
హైదరాబాద్: విజయంలో సెక్స్ కూడా కీలక భూమిక పోషిస్తుందట. ఈ సత్యాన్ని బ్రెజిల్ లెజండరీ స్ట్రయికర్ రొమారియో సెలవిచ్చారు. 1994లో అమెరికాలో జరిగిన వరల్డ్ కప్ సాకర్ టైటిల్ బ్రెజిల్ నెగ్గడంలో రొమారియో అద్భుతంగా రాణించారు. మొత్తం 5 గోల్స్‌తో అతడు ప్లేయర్ ఆఫ్ టోర్నీగా కూడా ఎంపికయ్యాడు. మరో 2 నెలల్లో రష్యాలో ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించనున్న 21 ఏళ్ల ఫార్వార్డ్ గాబ్రియెల్ జీస్‌సతో మాట్లాడుతూ ఇలా అన్నాడు.
'చాలినంత సెక్స్ కలిగి ఉండడం ఓ ఆటగాడు బాగా రాణించేందుకు దోహదం చేస్తుంది. ఇంకా..మ్యాచ్ రోజుల్లో ఆటపై దృష్టి నిలపడం కూడా ముఖ్యం. ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు ఇవి ఎంతో తోడ్పడ్డాయి' అని రొమారియో వివరించాడు.
బ్రెజిల్ ఆటగాడిని ప్రోత్సహించేందుకు, ఆటలో నైపుణ్యం మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో రొమారియో గాబ్రియేల్‌కు సూచనలిస్తున్నాడు. వాటిల్లో ఈ సెక్స్ ఒకటి. బ్రెజిల్ అంటే గుర్తుకువచ్చేది ఫుట్‌బాల్. అందులో విజేతగా నిలవడం అంతే ముఖ్యమైనది. ప్రపంచకప్‌లో గోల్‌లు చేయాలనే ఉద్దేశ్యంతో బయల్దేరాలి. అది చాలా కీలకమైన ముఖ్యమైన విషయం' అని పేర్కొన్నాడు.
రొమారియో తన దేశం కోసం చేసిన 70 ప్రదర్శనల్లో 55వాటిలో విజయం పొందాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతర్జాతీయ టోర్నమెంట్ లలో చక్కటి ప్రతిభను చూపించాడు. 1994వ సంవత్సరం గోల్డెన్ బాల్ టోర్నమెంట్‌లో మొదటి ప్రపంచకప్ కోసం పోటీపడ్డాడు.
అందరిలా కాదు. వరల్డ్ కప్ నీకు చాలా ముఖ్యమైంది. ఒక్క విషయం గుర్తు పెట్టుకో. వరల్డ్ కప్‌లో ఆడాలి. మంచి గోల్‌లు చేయాలి. గాబ్రియెల్ జీసస్ యూరప్‌లో ఆడుతుండటం ఒక రకంగా సంతోషించాల్సిన విషయం. 80 నుంచి 90శాతం వరకూ ఉత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్లందరినీ ఇప్పటికే ఎదుర్కొన్నాడు.