న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో అత్యంత కీలకమైన పరిణామం ఒకటి రికార్డయింది. రెండేళ్ల తర్వాత మూడో విడత జరుగుతున్న టోర్నీలో మొదటి 27 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఫలితం లభించింది. 2014లో 18 మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చాయి. గత ఏడాది అత్యధికంగా 23 మ్యాచ్‌ల్లో ఫలితాలు సెమీస్ బెర్తులను ఖరారుచేశాయ. ఈ ఏడాది టోర్నీ తీరు తెన్నులు ఫలితాలను గమనిస్తే అద్భుతమైన, మనోహర వాస్తవాలు మనముందు ఆవిష్కరించబడతాయి.
11 మ్యాచ్‌ల విజయాల్లో ఆయా జట్ల సొంత గడ్డపై రెండు గోల్స్‌తో విజయం సాధించినవి ఆరు. తొలి సంవత్సరం టోర్నీలో సొంత (హోం స్టేడియం) గడ్డపై జరిగిన 12 మ్యాచ్‌ల్లో ఫలితం సాధించగా, ఆరు ప్రత్యర్థి జట్లు గెలుపొందాయి. గత ఏడాది హోం స్టేడియంలలో గెలుపొందిన మ్యాచ్‌లు 15కు చేరుకుంటే.. ప్రత్యర్థులు గెలుపొందిన మ్యాచ్‌లు ఎనిమిదిగా నిలిచాయి.
కానీ ఈ ఏడాది అకస్మాత్తుగా ప్రత్యర్థి జట్లు గెలుపొందడానికి పలు అంశాలు కారణం. సొంత స్టేడియంలలో రోజురోజుకు అభిమానుల ఒత్తిళ్లు పెరుగుతుండటం కూడా ఓటమి కారణాల్లో ఒకటి. ఫలితంగా ఆతిథ్య జట్లు తమ ప్రత్యర్థి జట్లపై శుభారంభాన్ని సాధించలేకపోతున్నాయి. సొంతగడ్డపై ఒత్తిళ్లతో మ్యాచ్ కోల్పోయిన జట్లు.. తమ ప్రత్యర్థి స్టేడియంలలో విజయాలు సాధిస్తుండటం ఆసక్తికర అంశాల్లో ఒకటి.

సందర్శకుల శక్తి సామర్థ్యాలకు తోడు సొంత స్టేడియంలకు వచ్చే అభిమానుల ఒత్తిళ్లతో ఓటమి పాలవ్వడం లీగ్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ దఫా ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి, ఎఫ్ సి పుణె, ఎఫ్ సి గోవా జట్లు తమ సొంత స్టేడియంలలో జరిగిన తొలి మ్యాచ్ ల్లో విజయం సాధించడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. మిగతా జట్లు సాధించిన విజయాల్లో కేవలం ఆరు మాత్రమే సొంత స్టేడియంలలో సాధించినవి. ఆ జట్ల జాబితాలో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి.. గౌహతిలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అట్లెటికో డీ కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్ సి, ముంబై సిటీ ఎఫ్ సి, కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి జట్లు ఒక్కో విజయం సాధించాయి.
ప్రత్యర్థి జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేడియంలలో అత్యధికంగా గెలుపొందిన జట్టు ముంబై సిటీ కాగా, తర్వాతీ స్థానాల్లో ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డీ కోల్ కతా నిలిచాయి. ఇది గత రెండు సీజన్ల కంటే ఎక్కువగా ఆయా జట్లు సాధించిన గొప్ప ప్రగతిగా భావించొచ్చు. నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టు ఇతర ప్రాంతాల్లో కంటే ఎక్కువగా ఆరు గోల్స్ సాధించిన టీంగా నిలిచింది.
గతంలో గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంపై ఏదైనా చేయొచ్చని అభిప్రాయం ఉండేది. కానీ సొంతగడ్డపై నార్త్ఈస్ట్ అద్రుష్టం ముఖం చాటేసినట్లు కనిపిస్తున్నది. ఐఎస్ఎల్ 2016 టోర్నీలో అన్నింటిలోనూ ప్రతి అంశంలోనూ స్పష్టంగా అర్థమవుతున్నదేమిటంటే సొంత స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ లు గెలువవచ్చుననే నమ్మకానికి ఇక తిలోదకాలివ్వాల్సిందే.
మూడేళ్లలో బెంగళూరు ఎఫ్ సి రికార్డు అద్భుతం: సునీల్ ఛెత్రి
బెంగళూరు: తమ క్లబ్ జట్టు మాదిరిగా ఏ భారత ఫుట్‌బాల్ క్లబ్ జట్టు రికార్డులు నెలకొల్పలేదని బెంగళూరు ఎఫ్ సి క్లబ్ సారధి సునీల్‌ఛెత్రి పేర్కొన్నారు. మూడేళ్లలో జెయింట్స్‌పై విజయం సాధించే స్థాయిలో ఏ జట్టు ప్రగతి సాధించలేదని ఎఐఎఫ్ఎఫ్ డాట్ కాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శనివారం నాడు జొహొర్ దరూల్ తాజిం జట్టుతో ఎఎఫ్‌సి సెమీ ఫైనల్స్ సెకండ్ లెగ్ మ్యాచ్ లో తలపడనున్న నేపథ్యంలో ఛెత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సత్ఫలితాలు తానొక్కడిపై ఆధార పడి రావని, జట్టు సభ్యులందరి క్రుషితోనే సాధ్యమన్నారు. క్లబ్ జట్టు ఆవిర్భవించిన మూడేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు ఐ - లీగ్ టైటిళ్లు, ఒక ఫెడరేషన్ కప్ గెలుచుకున్నామని చెప్పారు. గత 16 ఏళ్లలో తొలిసారి ఏషియాన్ టోర్నీ ఫైనల్స్ కు దూసుకెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాబోదన్నారు. ఇరాకీ క్లబ్ 'ఆల్ ఖువా అల్ జావియాతో జరిగే ఫైనల్స్ మ్యాచ్‌లో యువ క్రీడాకారులు తమకు తాము ప్రేరణ పొందాలని సూచించారు.
ధైర్యంగా ముందుకు వెళ్లాలని తమ కోచ్ సలహా ఇచ్చాడని, ఇంతకంటే గొప్ప సందేశమేమీ ఉండబోదన్నారు. ఐదేళ్ల క్రితం 2011లో దోహాలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ మాజీ ఆటగాడు మోహున్ బగాన్, జెసిటి, అటాకర్ డెంపో మరొకరు బారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత అదే దోహా వేదికగా ఏషియాన్ కప్ ఫైనల్స్ జరుగనుండటమే ప్రత్యేకత అని ఛెత్రి వ్యాఖ్యానించారు.