Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది అందమైన ఓటమి.. అయినా రికార్డే

దోహ: ఆసియా కాన్ఫిడరేషన్ కప్ (ఎఎఫ్‌సి) ఫైనల్స్ లో ఇరాకీ ఎయిర్‌ఫోర్స్ క్లబ్ జట్టు చేతిలో బెంగళూరు ఎఫ్ సి అందమైన పరాజయాన్ని చవిచూసిందని కోచ్ అల్బర్ట్ రోసా వ్యాఖ్యానించాడు. అయినా ఇది భారత ఫుట్ బాల్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిందన్నాడు. ఆసియా కప్ టైటిల్ గెలుచుకుని చరిత్ర నెలకొల్పడంలో బెంగళూరు జట్టు విఫలమైనా ఈ స్థాయికి చేరుకోవడం అసాధారణమన్నాడు. బెటర్ పెర్పార్మెన్స్ గల జట్టు చేతిలో బెంగళూరు ఓటమి పాలైందనడానికి ఎటువంటి సంకోచాల్లేవని, కానీ అంతా స్వచ్ఛంగా జరిగిందని మీడియాతో అన్నాడు.

అతికష్టమ్మీద ఇరాకీ ఎయిర్‌ఫోర్స్ క్లబ్‌ చేతిలో బెంగళూరు ఓటమి పాలైనా కుర్రాళ్లు భారత ఫుట్‌బాల్ కుర్రాళ్లు నూతన అధ్యాయం లిఖించారని మీడియాతో చెప్పాడు. ప్రతిష్ఠాత్మక ఖండాంతర టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరుకోవడమే భారత్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఇది మొదటిసారి. శనివారం దోహాలో జరిగిన ఫైనల్స్‌లో ఇరాకీ ఎయిర్‌ఫోర్స్ క్లబ్, బెంగళూరు జట్టుపై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

'నేను నా కుర్రాళ్ల గురించి చాలా గర్వ పడుతున్నా. ఫైనల్స్‌లో విజయం అంత తేలిక కాదని వారు నిరూపించారు. భారత్‌లో కొత్త చరిత్ర ప్రారంభించడానికి వారికి అర్హత ఉంది' అని రోసా వ్యాఖ్యానించాడు. 'ఈ దశలో పోటీ చాలా కష్టంగా ఉంటుంది. అందుకు చాలా కష్టపడాల్సి ఉంది. తద్వారా మరోసారి ఫైనల్స్ లో అడుగు పెడితే మెరుగ్గా ఆడొచ్చు. ఆశ్చర్యకరమైన రీతిలో భారతీయ క్లబ్ జట్లు ఎప్పుడూ ఈ స్థాయికి చేరుకోలేదు. ఇక వారినెవ్వరూ నిలువరించలేరు' అని అన్నాడు.

Head held high despite AFC Cup final defeat: Bengaluru FC coach

ఇరాకీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తమ కుర్రాళ్లు ఓటమి పాలయ్యారనడానికి ఎటువంటి సంకోచాలు లేవని, అయితే ఇది చాలా అందమైన, అద్భుతమైన అనుభూతితో కూడిన ఓటమి అని అభివర్ణించాడు. కొన్ని కారణాల వల్లే తాము పాయింట్లు కోల్పోయామని, ఇరాకీ ప్లేయర్లు గొప్ప ఫుట్ బాల్ మ్యాచ్ ఆడితే, బెంగళూరు కుర్రాళ్లు అంతే దీటుగా ఎదుర్కొన్నారని తెలిపాడు. ఈ మ్యాచ్ జరిగిన ప్రతి నిమిషంలోనూ అనేక అంశాలు తెలుసుకోవాల్సి ఉందన్నాడు.

'నేను ఎయిర్ ఫోర్స్ క్లబ్ ను అభినందిస్తున్నా, వారు సుపీరియర్లుగా వ్యవహరించారు. టెటిల్ గెలుచుకునే అర్హత వారిదే. ప్రారంభం నుంచి మేం బంతిపై పట్టు కలిగిలేం. ఎయిర్‌ఫోర్స్ ప్లేయర్లు అన్ని స్థాయిల్లో సంసిద్ధంగా ఉన్నారు. కానీ మేం ఆ లక్ష్యాల సాధనకు సిద్ధంగా లేం. ఇది ఫుట్‌బాల్ ఆట స్థాయి. గతంలో ఏనాడూ ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు' అని రోసా తెలిపాడు. ఎయిర్ ఫోర్స్ కుర్రాళ్లు అద్భుతమైన బ్రాండ్ ఆట రుచి చూపారన్నాడు. అసాధారణమైన ఆసియా కాన్ఫిడరేషన్ కప్ టైటిల్ ను గెలుచుకోవడం అంత తేలికేం కాదన్నాడు.

ఫైనల్స్‌లో సస్పెన్షన్ వేటు పడిన అమరీందర్ సింగ్ స్థానంలో గోల్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించిన లాల్తౌమ్మివియా రాల్టెను రోసా ప్రశంసల్లో ముంచెత్తాడు. గత ఏఫ్రిల్ నుంచి తొలి కాంపిటీటీవ్ మ్యాచ్‌లో ఆడిన లాల్తౌమ్మవియా రాల్టే పలుసార్లు ప్రత్యర్థి జట్టు గోల్స్ చేయకుండా జట్టును రక్షించాడని అభినందించాడు. 'మావియా అద్భుతమైన మేధస్సుతో కూడిన ఆట తీరు ప్రదర్శించినందుకు అభినందనలు. ఎయిర్ ఫోర్స్ క్లబ్ కుర్రాళ్లు సెకండాఫ్‌లో నెలకొల్పిన కొన్ని మంచి అవకాశాలను నిలువరించాడు. అందుకు ఆయన ఆటతీరుతో నేను సంతోషిస్తున్నా' అని తెలిపాడు.

ఒకవైపు తీవ్రమైన ఒత్తిడి ఉన్నా తమ కుర్రాళ్లు చాలా జాగ్రత్తగా మ్యాచ్ ఆడారని, ప్రతి అభినందన అందుకునే అర్హత వారికి ఉన్నదన్నారు. ఫైనల్స్ కు చేరుకోవడం ఒక్కటే లక్ష్యం కాదని, కానీ ఈ స్థాయికి దూసుకెళ్లగలిగామని గుర్తుచేశాడు. 'మనం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో చాలా అంశాలు మన ముందుకు వస్తాయి. మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో మేం మరింత కాంపిటీటివ్‌గా రూపొందుతాం' అని వివరించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+