Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రొయేషియాపై నాల్గోసారి గెలిచి.. పతకం పట్టేసిన ఫ్రాన్స్

france-vs-croatia-world-cup2018

హైదరాబాద్: 2018 ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ జగజ్జేత నిలిచి ప్రభంజనం సృష్టించింది. ఈ సీజన్‌లో అద్భుత విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన అతి చిన్న దేశం క్రొయేషియాపై ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించింది. ఇదే టోర్నీలో ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు ఫైనల్‌కు ముందు ఐదు సార్లు తలపడగా.. మూడుసార్లు ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 20 సంవత్సరాల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియాకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్‌ ఆరంభంలోనే 18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మండ్‌జుకిచ్‌ పెద్ద పొరపాటు చేశాడు. గ్రీజ్‌మన్‌ కొట్టిన ఫ్రీకిక్‌ను అనవసరంగా తలతో అడ్డుకొని సెల్ఫ్‌గోల్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా 1-0తో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

అనంతరం పుంజుకొని ఎటాకింగ్‌ గేమ్‌ ఆడిన క్రొయేషియాకు 28వ నిమిషంలో అవకాశం వచ్చింది. ఆ సమయంలో పెరిసిచ్‌ నేరుగా గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత 36వ నిమిషం వద్ద పెనాల్టీ కిక్‌ ద్వారా ఫ్రాన్స్ మరోగోల్ సాధించింది. దీంతో తొలి హాఫ్ భాగం ముగిసేసమయానికి ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో హాఫ్‌లో ఫ్రాన్స్ ఆటగాళ్లు రెచ్చిపోయారు.

59వ నిమిషం వద్ద పాల్ పోగ్బా, 65వ నిమిషం వద్ద ఎంబాప్పే గోల్స్ సాధించి జట్టుకు అద్భుతమైన ఆధిక్యాన్ని అందించారు. దీంతో క్రొయేషియా డిఫెన్స్‌లో పడిపోయింది. ఈ దశలో మారియో అద్భుతమైన గోల్ సాధించి క్రొయేషియాకి కాస్త ఉపశమనం కల్పించాడు.

ఆ తర్వాత కొయేషియాకు గోల్స్ సాధించేందుకు పలు అవకాశాలు వచ్చినా.. దాన్ని వినియోగించుకోలేదు. మరోవైపు ఫ్రాన్స్‌ కూడా క్రొయేషియాకు గోల్ సాధించేందుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా ఫ్రాన్స్‌ ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

ఈ ప్రపంచకప్‌ ఫైనల్‌లోనే అత్యధికంగా ఆరు గోల్స్‌ నమోదు అయ్యాయి. గత 4 ప్రపంచకప్‌ల్లోనూ(2002-2014) ఫైనల్స్‌లో ఇన్ని గోల్స్‌ నమోదు కాలేదు.

Story first published: Monday, July 16, 2018, 9:34 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+