150 మంది సెలబ్రిటీల మధ్యలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నెయమార్

హైదరాబాద్: తన పాతికేళ్ల వయస్సుకి గుడ్ బై చెప్తూ నూతన వసంతంలోకి అడుగుపెట్టిన నెయ్‌మర్ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. దాదాపు 150 మంది సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభవంగా సోమవారం ఫిబ్రవరి 5న ఈ సంబరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ మాజీ ఛాంపియన్ లూయీస్ హామిల్టన్, ప్రపంచ కప్ విజేత జట్టు ఆటగాడైన రొనాల్డొ, ఆ దేశ ప్రెసిడెంట్ అయిన మైకేల్ టేమెర్ ఉన్నారు.
గతేడాది నుంచే నెయ్‌మర్ పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ కు 220మిలియన్ యూరోల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇప్పటి వరకు తన ఫుట్‌బాల్ కెరీర్‌లో 350గోల్‌లు చేశాడు. అయితే ఈ సీజన్‌కు మాత్రం 18గోల్‌లు పూర్తి చేయగలిగాడు. ఆఖరు మ్యాచ్‌లో అతని క్లబ్ సైతం గెలిచేందుకు కీలక పాత్రధారిగా నిలిచాడు. దీంతో అతని జట్టుకు సీజన్‌కు సంబందించి 11 పాయింట్లు వచ్చి చేరాయి.
నెయ్‌మర్ లీగ్ వన్ టైటిల్ గెలుచుకునేందుకు పారిస్ సెయింట్ జర్మన్ తరపున తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రధాన ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ జట్టు ఉంది. ఈ పుట్టిన రోజు వేడుకకు ఆ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లు కూడా రావడం విశేషం.
'ఇంతకుముందు జరిగిన వాటన్నికంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. మేము ఆడబోతోంది కూడా గట్టి పోటీనిచ్చే జట్టు. ఆ జట్టంటే మాకు ప్రత్యేక అభిమానం ఉంది. అలా అని ప్రత్యర్థిని ఓడించక పోతే గెలవలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ ను గెలిచేందుకు కృషి' చేస్తానని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications