Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: విజయం కోసం పుణె, కేరళ సిగపట్లు

పుణె: మూడు మ్యాచ్‌ల్లో కేవలం మూడు పాయింట్లు సాధించిన పుణె సిటీ... ఐఎస్ఎల్ 3 సీజన్‌లో ముందుకు వెళ్లాలంటే సోమవారం రాత్రి ఏడు గంటలకు పుణెలోని చత్రపతి శివాజీ స్టేడియంలో కేరళతో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరి గెలవాల్సి ఉన్నది. మరోవైపు ఈ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్ నిషేధంతో పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్ లేకుండా అసిస్టెంట్ కోచ్ మిగౌల్ పర్యవేక్షణలోనే జట్టు సంసిద్ధమవుతున్నది.

హబాస్ లేని లోటు పుణెనూ వెంటాడుతూనే ఉన్నది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించిన పుణె జట్టు.. కోల్ కతా, నార్త్ఈస్ట్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్ లో విభిన్నమైన ఫలితాలు సాధించాలంటే పుణె జట్టు కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలుపొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

పుణె అసిస్టెంట్ కోచ్ మిగౌల్ తమ కుర్రాళ్లు సంసిద్ధంగానే ఉన్నారని పేర్కొనడం గమనార్హం. ఇంతకుముందు నార్త్ఈస్ట్ తో జరిగిన మ్యాచ్ లో రిఫరీ బయటకు పంపిన ఎడుయారో ఫెరీరాను కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగే మ్యాచ్ లో పుణె దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సారధి మహ్మద్ సిస్సోకోపై డిఫెన్సివ్ బాధ్యతలు అదనంగా పడ్డాయి.

సిస్సోకో ఒకవైపు సెంట్రల్ మిడ్ ఫీల్డ్ లోనూ, సెంట్రల్ బ్యాక్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడని మిగౌల్ పేర్కొన్నాడు. గోవాతో జరిగిన మ్యాచ్ లో 90వ నిమిషంలో పుణె విజయం సాధించడం గమనార్హం. ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో పుణె ఓటమి పాలైంది.

Home concerns for FC Pune City as Kerala Blasters come calling

నార్త్ ఈస్ట్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పుణె అసిస్టెంట్ కోచ్ మిగౌల్ స్పందిస్తూ తమ జట్లు అన్ని విభాగాల్లో మెరుగైన ఆట ఆడాల్సి ఉన్నదని అంగీకరించాడు. అందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపాడు. మరోవైపు కేరళ బ్లాక్ బస్టర్స్ సైతం పాయింట్ల పట్టికలో దిగువనే ఉన్నది.

అయితే ముంబైతో జరిగిన మ్యాచ్ లో మిఖైల్ చోప్రా సహకారంతో నాటకీయ ఫక్కీలో గోల్ చేయడంతో విజయం సాధించినందున కేరళ కుర్రాళ్లలో కొంత ఆత్మ విశ్వాసం పెరిగింది. కేరళ ప్రధాన కోచ్ స్టీవ్ కొప్పెల్ మాట్లాడుతూ కుర్రాళ్లకు లక్ష్యాలు విధించడం తనకు తెలియదని ప్రతి గేమ్ లోనూ సత్ఫలితం సాధించడానికే తాను ప్రయత్నిస్తానన్నాడు.

కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు తమకు వ్యతిరేకంగా చేసిన గోల్ డిప్లెక్టెడ్ షాట్ తో వచ్చిందని, ఇదే తమ కొంప ముంచిందన్నాడు. ప్రస్తుతం ప్రతి గేమ్ కూడా వేగంగా జరుగుతున్నదని తెలిపారు. అయినా తాము సాధ్యమైనంత మేరకు అధికంగా పాయింట్లు సాధించాల్సి ఉన్నదన్నాడు. సారధి అరోన్ హుగెస్ తోపాటు సెడ్రిక్ హెంగ్ బార్ట్ ల మధ్య సెంట్రల్ డిఫెన్సివ్ భాగస్వామ్యంతో సత్ఫలితం సాధించగలమని ఆశాభావం వ్యక్తంచేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+