Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘గుడ్ బై’: లియోనల్ మెస్సీ సంచలన నిర్ణయం

ఈస్ట్ రూథర్‌ఫర్డ్(యూఎస్ఏ): కోపా అమెరికా టోర్నీ ఫైనల్లో ఓటమి చవిచూసిన అర్జెంటీనా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు లియోనల్‌ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

కోపా అమెరికాలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా అనూహ్యంగా చిలీ చేతిలో ఓటమి పాలవ్వడంతో మెస్సీ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం మెస్సీ మీడియాతో మాట్లాడుతూ.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు తాను దూరమవుతున్నానని.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి తాను రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఇది తన సొంత నిర్ణయమని.. ఇదే చాలా మంది కోరుకుంటున్నారని అన్నాడు.
జట్టును గెలిపించేందుకు తాను చాలా కష్టపడ్డానని.. కానీ ఇప్పుడు వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. మరో రెండేళ్లలో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఉండగా.. మెస్సీ రిటైర్మెంట్‌ నిర్ణయం అర్జెంటీనా జట్టుకు పెను భారమే కానుంది. కాగా, మెస్సీ నిర్ణయం పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

కోపా అమెరికా శతకోత్సవ పుట్‌బాల్‌ టోర్నీలో నంబర్‌ వన్‌ జట్టు అర్జెంటీనా ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా, పైనల్లో దిగ్గజ ఆటగాడు మెస్సీ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చిలీ చేతిలో అర్జెంటినా 4-2 తేడాతో ఓడిపోయింది. పెనాల్టీ షూటౌట్‌లో చిలీ నాలుగు గోల్స్‌ చేయగా... మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా కేవలం రెండు గోల్స్‌ మాత్రమే చేసింది. గత కొన్నేళ్లుగా మేజర్‌ టైటిళ్లకు దూరమైన అర్జెంటినా కోపాలో గెలుపుకోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.

ఒప్పందంలో మార్పులు లేవు: టాటా మోటార్స్

మెస్సీ రిటైర్మెంట్‌తో తమ మధ్య ఒప్పందంలో ఎటువంటి మార్పులు రావని టాటామోటార్స్‌ ప్రకటించింది. మెస్సీ టాటామోటార్స్‌ అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. గత నవంబర్‌లో టాటామోటర్స్‌ ఈ సాకర్‌ స్టార్‌ను ప్యాసింజర్‌ కార్లకు రెండేళ్లకు గ్లోబల్‌ మార్కెట్‌ ప్రచార కర్తగా నియమించుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+