Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎటికె జట్టును గుర్తించడం కష్టమైందన్న గంగూలీ

కోల్‌కతా: ముంబై సిటీ ఎఫ్ సి జట్టుతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జట్టు కోచ్ జోస్ మొలీనా తొమ్మిది మార్పులు చేస్తుంటే తన టీంకు గుర్తింపునివ్వడానికి చాలా కష్ట పడ్డానని అట్లెటికో డి కోల్‌కతా జట్టు సహ యజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు.

తొలి సెమీస్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత మొదటి 11 మంది సభ్యుల టీం అంటూ ఏమీ ఉండదన్నాడు. ప్రతి ఒక్కరూ తమ జట్టులో సమానమేనని చెప్పాడు. సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీర్ఘకాలంలో జట్టుకు మేలుచేస్తుందా? లేదా? అని అనుమానించానన్నాడు.

మ్యాచ్ ప్రారంభమైన తర్వాత జట్టులో ఎవరెవరు ఆడుతున్నారో తెలుసుకునేందుకు తనకు 15 నిమిషాలు పట్టిందని అన్నాడు. తన సహ యజమాని సంజీవ్ గోయెంకాతో కలిసి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ పూర్తిగా అర్థంచేసుకున్న తర్వాత జట్టుకు మంచే జరుగుతుందని నిర్ధారణకు వచ్చినట్లు మీడియాతో అన్నాడు.

విజయం సాధించడం అద్భుతం

విజయం సాధించడం అద్భుతం

ఏదిఏమైనా జట్టు విజయం సాధించడం అద్భుతంగా ఉన్నదన్నాడు. కానీ ఫుట్ బాల్ టోర్నీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తానేం సాంకేతికంగా పరిపూర్ణమైన వ్యక్తిని కాదన్నాడు. కనుక జట్టులో మార్పులపై తానేం వ్యాఖ్యానించలేనని చెప్పాడు. అట్లెటికో డి కోల్‌కతా జట్టు మూడేళ్లలో రెండోసారి ఫైనల్స్‌కు చేరుకోవడం గర్వకారణమని, ఇది తమ జట్టు సుస్థిర సామర్థ్యానికి నిదర్శనమన్నాడు. మూడు సీజన్లలో రెండుసార్లు ఫైనల్స్ వరకు దూసుకెళ్లామని, ఇది తమ జట్టు శక్తి సామర్థ్యాలను తెలియజేస్తుందన్నాడు.

గంగూలీని ఇంప్రెస్ చేసిన ఇయాన్ హుమ్

గంగూలీని ఇంప్రెస్ చేసిన ఇయాన్ హుమ్

కోల్ కతా జట్టులో కెనడియన్ స్ట్రయికర్ ఇయాన్ హుమ్ ఈ దఫా ఏడు గోల్స్ సాధించి గంగూలీని చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. ‘ఆయన అసాధారణమైన ప్లేయర్. మా జట్టులో ఒక స్టార్ మాదిరిగా ఆడుతున్నాడు. అఫ్ కోర్స్ సారధి హెల్డర్ పొస్టిగ, బొర్జా ఫెర్నాండెజ్ కూడా చాలా బాగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక దేశీయ ఆటగాళ్లు దేబ్జిత్ మజుందార్, ప్రబీర్ దాస్ కూడా నన్ను ఇంప్రెస్ చేశారు' అని తెలిపాడు.

షాంఘై ఎస్ఐపిజిలో చేరికకు చెల్సియా మిడ్ ఫీల్డర్ ఆస్కార్ తహతహ

షాంఘై ఎస్ఐపిజిలో చేరికకు చెల్సియా మిడ్ ఫీల్డర్ ఆస్కార్ తహతహ

చెల్సియా మిడ్ ఫీల్డర్ ఆస్కార్ తాజాగా చైనీస్ సూపర్ లీగ్‌లో భాగస్వామిగా చేరనున్నాడు. 60 (63.8 మిలియన్ల అమెరికన్ డాలర్లు) మిలియన్ల యూరోలకు షాంఘై ఎస్ఐపిజి జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. వ్యక్తిగతంగా ఆస్కార్ షరతులు, విధి విధానాలు ఈ వారంలో ఖరారవుతాయని అంచనా వేస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొన్న తర్వాత లండన్ క్లబ్ చెల్సియాలో చేరాడు.

ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అంటోనియో

ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అంటోనియో

కానీ గత జూలైలో అంటోనియో కాంటే జట్టు కోచ్‌గా చేరినప్పటి నుంచి మ్యాచ్‌ల్లో ఆడేందుకు పరిమిత అవకాశాలు లభిస్తుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుత ఇపిఎల్ సీజన్‌లో చెల్సియా జట్టు 15 మ్యాచ్‌లు ఆడితే కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆస్కార్ ఆడటం గమనార్హం. ఇటీవలి కాలంలో చైనా క్లబ్ జట్లలో చేరుతున్న బ్రెజిలియన్ ఇంటర్నేషనల్ ప్లేయర్లలో ఆస్కార్ ఒకడు కానున్నాడు.

షాంఘై ఎస్ఐపిజి మూడో స్థానంలో

షాంఘై ఎస్ఐపిజి మూడో స్థానంలో

ఇప్పటి వరకు పాలిన్హో (గ్యాంగ్ జౌ ఎవర్ గ్రాండె), రెనాటో అగస్టో (బీజింగ్ గువాన్), డియాగో టార్డెల్లి (షాన్ డాంగ్ లునెంగ్), లుయిస్ ఫబియానో (టియాన్ జిన్ సాంగ్జియాంగ్) ఉన్నారు. గత సీజన్‌లో షాంఘై ఎస్ఐపిజి మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో స్వెన్ గోరాన్ ఎరిక్సన్‌ను చెల్సియా మాజీ కోచ్ ఆండ్రె విల్లాస్ బోస్ స్థానంలో నియమించారు. ప్రస్తుతం షాంఘై ఎస్ఐపిజి జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్లు ఎల్కెసన్, హల్క్ ఆడుతున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+