రష్యాలో ఆడలేదు కదా..: వరల్డ్‌కప్ పతాకాన్ని వద్ద క్రొయేషియా ప్లేయర్

హైదరాబాద్: అది ఫిఫా వరల్డ్ కప్ పతకం. అతడు ఆడకపోయినా, జట్టు గెలిచింది. దీంతో జట్టు సభ్యులతో పాటు అతడికి కూడా పతకాన్ని కేటాయించారు. అయితే, ఆ వరల్డ్ కప్ పతకాన్ని తాను తీసుకోలేనని వెనక్కి పంపాడు క్రొయేషియా ఆటగాడు నికోలా కల్నిక్.
ఇటీవల రష్యా వేదికగా సుమారు నెల రోజుల పాటు ఫిఫా వరల్డ్ కప్ పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన పైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించి విశ్వ విజేతగా నిలవగా, క్రొయేషియా రెండో స్థానంలో నిలిచింది.

దీంతో వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ స్వర్ణం పతాకాన్ని సొంతం చేసుకోగా.... క్రొయేషియా రజత పతకాన్ని దక్కించుకుంది. అయితే, ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఎంపిక చేసిన క్రియేషియా జట్టులో నికోలా కల్నిక్ కూడా సభ్యుడు. టోర్నీలో భాగంగా అతడికి ఒక్క మ్యాచ్ ఆడేందుకు కూడా అవకాశం రాలేదు.
క్రొయేషియా జట్టు తన తొలి మ్యాచ్‌ని నైజీరియాతో ఆడింది. ఈ మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాలని కోచ్ సూచించగా.. నికోలా తిరస్కరించాడు. దీంతో జట్టు యాజమాన్యం అతడిని తిరిగి స్వదేశానికి పంపించి వేసింది. దీంతో అతడు మొత్తం టోర్నీకే దూరం కావాల్సి వచ్చింది.
అయితే, పైనల్లో క్రొయేషియా జట్టు ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలై. రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఫిఫా నిర్వాహకులు క్రొయేషియా జట్టుకు రజత పతకాలను అందజేశారు. వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో నికోలా కూడా సభ్యుడే కాబట్టి అతడికి కూడా టోర్నీ నిర్వాహకులు పతకాన్ని కేటాయించారు.
ఈ పతకాన్ని క్రొయేషియా ఫుట్‌బాల్ యాజమాన్యం నికోలాకు పంపించింది. అయితే దీనిని తీసుకునేందుకు నికోలా మనసు అంగీకరించలేదు. దీంతో పతకాన్ని తిప్పి పంపాడు. ఈసందర్భంగా నికోలా మాట్లాడుతూ "వరల్డ్‌కప్ టోర్నీలో నేను ఒక్క మ్యాచ్ ఆడలేదు. మైదానంలో అడుగుపెట్టే అవకాశమే రాలేదు. సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లనన్నానని తిరిగి స్వదేశానికి పంపారు. తీవ్ర మనస్తాపం చెందాను. పతకం పంపినందుకు ధన్యవాదాలు. కానీ, నేను రష్యాలో ఆడలేదు కదా. అందుకే వద్దంటున్నాను" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications