న్యూఢిల్లీ: భారత్ కొంత అద్భుతమైన ఫుట్‌బాల్ దాగి ఉందని ఇండియన్ సూపర్ లీగ్ మూడో ఎడిషన్ రుజువుచేసింది. ఫార్వర్డ్ ప్లేయర్లు గోల్స్ చేసేందుకు ఆర్తిగా ముందుకు సాగుతుంటే.. ప్రత్యర్థి జట్ల డిఫెండర్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. మిడ్ ఫీల్డర్లు తమ స్ట్రయికర్ల కోసం అవకాశాలు కల్పిస్తూ.. సంతోషదాయకమైన పాయింట్లతో అలరించారు.
ఇక డిఫెండర్లు ప్రత్యర్థుల అటాకింగ్‌ను అడ్డుకుంటూ కీలక సమయాల్లో సమర్థవంతంగా వ్యూహాలు అమలుచేస్తూ ముందుకెళ్లారు. వీరంతా ఒక ఎత్తయితే ప్రతి జట్టు గోల్ కీపర్ అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థి జట్ల ప్లేయర్లను అండుకుని స్మార్ట్‌గా సేవ్ చేస్తూ ఒంటిచేత్తో జట్టును కాపాడుతూ వచ్చారు.
ప్రతి మ్యాచ్‌కు ఒక భిన్నమైన వ్యూహాలు అమలుచేస్తూ జట్టు విజయానికి బాటలు వేస్తూ ఆయా టీమ్‌ల కోచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎల్ నుంచి డ్రీమ్ టీం ముందుకు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం...
బెస్ట్ గోల్ కీపర్ అమరీందర్ సింగ్
తొలిసారి సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న ముంబై సిటీ గోల్ కీపర్ అమరీందర్ సింగ్.. ఎఎఫ్ సి లీగ్ టోర్నీ కారణంగా ఆలస్యంగా జట్టులో భాగస్వామిగా మారినా.. కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడినా ముంబైకర్ల కోసం అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించాడు. ఐదు క్లీన్ చిట్లు సాధించడంతోపాటు గోల్డెన్ గోవ్ అవార్డు గెలుచుకున్న అమరీందర్ సింగ్ డ్రీం టీంలో గోల్ కీపర్‌గా చోటు దక్కించుకున్నాడు.
టఫ్ డిపెండర్‌గా సౌవిక్ చక్రవర్తి
మూడో ఎడిషన్‌లో తొలి నుంచి సంచలనాలు నెలకొల్పుతున్న ఢిల్లీ డైనమోస్ రైట్ బ్యాక్ ప్లేయర్ సౌవిక్ చక్రవర్తి అనుక్షణం ప్రతి నిమిషం జట్టుకోసం ఆడుతున్న టఫ్ డిఫెండర్. ఆయన ఎల్లవేళలా దూకుడుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి జట్లకు పెనుముప్పుగా పరిణమించాడు. అత్యధికంగా ప్రత్యర్థి జట్ల దాడులను 76 సార్లు టాకిల్ చేసి, 31 సార్లు ప్రత్యర్థుల వ్యూహాల్లో జోక్యం చేసుకుని జట్టును కాపాడేందుకు ప్రయత్నించిన కీలక ఆటగాడు.

సెంటర్ బ్యాక్‌లో లుసియాన్, సెడ్రిక్ కీలకం
నిస్సందేహంగా స్టాండ్ఔట్ డిఫెండర్లలో ముంబై సిటీ ఎఫ్ సికి చెందిన లుసియాన్ గోవాన్, కేరళ బ్లాక్ బస్టర్స్ కీలక ప్లేయర్ సెడ్రిక్ హెంగ్బార్ట్ కీలక ఆటగాళ్లు. ముంబై సిటీ జట్టును డిఫెండ్ చేయడంలో రోమేనియన్ లుసియాన్ గోవాన్ ముందు వరుసలో నిలిచాడు. తొమ్మిది క్లీన్‌చిట్లు సాధించి ప్రత్యర్థుల వ్యూహాలను ఛేదిస్తూ 79 సార్లు వ్యూహాలను అడ్డుకున్నాడు.
లుసియాన్ గోవాన్ నేలపైనా, గాలిలోనూ చెలరేగిపోయిన సెంట్రల్ బ్యాక్ ప్లేయర్. ఇక రెండోసారి కేరళ బ్లాక్ బస్టర్స్ ఫైనల్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించిన సెడ్రిక్ హెంగ్బార్ట్.. డిఫెన్స్‌లో ప్రత్యర్థులను హడలెత్తించాడు. అనుక్షణం చెలరేగిపోతూ ఎదుటి పక్షాలకు ముప్పుగా పరిణమించిన హెంగ్బార్ట్.. కేరళకు పెద్ద అసెట్. ఒక గోల్, మూడు అసిస్టెన్సులతో జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
అందరి ద్రుష్టిని ఆకర్షించిన జెర్రీ
మాజీ చాంపియన్ జట్టు చెన్నైయిన్ ఎఫ్ సి ప్లేయర్ జెర్రీ లాల్రింజువాలా లెఫ్ట్ బ్యాక్‌లో త్వరితగతిన స్పందిస్తూ అటాకింగ్ వ్యూహం అమలుచేస్తూ ముందుకు సాగాడు. వేగంగా స్పందిస్తూ ప్రత్యర్థుల అవకాశాలను దోపిడీ చేస్తూ ఒక గోల్ రెండు అసిస్టెన్సులతో 2016 ఐఎస్ఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలచుకోవడం ఎవరినీ ఆశ్చర్య పర్చలేదు. ఎఎఫ్ సి ఫైనల్స్‌లో సునీల్ ఛెత్రితోపాటు పాల్గొన్న కేరళ రైట్ వింగర్ సికె వినీత్ అద్భుతమైన ఆటగాడిగా అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. చివరి మ్యాచ్‌ల్లో ఆడినా కేరళ బ్లాక్ బస్టర్స్ ఫైనల్స్ పోరుకు చేరుకోవడంలో కీలకమయ్యాడు.
మిడ్ ఫీల్డర్లుగా జావీ, క్రిస్టియాన్ ప్రధాన పాత్ర
చాంపియన్స్‌గా నిలిచిన అట్లెటికో డి కోల్ కతా ప్లేయర్ జావీ లారా, ముంబై సిటీ ఆటగాడు క్రిస్టియాన్ వాడోక్జ్ వారి జట్ల తరఫున మిడ్ ఫీల్డర్లుగా వ్యవహరిస్తున్నారు. తరుచుగా అద్బుతమైన బాల్స్‌తో అటాకింగ్ చేస్తూ ఎటికె సెంట్రల్ మిడ్ ఫీల్డర్ జావీ లారా ప్రధాన ప్లేయర్‌గా నిలిచాడు. లారా మూడు గోల్స్ సాధించి తమ జట్టును చాంపియన్‌ను చేయడంలో కీలకమయ్యాడు. ఒక ముంబై సిటీని పలు అవకాశాలు కల్పించి ముఖ్యమైన గోల్స్ చేసి దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంలో క్రిస్టియాన్ వాడోక్జ్ ప్రధాన అటాకర్‌గా నిలిచాడు. తానుగా మూడు గోల్స్ చేసి జట్టును టాప్ 4లో నిలిపిన ప్లేయర్లలో ఒకడు క్రిస్టియాన్.
మాలౌదా మిరిమిట్లు
ఢిల్లీ డైనమోస్ సారధిగా ఫ్లోరెంట్ మాలౌదా మిరిమిట్లు గొలుపుతూ సీజన్ లోనే హీరో ఆఫ్ ది లీగ్ అవార్డు అందుకున్నాడు. అద్భుతమైన అటాకింగ్‌తో జట్టును ముందుపీఠిన నిలిపాడు. అవిశ్రాంతంగా జట్టును సెమీ ఫైనల్స్ కు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. బ్యాక్ లైన్‌పై చెలరేగిపోతూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ ఫ్రాన్స్ ప్లేయర్.. ఢిల్లీ డైనమోస్‌కు తీపి గుర్తులు మిగిల్చాడు. మరో ఢిల్లీ సంచలనం మార్సిలిన్హో డిసిసివ్ ఫినిషింగ్‌లో, ప్రత్యర్థి జట్ల డిఫెన్స్‌ను తుత్తు నియలుచేస్తూ ప్రస్తుత సీజన్ లో అత్యధికంగా 10 గోల్స్, ఐదు అసిస్టెన్స్లతో అలరించాడు.
ఎటికెలో కీలకంగా వ్యవహరించిన హుమ్, మొలీనా
రెండోసారి చాంపియన్స్ గా నిలిచిన అట్లెటికో డి కోల్ కతా జట్టులో అటాకర్ ఇయాన్ హుమ్ ప్రధానంగా ప్రభావితంచేశాడు. ఏడు గోల్స్ సాధించి పాయింట్లలో రెండో స్థానం సాధించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధికంగా 23 గోల్స్ తో రికార్డు నెలకొల్పాడు. 2016లో కోల్ కతాలో ముంబైపై జరిగిన సెమీ ఫైనల్స్ లో ఆయన చేసిన గోల్ ఫైనల్స్ వరకు తీసుకెళ్లింది. ఎటికె వ్యూహకర్త జోస్ మొలీన్ జట్టు ప్రధాన కోచ్ గా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ టీమ్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించాడు. తరుచుగా ఆటగాళ్లు గాయపడుతూ, సస్పెన్షన్లను ఎదుర్కొంటున్నా వెనక్కు తగ్గలేదు.