Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడిన ఉత్కంఠ: పొస్టిగ సేఫ్‌, కోల్‌కతాకు రిలీఫ్‌

కోల్‌కతా: అట్లెటికో డీ కోల్‌కతా జట్టు సారధి హెల్డర్‌ పొస్టిగకు మూడు రోజుల క్రితం పక్కటెముకకైన గాయంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్‌లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాడు. దీంతో సౌరవ్‌ గంగూలీ సహ యజమానిగా గల అట్లెటికో డీ కోల్‌కతాకు ఉపశమనం లభించిందని జట్టు మేనేజ్‌మెంట్‌ తెలిపింది. కానీ తదుపరి మ్యాచ్‌లో పాల్గొంటాడా? లేదా? అన్న విషయం మాత్రం వెల్లడించలేదు.

పోస్టిగ కోలుకోనేందుకు ఎంత సమయం పడుతుందన్న సంగతి తెలియదు. మంగళవారం ముంబై సిటీతో జరిగే మ్యాచ్‌కు దూరమవుతాడని అంతా భావిస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌ ఎఫ్‌సితో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే, కోచిలో కేరళ బ్లాక్‌బస్టర్‌పై విజయంతో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అట్లెటికో డీ కోల్‌కతాకు.. ఐఎస్‌ఎల్‌ 3 ఎడిషన్‌ రెండోవారం ఇబ్బందికరమే.

అవి షెడ్యూల్డ్‌ మ్యాచ్‌లు, భద్రత కల్పించాలి: గోవా సీఎం

ఫాటోర్డాలో శనివారం ఎఫ్‌సి గోవా, ఎఫ్‌సి పుణె సిటీ మధ్య జరిగే మ్యాచ్‌కు భద్రత కల్పించాలని గోవా పోలీసులను ముఖ్యమంతఇ లక్ష్మీకాంత్‌ పర్సెకర్‌ ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైనందున ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని దక్షిణ గోవా పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Helder Postiga injury not grave for Atletico de Kolkata

ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు గోవా ప్రయోజనాలకు అనుగుణంగానే షెడ్యూల్‌ ప్రకారం రూపొందించినవేనని, వాటికి భద్రత కల్పించాలని లక్ష్మీకాంత్‌ పర్సెకర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీచేసి.. వివాదానికి తెర దించారు.

అవకాశాలు కోల్పోయానని పాల్‌ ఆవేదన

ముంబై సిటీతో జరిగిన మ్యాచ్‌లో పలుసార్లు గోల్‌చేసేందుకు వచ్చిన అవకాశాలు కోల్పోయామని నార్త్‌ఈస్ట్‌ ప్లేయర్‌ సుబ్రతాపాల్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. ఇరుజట్లు బాగానే ఆడాయని, విజయం సాధించిన ముంబై సిటీ జట్టును గెలిపిస్తున్నట్లు తెలిపాడు. తమ జట్టుకు కలిసి రాలేదన్నాడు. ముంబై గోల్‌ కీపర్‌ పలు దఫాలు తమ జట్టు గోల్‌ చేయకుండా అడ్డుకున్నాడని గుర్తుచేశాడు. తమది సుదీర్ఘ ప్రయాణం అని, తదుపరి గేమ్‌పై తాము దృష్టి సారిస్తామన్నారు. కోచ్‌ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+