For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్‌బ్యాక్ 2016: ప్రత్యర్థులకు చుక్కలు చూపిన డిఫెండర్లు

ఐఎస్ఎల్ మూడో ఎడిషన్ ఉల్లాసభరితంగా ముగిసింది. సాధారణ సమయంలో రెండు జట్లు చెరో గోల్ చేయడంతో షూటౌట్ పెనాల్టీల్లో 4-3 స్కోర్ తేడాతో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై రెండోసారి అట్లెటికో డి కోల్‍కతా విజయం సాధించ

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో ఎడిషన్ ఉల్లాసభరితంగా ముగిసింది. సాధారణ సమయంలో రెండు జట్లు చెరో గోల్ చేయడంతో షూటౌట్ పెనాల్టీల్లో 4-3 స్కోర్ తేడాతో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై రెండోసారి అట్లెటికో డి కోల్‍కతా విజయం సాధించింది. అయితే ఈ సీజన్ పూర్తిగా డిఫెన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది.

గత సీజన్‌లో 186 గోల్స్ సాధిస్తే.. ఈ దఫా 145 గోల్స్‌తోనే సరిపెట్టుకున్నది. ప్రతి జట్టులోని డిఫెండర్లు తమ ప్రత్యర్థి జట్లకు గోల్స్ సమర్పించేందుకు మొగ్గుచూపలేదు. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు చెందిన సెడ్రిక్ హెంగ్బార్ట్, సందేశ్ జిగ్నాస్ హైలేట్‌గా నిలిచారు. అందరికన్నా ముంబై సిటీ ప్లేయర్ లుసియాన్ గోవాన్ బెస్ట్ డిఫెండర్‌గా గుర్తింపు సాధించాడు.

బెస్ట్ డిఫెండర్‌గా లుసియాన్ గోవాన్

బెస్ట్ డిఫెండర్‌గా లుసియాన్ గోవాన్

ఈ ఏడాది ముగిసిన ఐఎస్ఎల్ టోర్నీలో బెస్ట్ డిఫెన్స్ వ్యూహంతో సాగిన జట్టేదైనా ఉందంటే అది ముంబై సిటీ ఎఫ్ సి మాత్రమే. అదే జట్టు ప్లేయర్ లుసియాన్ గోవాన్ ప్రత్యర్థులకు తక్కువగా 11 గోల్స్ ఇవ్వడంతోపాటు అత్యధికంగా తొమ్మిది క్లీన్ షీట్లు సాధించాడు. కీలక సందర్భాల్లో సంయమనం పాటిస్తూ ముందుకు సాగిన ఈ రోమేనియన్.. ప్రత్యర్థి జట్లు అటాకింగ్‌నూ తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడు.ప్రత్యర్థులుగానీ, ఇతరులు గానీ నమ్మశక్యం గానీ రీతిలో 79 టాకిల్స్ అమలుచేసి లీగ్‌లోనే ప్రధాన అట్రాక్షన్‌గా నిలిచాడు. అటాకింగ్ వ్యూహంతో ప్రత్యర్థి జట్లకు ప్రధాన ముప్పుగా పరిణమించాడు. పరత్యేకించి కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో బ్యాక్ ఆఫ్ నెట్ వద్ద ఆయన విన్యాసాలు గమనార్హం.

కేరళ కుర్రాళ్లకు స్ఫూర్తి సెడ్రిక్ హెంగ్బార్ట్

కేరళ కుర్రాళ్లకు స్ఫూర్తి సెడ్రిక్ హెంగ్బార్ట్

సెడ్రిక్ హెంగ్బార్ట్ ఉంటే కేరళ కుర్రాళ్లకు పెద్ద అండ. బ్యాక్ లైన్‌పై కదలాడుతూ సహచర ప్లేయర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సెడ్రిక్.. అరోన్ హుగెస్, సందేశ్ జిగ్నాస్ లతో కలిసి పటిష్టమైన డిఫెన్స్ వ్యూహం సిద్ధంచేశారు. సింగిల్ గోల్, మూడు అసిస్టెన్సులతో సరిపెట్టిన సెడ్రిక్.. డిఫెండర్‌గా అసాధారణ ప్రతిభావంతుడు. జట్టును బెస్ట్ అటాకింగ్ టీంగా నిలుపుతూ కేరళకు డిఫెన్స్ వ్యూహం అమలుచేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన సెమీ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో తన స్థానమేమిటో సెడ్రిక్ రుజువుచేశాడు.

అనుక్షణమూ జట్టు కోసమే సౌవిక్ తహతహ

అనుక్షణమూ జట్టు కోసమే సౌవిక్ తహతహ

ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ డైనమోస్ ప్లేయర్ సౌవిక్ చక్రవర్తి అనుక్షణం జట్టు కోసమే కష్ట పడ్డాడు. పెర్పార్మెన్స్, కంట్రిబ్యూషన్ చూసినా లీగ్ లోనే అత్యధికంగా 76 టాక్సిల్స్‌ను నియంత్రించాడు. ఢిల్లీ డిఫెన్స్ వ్యూహాన్ని అడ్డుకోవాలంటే ప్రత్యర్థి జట్లకు హడలే మరి. ప్రత్యర్థులు కష్టకాలంలో ఉన్పప్పుడు అవకాశాలు ఉపయోగించుకోవడం సౌవిక్ స్పెషాలిటీ. ఢిల్లీ లయన్స్ బ్యాక్ లైన్ లో సౌవిక్ కీలకమైన ఆటగాడిగా ఐఎస్ఎల్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఎటికె సెంటర్ బాక్ లో హెన్రిక్యు కీలకం

ఎటికె సెంటర్ బాక్ లో హెన్రిక్యు కీలకం

చాంపియన్స్ అట్లెటికో డి కోల్ కతా సెంటర్ బ్యాక్ ప్లేయర్ హెన్రిక్యు సెరెనో నెమ్మదిగా, స్థిరంగా డిఫెన్స్ వ్యూహం అమలు చేశాడు. జట్టు పూర్తిస్థాయి డిఫెన్స్ ప్రదర్శించిందంటే దీనికి కారణం ఆయన ముందుండి అటాకింగ్‌కు దిగడమే కారణం. పది మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్యు.. టైటిల్ పోరులో స్కోర్ సమం చేయడంలో హెన్రిక్యు పాత్ర కూడా ఉంది. ఫైనల్స్ మ్యాచ్‌లో తలకు గాయమైనా డిఫెన్స్ వ్యూహం అమలులో ముందు పీఠిన నిలిచాడు.

కేరళకు వెన్నెముక సందేశ్ జిగ్నాస్

కేరళకు వెన్నెముక సందేశ్ జిగ్నాస్

2016 ఐఎస్ఎల్ సీజన్‌లోనే అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడు కేరళ బ్లాక్ బస్టర్స్ ప్లేయర్ సందేశ్ జిగ్నాస్. సెంటర్, పుల్ బ్యాక్ పొజిషన్లలో స్థిరంగా నిలబడిన జిగ్నాస్.. తొలి ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది లీగ్ అవార్డు అందుకున్నాడు. అందుకనుగుణంగానే తన శక్తియుక్తులను మరింత బలోపేతం చేసుకున్నాడు. ఢిల్లీ డైనమోస్ జట్టుతో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో జిగ్నాస్ ప్రతిభే కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టును రెండో టైటిల్ పోరు వరకు నడిపించింది. ఈ 23 ఏళ్ల ఇండియా ఇంటర్నేషనల్ భవిష్యత్‌లో దూకుడు ప్రదర్శిస్తూ విశ్వాసంతో ముందుకు సాగుతాడనడంలో సందేహం లేదు.

డిఫెన్స్‌తో తగ్గిన హ్యాట్రిక్ గోల్స్

డిఫెన్స్‌తో తగ్గిన హ్యాట్రిక్ గోల్స్

ఆశ్చర్యకరమైన రీతిలో ఈ సీజన్ ఐఎస్ఎల్ టోర్నీ అంతా పూర్తిగా డిఫెన్స్ ప్రధాన పాత్ర పోషించింది. జట్ల ఆత్మరక్షణ వ్యూహంతో గోల్స్ చేయడానికి స్ట్రయికర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. గత సీజన్‌లో ఎనిమిది హ్యాట్రిక్ గోల్స్ సాధ్యమైతే ఈ ఏడాది కేవలం మూడు హ్యాట్రిక్స్ స్కోర్లు మాత్రమే రికార్డయ్యాయి. కష్టగాలం, డిఫెన్సివ్ వ్యూహాల మధ్య అసాధారణ ప్రతిభతో నిప్పులు చెరుగుతూ హ్యాట్రిక్ సాధించిన హీరోల సంగతి పరిశీలిద్దాం..

తొలి హ్యాట్రిక్ ఫోర్లాన్‌దే

తొలి హ్యాట్రిక్ ఫోర్లాన్‌దే

ఈ ఏడాది ముగిసిన ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో తొలి హ్యాట్రిక్ గోల్స్ సాధించిన ప్లేయర్ ముంబై సిటీ ఎఫ్ సి సారథి డియాగో ఫోర్లాన్. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదో నిమిషంలో తొలి గోల్ చేసిన ఫోర్లాన్, టాప్ కార్నర్‍లో చూడముచ్చటగా ఫ్రీ కిక్ ద్వారా ఉత్ర్కుష్టమైన రెండో గోల్ తొమ్మిదో నిమిషానికే సాధించాడు. ఈ ప్రముఖ ఉరుగ్వేయన్ ప్లేయర్ 63వ నిమిషంలో కేరళ బ్లాక్ బస్టర్స్ గోల్‌కీపర్ గ్రహం స్టాక్ తప్పించి బంతి గోల్ పోస్ట్ బాట పట్టించాడు. ఫోర్లాన్‌తోపాటు కాఫు, లుసియాన్ గోవాన్ చెరోగోల్ చేయడంతో కేరళ జట్టుపై 5 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది ముంబై సిటీ ఎఫ్‌సి. అంతేకాదు ఈ సీజన్‌లో ముంబైకర్లు అత్యధిక పాయింట్ల తేడాతో గెలుపొందిన మ్యాచ్ కూడా ఇదే. తమ జట్టు వరుసగా మూడో ఏడాది గోల్స్ సాధించినందుకు ముంబైకర్లు గర్విస్తున్నారు. 2014లో ఆండ్రె మోర్టిజ్, 2015లో సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్ సాధించి రికార్డు నెలకొల్పారు.

చెన్నైకి రెండోస్థానం

చెన్నైకి రెండోస్థానం

నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సితో మాజీ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సి తన సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో రెండో గోల్‌చేసి రికార్డు సాధించింది. 3 - 3 పాయింట్లతో థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్ డ్రా గా ముగిసినా చెన్నై కుర్రాడు దుదు ఒమాంగ్‌బెమీ హ్యాట్రిక్ గోల్స్ సాధించడం గమనార్హం. ఈ నైజిరియన్ ప్లేయర్ ఒమాంగ్‌బెమి 34వ నిమిషంలో పోస్ట్ సమీపం నుంచి బంతిని నెట్‌లోకి పంపి తొలి గోల్ సాధించాడు 45వ నిమిషంలో జెర్రీ లాల్రింజౌలా ఫ్లిక్ చేసిన బంతిని నార్త్ఈస్ట్ గోల్ కీపర్ సుబ్రతాపాల్ తప్పించి మరీ గోల్ చేశాడు. మ్యాచ్ ఫుల్ టైం ముగియడానికి తొమ్మిది నిమిషాల ముందు నెట్ వద్ద గోల్ కీపర్ లేని సమయంలో మూడో గోల్ సాధించి హ్యాట్రిక్ సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నైయిన్ ఓటమి పాలైంది. గతేడాది ఎఫ్ సి గోవా తరఫున, ఈ ఏడాది చెన్నైయిన్ ప్లేయర్‌గా హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్‌గా దుదుఒమాంగ్ బెమీ రికార్డు నెలకొల్పాడు.

ముచ్చటగా మార్సిలిన్హో మోడో హ్యాట్రిక్

ముచ్చటగా మార్సిలిన్హో మోడో హ్యాట్రిక్

ఈ ఏడాది ఐఎస్ఎల్ టోర్నీ గోల్డెన్ బూట్ విజేత, ఢిల్లీ ప్లేయర్ మార్సిలిన్హో సొంతగడ్డపై ఎఫ్‌సి గోవాతో జరిగిన మ్యాచ్‌లో 5 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించడంతోపాటు సీజన్‌లోనే మూడో హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 17వ నిమిషంలో మెరుపులు మెరిపిస్తూ ఎఫ్ సి గోవా ఆటగాడు ఫుల్గాంకో కార్డోజో గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో 31వ నిమిషంలో మార్సిలిన్హో బంతిని గోల్ పోస్ట్‌కు తరలించాడు. ఆ తర్వాత ఏడు నిమిషాలకు ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా పంపిన ఫ్రీ కిక్ షాట్‌ను మార్సిలిన్హో గోల్ పోస్ట్ కు తరలించాడు. గంటకు మూడు నిమిషాల్లోపు మూడో గోల్ సాధించి బంతిపై ఆధిపత్యం ప్రదర్శించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+