Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెచ్చిపోతున్న ఢిల్లీకి అట్లెటికో డీ కోల్‌కతా ముకుతాడు

కోల్‌కతా: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ప్రారంభం నుంచి చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోయిన ఢిల్లీ డైనమోస్‌కు అట్లెటికో డీ కోల్‌కతా ముకుతాడు వేసింది. శనివారం కోల్ కతాలోని రవీంద్ర సరోవర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఎటికె చేతిలో ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లు ఓటమి పాలయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిదీంతో ఇప్పటివరకు ఆరు పాయింట్లతో ఐదోస్థానంలో ఉన్న ఎటికె.. మూడు పాయింట్లు పొంది మొత్తం 9 పాయింట్లతో రెండోస్థానానికి చేరుకుని ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకున్నది. ఐఎస్ఎల్ టోర్నీలో ఢిల్లీ డైనమోస్‌పై కోల్‌కతాకిది తొలి విజయంకూడా. ఈ ఎడిషన్‌లో ఢిల్లీ డైనమోస్ జట్టు తొలిసారి పరాజయం పాలైంది.

పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో 78వ నిమిషం వరకూ ఇరుజట్ల మధ్య కొనసాగిన ప్రతిష్ఠంభనకు కోల్‌కతా స్ట్రయికర్ ఇయాన్‌హుమ్ బ్రేకులేసి గోల్ సాధించడంతో ఎటికె 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు 75వ నిమిషంలో ఢిల్లీ కుర్రాడు మార్సెలో లైటీ పెరీరా తనకు వచ్చిన పెనాల్టీ మిస్ చేసుకోవడం.. బాక్స్ లోపల సమీగ్ దౌటీని అడ్డుకొనేందుకు లాల్ఛాంకిమా చేసిన ప్రయత్నం ఇరు జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ సందర్భంగా రిఫరీ బ్రేక్ చేసి, మళ్లీ కోల్ కతాకు ఇచ్చిన అవకాశాన్ని హుమ్ సద్వినియోగంచేసుకున్నాడు. తద్వారా ఈ లీగ్ టోర్నీలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా చరిత్ర నెలకొల్పాడు. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో హెంరిక్యూ సెరెనోను సెకండాఫ్ 72వ నిమిషంలో రెండో వార్నింగ్ తర్వాత సస్పెండ్ చేయడంతో కోల్ కతా జట్టు కేవలం 10 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడాల్సి వచ్చింది.

అంతకుముందు తొలి హాఫ్‌లో మూడు గోల్స్ చేసే అవకాశం వచ్చినా ప్రత్యర్థి జట్టు ఎటికె నుంచి పటిష్ఠమైన, కఠినమైన డిఫెన్స్ ఎదురవ్వడంతో ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లు ముందడుగు వేయలేకపోయారు. అట్లెటికో డీ కోల్‌కతా గోల్ కీపర్ మంజుందార్, డిఫెండర్ ప్రబీర్ దాస్ తమ ప్రత్యర్థి జట్టు గోల్స్ చేసే అవకాశాలను తిప్పికొట్టి తమ జట్టు విజయావకాశాలను మెరుగు పరుచుకున్నారు.

Hume guides ATK to 1-0 win over Delhi Dynamos

ఫస్టాఫ్‌లో పలు హిట్ చాన్స్‌లను మిస్ చేసుకున్నఢిల్లీ కుర్రాళ్లు డిస్సప్పాయింట్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. ప్రారంభం నుంచే ఢిల్లీ మెరుపు ప్లేయర్ మార్సిలిన్హోకు పలు సార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగంచేసుకోలేకపోయాడు.

ఎటికె గోల్ కీపర్ మంజుందార్ మూడుసార్లు బ్యాక్ టు బ్యాక్ సేవ్ చేశాడు. రిచర్డ్ గాడ్జె, మార్కోస్ టేబర్ పంపిన బంతులను తిరగ్గొట్టాడు. అంతకుముందు 22వ నిమిషంలో డిఫెండర్ ప్రబీర్ దాస్...ఢిల్లీకి చెందిన మార్సిలిన్హో పంపిన బంతిని తెలివిగా అడ్డుకున్నాడు.

ఫస్ట్ఆఫ్‌కు ఆరు నిమిషాల ముందు కోల్‌కతా కుర్రాడు డౌటీ గోల్ చేసేందుకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకుని బెలెంసోకు పాస్ చేశాడు. కానీ డొబ్లాస్ పంపిన బంతి వైడ్ గా మారి దూరంగా వెళ్లింది. మరో మూడు నిమిషాలకు వచ్చిన మరో మంచి పాస్‌ను డౌటీ.. ఇయాన్ హుమ్‌కు పంపినా నిష్ప్రయోజనమైంది.

మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలో ఢిల్లీ డిఫెన్స్ నుంచి తప్పించుకుని పాస్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని హుమ్ ఉపయోగించుకున్నాడు. కానీ అతడి పాస్ అందుకుని డౌటీ పంపిన బంతిని ఢిల్లీ గోల్ కీపర్ టోనీ డొబ్లాస్ తిప్పికొట్టారు. ఆ తర్వాత మళ్లీ 17 నిమిషాలకు గోల్ కోసం షాట్ కొట్టే అవకాశం కోల్ కతా కుర్రాళ్లకు లభించింది.

బిక్రంసింగ్ ప్రీ కిక్ ద్వారా డేంజర్ జోన్ నుంచి పంపిన బంతిని ఢిల్లీ మెరుపువీరుడు మార్సెలిన్హో గోల్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎటికె గోల్ కీపర్ డేబ్జిత్ మజుందార్ విజయవంతంగా అడ్డుకున్నాడు.
ఢిల్లీ డైనమోస్‌పైనా..

ప్రస్తుత సీజన్‌లో తొలి విజయాన్ని సొంతంచేసుకున్న అట్లెటికో డీ కోల్‌కతా కోచ్ జోస్ మొలీనా మాట్లాడుతూ అటాకింగ్, డిఫెన్స్‌లో తమ జట్టు గొప్పగా స్పందించిందని వ్యాఖ్యానించాడు. ఇక 75వ నిమిషంలో మార్సిలిన్హో గోల్ చేసే అవకాశాన్ని మిస్సవ్వడంతో ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా డిజప్పాయింటయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+