ఉద్దేశపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.. ఏకంగా జట్టు నుంచే తొలగించబడ్డాడు!!

హైదరాబాద్: క్రికెట్ ఆటలో బౌలర్లు బంతిపై ఉమ్మి, చెమట రాయడం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి దారి తీయవచ్చన్న చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మి, చెమట స్థానంలో మైనపు పూతను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదకర వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది. క్రికెట్ ఆటలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఫుట్‌బాల్ ఆటగాళ్లు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.

మెడికల్ క్యాంప్ ఏర్పాటు
కరోనా వైరస్ నేపథ్యంలో జర్మనీకి చెందిన హెర్థా బెర్లిన్ అనే సాకర్ క్లబ్ తమ ఆటగాళ్లందరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల అందరికి వైద్య పరీక్షలు చేస్తుండగా.. ఈ క్లబ్‌కు చెందిన ఫార్వర్డ్ ఆటగాడు సొలోమన్ కాలౌ (34) భౌతిక దూరం నిబంధనలను పాటించకపోవడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.

ఉద్దేశపూర్వకంగా షేక్‌హ్యాండ్
సొలోమన్ కాలౌ శిబిరంలోని సహచరులందరికీ ఉద్దేశపూర్వకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఇక తోటి ఫార్వర్డ్ వేదాద్ ఇబిసెవిక్‌తో చప్పట్లు కొట్టాడు. ఇక్కడితో ఆగకుండా.. ఈ తతంగాన్నంతా సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఇది లీగ్ నిబంధనలకు విరుద్ధమైందిగా పరిగణించబడింది. వీడియో డిలీట్ చేయమని ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ డి మెల్.. కాలౌను కోరినా నవ్వుతూ వెళ్ళిపోయాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్లబ్ యాజమాన్యం క్రమశిక్షణ చర్యల కింద కాలౌను ఏకంగా జట్టు నుంచే తొలగించింది.

కాలౌ సస్పెండ్
కాలౌ నుండి వచ్చిన చిత్రాలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. దీనికి ఊరికే వదిలేయకూడదు. మార్గదర్శకాలకు కట్టుబడని ఆటగాళ్ళు మరియు క్లబ్‌ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం అని జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం హెర్థా బెర్లిన్ అనే సాకర్ క్లబ్ తమ ఆటగాడు సొలోమన్ కాలౌను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. హెర్థా బెర్లిన్ ఆటగాళ్లు ప్రస్తుత పరిస్థితులను తక్కువగా అంచనా వేస్తున్నారు, ఎవరినీ వదలం అని జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications