Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హుమ్ గోల్: కోల్‌కతా, నార్త్ ఈస్ట్ మ్యాచ్ డ్రా

కోల్‌కతా: హీరో ఇండియన్ సూపర్ లీగ్‌ (ఐఎస్ఎల్) లీగ్ మ్యాచ్లో చివరి నిమిషంలో ఇయాన్ హుమ్ చేసిన గోల్‌తో స్కోర్ సమంగా మారి గురువారం రాత్రి కోల్ కతా, నార్త్ఈస్ట్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అట్లెటికో డి కోల్‌కతా - నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్లు చెరో గోల్ చేయడంతో 1-1 స్కోర్ తేడాతో డ్రాగా ముగిసింది.

వాస్తవంగా 12 వేల మందికి పైగా అభిమానుల సమక్షంలో స్థానిక రవీంద్ర సరోబార్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ జట్టు గెలవాల్సింది. మ్యాచ్ ప్రారంభంలో నికోలస్ వెలేజ్ చేసిన గోల్‌తో చివరి వరకూ ఆధిక్యంలో కొనసాగింది. కానీ ఆఖరి నిముషంలో ఇయాన్‌హుమ్ గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

 ఇరు జట్లకు చెరో పాయింట్

ఇరు జట్లకు చెరో పాయింట్

దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. తత్ఫలితంగా అట్లెటికో డీ కోల్ కతా పది మ్యాచ్‌లలో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండటం సౌరవ్ గంగూలీ సేనకు సంతోషకరమైన వాతావరణమే. ఇక నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 11 పాయింట్లతో ఏడో స్థానానికి చేరింది. తొలుత నార్త్ఈస్ట్ జట్టు గత మూడు వారాల్లో రెండు మ్యాచ్‌లలో విజయం ద్వారా టాప్ స్థానంలో కొనసాగుతూ వచ్చినా.. తర్వాత పరిస్థితి మారిపోయింది.

తీవ్రమైన ఒత్తిడి

తీవ్రమైన ఒత్తిడి

కీలకమైన ఆటగాళ్లు గల కోల్ కతా కుర్రాళ్లు నార్త్ఈస్ట్ గోల్ బాక్స్ వద్ద తీవ్రమైన ఒత్తిడి తేవడానికి ప్రాధాన్యం ఇచ్చారు.దీంతో కంగుతిన్న కోల్‌కతా జట్టు గోల్‌కోసం ముమ్మర దాడులతో మ్యాచ్‌లో ఉత్కంఠను పెంచింది. పటిష్ఠమైన నార్త్‌ఈస్ట్ డిపెన్స్‌ను ఛేదించడంలో కోల్‌కతా బృందం విఫలమైంది. తొలిఅర్ధభాగంలోనూ, రెండో అర్ధభాగంలోనూ నార్త్‌ఈస్ట్ డిఫెండర్లు కోల్‌కతాను నిలువరించారు.

 నార్త్ ఈస్ట్ ఖాతాలో గోల్

నార్త్ ఈస్ట్ ఖాతాలో గోల్

మ్యాచ్ మొదలైన ఐదు నిమిషాల్లో హెన్రిక్యూ సెరెనో డిఫెన్సివ్ లోపంతో అట్లెటికో డీ కోల్‌కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్‌ను దాటుకుని అర్జెంటీన్ ఫార్వర్డ్ ప్లేయర్ నెలె వెలెజ్ బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించడంతో నార్త్ ఈస్ట్ ఖాతాలో గోల్ చేసి ఒక పాయింట్ లీడ్ సాధించింది. దీంతో కోల్‌కతా ఆటగాళ్లు నార్త్ఈస్ట్‌పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. జావీ లారా కుడివైపు నుంచి ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై గురిపెట్టాడు.

 సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్న నార్త్ ఈస్ట్ డిఫెన్స్

సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్న నార్త్ ఈస్ట్ డిఫెన్స్

తొలిసారిగా లారా కార్నర్‌గా పంపిన కిక్ షాట్ ను నార్త్ ఈస్ట్ డిఫెన్స్ మధ్యలోనే సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా మరోసారి లారా పంపిన ప్రీ కిక్ బంతిని నార్త్ఈస్ట్ ప్లేయర్ రోలిన్ బోర్జెస్ అద్భుతమైన కౌశల్యం ప్రదర్శించి తెలివిగా తిరగొట్టాడు. ప్రారంభదశలోనే గోల్ సాధించిన నార్త్ఈస్ట్ ఉత్సాహంగా.. దానిపై కోల్ కతా పాయింట్ కోసం ఉక్రోశంగా పోటీ పడ్డాయి.

 అటాకింగ్ వ్యూహంతో ముందుకు

అటాకింగ్ వ్యూహంతో ముందుకు

జావీ లారా, ఇయాన్ హుమ్, పియర్సన్, హెల్డర్ పొస్టిగ వంటి కీలక ప్లేయర్లు అటాకింగ్ వ్యూహంతో ముందుకు వెళ్లినా నార్త్ఈస్ట్ డిఫెన్స్ ముందు కోల్‌కతా ఆటలు సాగలేదు. నార్త్ఈస్ట్ గోల్ కీపర్ సుబ్రతాపాల్ అప్రమత్తంగా వ్యవహరిస్తూ జట్టును రక్షించుకోగలిగాడు. సెకండాఫ్‌ చివరి పది నిమిషాల్లో నార్త్ఈస్ట్‌కు బంగారం లాంటి అవకాశం చిక్కింది. కోల్‌కతా గోల్‌పోస్ట్ వద్ద ఇరు జట్లు బంతిపై పట్టుకోసం ప్రయత్నిస్తుండగా అది నార్త్ఈస్ట్ స్ట్రయికర్ ఎమిలియానో అల్ఫారో వద్దకు చేరింది.

 విజయవంతంగా అడ్డుకున్న మజుందార్

విజయవంతంగా అడ్డుకున్న మజుందార్

దాన్ని అతడు నేరుగా గోల్ పోస్ట్ కు పంపకుండా కార్నర్ వైపు పంపేందుకు యత్నించాడు. అక్కడే సిద్ధంగా ఉన్న కోల్ కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ విజయవంతంగా అడ్డుకున్నాడు. చివరిక్షణంలో జట్టు సారధి హెల్డర్ పొస్టిగకు జావీలారా పంపిన బంతిని తన హెడ్డర్ ద్వారా ఇయాన్ హుమ్‌ వైపు మళ్లించగా, అతడు గోల్‌పోస్ట్‌లోకి నెట్టేశాడు. దీంతో కోల్ కతా చివరి క్షణంలో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+