Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హబాస్ పుల్ హ్యాపీ: గుణపాఠమన్న జంబ్రొట్టా

పుణె: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో పూర్తి శక్తి సామర్థ్యాలతో చెలరేగిపోతున్న ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లకు ఎఫ్ సి పుణె సిటీ ప్లేయర్లు ముకుతాడు వేశారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అధ్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ కుర్రాడు కియాన్ లూయిస్ గోల్ తో ఆధిక్యం సాధించినా.. సెకండాఫ్ అసాంతం పుణె ప్లేయర్ల వశమైంది.

ఢిల్లీని 4-3 స్కోర్ తేడాతో హబాస్ సేన మట్టికరిపించడం ఆశామాషీ కానే కాదు. తమ గెలుపు ఫ్యాన్స్‌కు సంతోషాన్ని మిగిల్చిందని పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్ వ్యాఖ్యానించాడు. సొంతగడ్డపై లీగ్ దశలో ఆడుతున్న చివరి మ్యాచ్ అని, ఈ మ్యాచ్‌లో విజయంతో ఫ్యాన్స్‌తోపాటు తమకూ సంతోషాన్నిచ్చిందన్నాడు.

తమ జట్టు ప్రస్తుత సీజన్‌లోనే బెస్ట్ జట్టుతో ఆడుతున్నామన్న సంగతి తెలుసునన్నాడు. ఇది రెండు జట్లకు మంచి మ్యాచేనన్నాడు. ఈ తరహాలో విజయమే తమకు కావాల్సిందని వ్యాఖ్యానించాడు. ఫస్టాఫ్‌లో సారధి మహ్మద్ సిస్సోకో పెనాల్టీ కార్నర్ మిస్సవ్వడం సహా ఎడుయారో ఫెరీరా, మొమ్మర్ డోయే, అనిబల్ రోడ్రిగెజ్ పలు చాన్స్‌లు వచ్చినా గోల్స్ చేయలేకపోయారని చెప్పాడు.

విజయంపై హితబోధ చేశా

విజయంపై హితబోధ చేశా

కానీ ఆత్మనూన్యతా భావంతో సతమతమవుతున్నారని, కానీ తమదైన శైలిలో మ్యాచ్ ఆడితే విజయం సాధించగలరని హితబోధ చేశానని హబాస్ వ్యాఖ్యానించాడు. రెండు మ్యాచ్‌ల మధ్య ఎక్కువ సమయం అవసరమని తెలిపాడు. ఇప్పుడు తాము నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో జరిగే మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నామని, భారీగా ప్రయాణం చేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నాడు. ఎక్కువ సమయం కోలుకోవడంపైనే ఫోకస్ చేయాల్సి వస్తున్నదన్నాడు.

సెమీస్ చోటు కోసం ఆలోచించడం లేదు

సెమీస్ చోటు కోసం ఆలోచించడం లేదు

తాము సెమీ ఫైనల్స్ లో చోటు కోసం ఆలోచించడం లేదని, నార్త్ఈస్ట్ జట్టుతో జరిగే మ్యాచ్ పై కేంద్రీకరించామన్నాడు. సీరియస్ గా ద్రుష్టి సారిస్తే విజయం సాధించొచ్చని తమ కుర్రాళ్లు రుజువుచేశారన్నాడు. తాము టాప్ 4లో నిలబడాలంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమతూకం చేయడం చాలా ముఖ్యం అన్నాడు. 22న నార్త్ఈస్ట్ జట్టుతో గౌహతిలో పుణె జట్టు తలపడనున్నది.

పున:సమీక్షకిది చాన్స్: జంబ్రొట్టా

పున:సమీక్షకిది చాన్స్: జంబ్రొట్టా

పుణె జట్టుతో తమ ఓటమి తమకు ఒక గుణపాఠం వంటిదని ఢిల్లీ డైనమోస్ చీఫ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు. తమ జట్టు ప్లేయర్ల ప్రతిభ, వ్యూహం తదితర అంశాలను మరోసారి సమీక్షించుకుంటామన్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైనా ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నది. తాము చాలా క్లిష్టమైన, బెస్ట్ టీంతో తలపడుతున్నామని తమ కుర్రాళ్లకు తెలుసునని జంబ్రొట్టా అన్నాడు. ఫస్టాఫ్ లో తమ కుర్రాళ్లు చాలా పొరపాట్లు చేశారన్నాడు.

అవకాశాన్ని సద్వినియోగం

అవకాశాన్ని సద్వినియోగం

రెండు గోల్స్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవడం కష్టసాధ్యంగా పరిణమించిందన్నాడు. కొన్నిసార్లు ఓటమి కూడా ముందడుగు వేసేందుకు సాయపడుతుందని చెప్పాడు. పాజిటివ్ కోణంలో మ్యాచ్ ఆడాలని జంబ్రొట్టా పదేపదే ఢిల్లీ కుర్రాళ్లకు ఉద్బోధించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ గోల్స్ సాధించే సామర్థ్యం అవసరమేనన్నాడు. తాము మరో మూడు గేమ్స్ ఆడాల్సి ఉన్నదని, వాటిల్లో విజయం ద్వారా సెమీస్ బెర్త్‌ను సంపాదిస్తామని జంబ్రొట్టా అన్నాడు. దూకుడుగా ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఢిల్లీ ప్రారంభంలోనే లీడ్ సాధించినా ముందుకు వెళ్లలేకపోయింది.

చివరి క్షణంలో విజయం

చివరి క్షణంలో విజయం

పాజిటివ్ గా ఆడటం వల్ల చివరి క్షణంలో విజయం సాధించగలమని, అదే తమకు అతిపెద్ద పాజిటివ్ అంశమన్నాడు జంబ్రొట్టా. అదే సమయంలో తాము ఎదుర్కొనే జట్టు, దాని శక్తి సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవరం ఉన్నదని స్పష్టం చేశాడు. తాము అద్యంతం అటాకింగ్ ధోరణితో మ్యాచ్ ఆడినా దురద్రుష్టవశాత్తు రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యామన్నాడు. మరికొన్ని గోల్స్ చేయాల్సి ఉన్నా.. లక్ష్యాలను అందుకోలేకపోయామన్నాడు. తాము ఎక్కడ పొరపాటు చేశామో సమీక్షించుకుంటామని జంబ్రొట్టా తెలిపాడు. ఈ నెల 27న ఎఫ్ సి గోవా జట్టుకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+