్కొన్నారు.

ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం

ఇక, హైదరాబాద్ ఎఫ్‌సి సహ యజమాని విజయ్‌ మద్దూరి మాట్లాడుతూ నగరంలో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఫుట్‌బాల్‌లో చక్కని చరిత్ర ఉందని, తమ జట్టు దానిని మరింత బలబరిచేందుకు కృషి చేస్తుందని మరో యజమాని వరుణ్‌ త్రిపురనేని అన్నారు.

అక్టోబర్ 25న కోల్‌కతా (ఏటీకే)తో తొలి మ్యాచ్

అక్టోబర్ 25న కోల్‌కతా (ఏటీకే)తో తొలి మ్యాచ్

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లను పరిచయం చేశారు. అక్టోబర్ 20న ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఆరో సీజన్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా అక్టోబర్ 25న అథ్లెటికో డీ కోల్‌కతా (ఏటీకే)తో హైదరాబాద్ ఎఫ్‌సి తొలి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Monday, September 30, 2019, 11:42 [IST]
Other articles published on Sep 30, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X