
హైదరాబాద్: మీరు ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ స్టార్ కావొచ్చు. ఔను నిజమే. ఫిఫా 18 మిమ్మల్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతుంది. ఇంకా, మీరు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విన్నర్ కూడా కావొచ్చు. అదెలా అంటే, 'ఈస్పోర్ట్స్' అనే కంపెనీ గిఫినిటీ ఫుట్‌బాల్ క్రీడా అభిమానులకు ఈ అవకాశం కల్పిస్తుంది.
వచ్చే ఆగష్టు నెలలో జరగబోతున్న ఫిఫా ఈ-వరల్డ్ కప్ ఎలైట్ సిరీస్‌లో ముందుగా రిజిష్టర్ చేసుకోవాలి. ఈ సిరీస్‌లో గెలుపొందిన విజేతలు ఫైనల్‌కు చేరుకుని ప్రపంచ స్థాయిలో ఆడతారు. ఇదే పంథాలో ఈ సంవత్సరం ఆడిన స్పెన్సర్ గొర్రిల్లా ఈ-వరల్డ్ కప్ అందుకున్నాడు.
అంతేకాదు విజేత అవార్డుతో పాటుగా రివార్డు కూడా అందుకుంటాడు. ఈ ఏడాది జరిగిన పోటీల్లో రెండు లక్షల యూఎస్ డాలర్లు గెలుచుకున్నాడు. అంటే, ఒక కోటి 29 లక్షల పైన అన్నమాట.