For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్లండోయ్.. స్టార్లు: సాకర్‌లో ప్లేయర్లు యమ స్పీడ్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఈ నెల ఒకటో తేదీన మొదలైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో కొందరు ప్లేయర్లు అద్భుతమైన ఆటతీరుతో తమ జట్టును గెలిపించడంలోనూ, ప్రత్యర్థి జట్లపై పాయింట్లు సాధించడంలోనూ ముందున్నారు. ఈ దఫా టోర్నీ అసాంతం పోటాపోటీగా సాగుతున్న నేపథ్యంలో జట్లకు రేటింగ్ అసాధ్యంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ప్రతిభా పాటవాల్లో గొప్పతనం చాలా ముఖ్యమైంది. ఒక్కో జట్టు ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో పాల్గొన్న నేపథ్యంలో టాప్ ర్యాంకింగ్ పొందిన అణిముత్యాల్లాంటి ప్లేయర్లు ఉన్నారు. వారిలో టాపర్ ఢిల్లీ డైనమోస్‌కు చెందిన మార్సెలిన్హో, అట్లెటికో డీ కోల్‌కతా ఆటగాళ్లు సమీగ్ డౌటీ, జావీ లారా, ఫుణె ప్లేయర్ జొన్నాథన్ లుక్కా, నార్త్ఈస్ట్ కుర్రాడు ఎమిలియానో అల్ఫారో ప్రముఖులు. ఒక్కొక్కరి ఆటతీరెలా ఉందంటే..

వ్యక్తిగత గోల్స్‌లో టాప్ మార్సెలిన్హో
ప్రస్తుత సీజన్‌లో ఫార్వర్డ్ ఆటగాడు ఢిల్లీ ప్లేయర్ మార్సెలిన్హో కంటే ఏ జట్టు కుర్రాడు అత్యధికంగా గోల్స్ చేయలేదంటే అతిశేయోక్తి కాదు. ఢిల్లీ డైనమోస్ సాధించిన ఐదు గోల్స్‌లోనూ బ్రెజిలియన్ వింగరైన మార్సెలిన్హో చేసినవే మూడు. అదీ డిఫెండింగ్ చాంపియన్ చెన్నయిన్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లోనే చేసినవి. అంతేకాదు జట్టు మరో రెండు గోల్స్ చేయడంలోనూ ఆయన అసిస్టెన్స్ ఉంది.

Highest rated players of Hero ISL 2016

సగటున 7.99 శాతం పాయింట్లు కొట్టేసిన ఈ బ్రెజిలియన్ కుర్రాడు.. తొలి మ్యాచ్ లోనే వ్యక్తిగతంగా పది పాయింట్లు కొట్టేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో నిలకడగా ఎనిమిదికి పైగా పాయింట్లతో కొనసాగుతున్నాడు. తద్వారా 29 ఏళ్ల ఈ కుర్రాడు జట్టులోనే బోల్డంతా విశ్వసనీయత సంపాదించుకున్నాడు. తొలి మ్యాచ్ లో చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుపై 3 - 1 ఆధిక్యంతో ఢిల్లీ డైనమోస్ గెలుపొందడం మార్సెలిన్హో వ్యక్తిగత కెరీర్‌లోనే హైలెట్.

తానేంటో నిరూపించుకున్న డౌటీ
హీరో ఐఎస్ఎల్‌లో తన ప్రతిభ, శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకున్న కుర్రాళ్లలో అట్లెటికో డీ కోల్‌కతా ప్లేయర్ సమీగ్‌డౌటీ. ముంబై సిటీ ఎఫ్ సితో జరిగిన తొలి మ్యాచ్ ఫలితం డ్రాగా ముగించడంలో కీలకం డౌటీ. ఆ జట్టుతో మ్యాచ్ 1 - 1 స్కోర్ తేడాతో ఫలితం డ్రాగా ముగిసేందుకు దౌటీ ప్రదర్శించిన దూకుడు ఆయనకు 6.77 పాయింట్లు తెచ్చి పెట్టింది. తర్వాత అది క్రమక్రమంగా దూసుకెళ్లింది.

ఒకవేళ టైటిల్‌ను కోల్‌కతా గెలుచుకోలేకపోయినా ఈ ఏడాది బెస్ట్ రేటెడ్ ప్లేయర్లలో ఈ సౌతాఫ్రికన్ స్టార్ ప్లేయర్ డౌటీకి ఖచ్చితంగా చోటు దక్కుతుందనడంలో సందేహం లేదు. ముంబై సిటీతో తర్వాత చెన్నైయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో డౌటీ రేటింగ్ 8.81 పాయింట్లకు, ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్ లో 8.64 పాయింట్లకు చేరుకున్నది. ఎఫ్ సి గోవాపై జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన రీతిలో షాట్లు కొట్టడం విశేషమే మరి.

తొలి నుంచి జావీ లారాది దూకుడే
2014లో తొలి ఏడాది ఐఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటి నుంచి అట్లెటికో డీ కోల్‌కతా ప్లేయర్లలో కీలక పాత్ర పోషించిన వారిలో జావీ లారా. బెస్ట్ రేటెడ్ ప్లేయర్ రికార్డు పొందాడు. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేయడంతో వ్యక్తిగతంగా 10 పాయింట్లు పొందాడు. ప్రత్యర్థులపై హఠాత్‌గా చెలరేగిపోవడం ఈ స్పానిష్ అటాకర్‌కు కొత్త కాదు.

కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు రాబట్టిందీ లారానే కావడం గమనార్హం. జ్వరం కారణంగా బెంచ్‌కే పరిమితమైన లారా 100 శాతం ఫిట్‌గా లేడు. అందువల్ల ఆయన అతి తక్కువగా 4.82 పాయింట్లతో రేటింగ్ కలిగి ఉన్నాడు. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్‌లో అవుట్ బాక్స్ నుంచి గోల్ చేసి స్కోర్ సమంతో మ్యాచ్ డ్రాగా చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

జొన్నాథన్‌పై పాజిటివ్ ఎఫెక్ట్
పుణె సిటీ ఎఫ్ సి తరుఫున ఆడతున్న జొన్నాథన్ లుక్కాకు పాజిటివ్ ఫలితాలు అడ్డంకిగా నిలిచాయి. ఈ సీజన్‌లో తన సహచర ఆటగాళ్లకు అత్యధికంగా సాయం అందించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆయన వ్యక్తిగత ఆటతీరుపై రేటింగ్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ బ్రెజిలియన్ మిడ్ ఫీల్డర్ ఈ ఏడాది స్టాలియన్స్ ప్లేయర్లలో బెటర్ ఆటగాడు. ఆయన రేటింగ్ ప్రస్తుతం 7.52 పాయింట్లుగా ఉంది.

పుణె సిటీ జట్టుకు జొన్నాథన్ సేవలు చాలా కీలకం. గత ఐదు మ్యాచ్‌లు జరిగిన తర్వాత మూడింట్లో జొన్నాథన్ వ్యక్తిగత రేటింగ్ 8కి పైగా నమోదవుతున్నది. టోర్నీ రెండో భాగంలో గానీ ప్లేయర్ల వ్యక్తిగత రికార్డులేమిటన్నది తేటతెల్లం కానున్నది. ఈ సీజన్‌లో ఎఫ్ సి పుణె జట్టు మ్యాచ్ గెలిచిందంటే జొన్నాథన్ లుక్కా వల్లనే అంటే అతిశేయోక్తి కాదు.

ఆరు మ్యాచ్‌ల్లో అల్ఫారో నాలుగు గోల్స్
ఐఎస్ఎల్ 3 ఎడిషన్ అత్యధిక గోల్స్ స్కోరర్లో ఎమిలియానో అల్ఫారో ఒకరంటే అతిశేయోక్తి కాదు. నార్త్ఈస్ట్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడితే నాలుగు గోల్స్ చేసిందే అల్ఫారో. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నార్త్ఈస్ట్ చోటు దక్కించుకోవడంలో అల్ఫారోనే ప్రధాన కారణం. గౌహతిలో ఎఫ్ సి పుణెపై జరిగిన మ్యాచ్‌లో అల్ఫారో ప్రదర్శన 9.34 పాయింట్లతో కూడిన రేటింగ్ ఇచ్చింది.

నార్త్ఈస్ట్ జట్టుతో పూర్తిగా కలిసిపోయిన అల్ఫారో.. తమ సహచరులు కస్తుమి యుసా, నికోలస్ వెలెజ్ తదితరులతో మంచి అవగాహన పెంపొందించుకున్నాడు. ఇదే అవగాహన టోర్నీ ముగిసే నాటికి కీలక దశకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

రియల్ మాడ్రిడ్ తోనే గారెథ్ బాలె
స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగా' జెయింట్స్ రియల్ మాడ్రిడ్, బార్సిలోనా క్లబ్ ఫ్రాంచైసీల యాజమాన్యాలు తమ ఆటగాళ్లతో కాంట్రాక్టుల కొనసాగింపుపై ద్రుష్టిని కేంద్రీకరించాయి. తాజగా రియల్ మాడ్రిడ్ మేనేజ్మెంట్.. ఫార్వార్డ్ ప్లేయర్ గారెథ్ బాల్ 2022 వరకు కాంట్రాక్టు పొడిగించుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లిష్ క్లబ్ టొట్టెన్హమ్ హాట్స్‌పూర్‌కు చెందిన ఈ 27 ఏళ్ల కుర్రాడు 2013 నుంచి రియల్ మాడ్రిడ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మూడేళ్ల క్రితమే ప్రపంచంలోకెల్లా అత్యధిక బదిలీ ఫీజు పొందాడు. ఇంతకుముందు రియల్ మాడ్రిడ్‌తో బాలె కాంట్రాక్ట్ 2019 వరకు మాత్రమే ఉంది. 2013 నుంచి ఇప్పటివరకు 90 లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న బాలె 50 గోల్స్ సాధించాడు. రియల్ మాడ్రిడ్‌తో కలిసి రెండు యూరోపియన్ చాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

రియల్ మాడ్రిడ్ ఫ్రాంచైసీతో కాంట్రాక్ట్ పొడిగించుకున్న ప్లేయర్లలో బాలె నాలుగో ఆటగాడు. ఇంతకుముందు లుకాస్ వాజ్‌క్వెజ్, లుకా మోడ్రిక్, టోనీ క్రూస్‌లు రియల్ మాడ్రిడ్‌తో ఒప్పందాలు పొడిగించుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+