Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Happy Birthday Cristiano Ronaldo: అసాధారణ రికార్డులు అతడి సొంతం

ఫుట్‌బాల్ గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తే సగటు వ్యక్తి కచ్చితంగా క్రిస్టియానో రొనాల్డో గురించి మాట్లాడాల్సిందే. అద్భుతమైన గోల్స్ సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఫుట్‌బాల్ ఆదరణ లేని దేశాల్లో అయినా సరే.. రొనాల్డోకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా ఆటలో ఆధిపత్యం చెలాయిస్తున్న రొనాల్డో ఇవాళ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

క్రిస్టియానో రొనాల్డో సాధించిన రికార్డులు అసాధారణం. రియల్ మాడ్రిడ్‌కు వెళ్లినప్పుడు రొనాల్డో ప్రయాణం అత్యున్నత స్థాయికి చేరింది. ప్రత్యర్థి జట్లపై కనికరం లేకుండా గోల్స్ వర్షం కురిపించాడు. 140 మ్యాచ్‌ల్లోనే 150 లీగ్ గోల్స్‌ను సాధించి స్పానిష్ లీగ్‌లో రికార్డు సృష్టించాడు. అంతేగాక 451 గోల్స్‌తో ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 2011-12 నుంచి 2017-18 వరకు నాలుగు సార్లు ఛాంపియన్‌గా మాడ్రిడ్‌ నిలవడంలో అతడిది ప్రధాన పాత్ర.

Happy Birthday Cristiano Ronaldo: He owns extraordinary records

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోనూ పోర్చుగల్ తరఫున క్రిస్టియానో రొనాల్డో ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్. 2003లో అరంగేట్రం చేసిన అతడు 200 గేమ్స్‌లో 123 గోల్స్ కొట్టాడు. అలీ డేయ్ 109 గోల్స్ రికార్డును అధిగమించాడు. అంతేగాక పోర్చుగల్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మాంచెస్టర్ యునైటడ్, రియల్ మాడ్రిడ్ ట్రోఫీలు గెలవడంలో రొనాల్డోది అద్వితీయమైన పాత్ర. 2011 నుంచి 2014 మధ్యలో సూపర్ ఫామ్ కొనసాగించాడు. సగటును ఏడాదికి 60 గోల్స్‌తో ఆకట్టుకున్నాడు.

Happy Birthday Cristiano Ronaldo: He owns extraordinary records

అయితే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రొనాల్డో సొంత జట్టు పోర్చుగల్‌ ప్రమాదకర జట్టు కాదు. ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రదర్శన సాధారణంగానే ఉంటుంది. క్రిస్టియానో రొనాల్డో ఉన్నప్పటికీ పోర్చుగల్‌ను ఫేవరెట్‌గా ఎక్కువమంది పరిగణించరు. దానికి తగ్గట్టుగానే గత ప్రపంచకప్‌లో రొనాల్డో గొప్ప పోరాడినప్పటికీ జట్టును విశ్వవిజేతగా నిలపలేకపోయాడు.

Story first published: Monday, February 5, 2024, 10:22 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+