For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లేఆఫ్ పై హబాస్ ధీమా: ఫ్యాన్స్ కీలకమన్న మాటరాజ్జీ

చెన్నై: వరుసగా మూడో విజయం కోసం ఎదురుచూస్తున్న ఎఫ్ సి పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్.. డిపెండింగ్ చాంపియన్ చెన్నయిన్‌తో తలపడటం ఒకింత కష్టసాధ్యమేనని వ్యాఖ్యానించాడు. అట్లెటికో డీ కోల్ కతా, ముంబై సిటీలతో వరుస విజయాలతో పుణె జోరుమీదుంది.

మంగళవారం డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ తో జరిగే మ్యాచ్ లో గెలుపొందితే పుణె జట్టు టాప్ 4 జాబితాలో చేరుతుంది. తద్వారా సెమీస్‌పై ఆశలు యథాతథంగా ఉంటాయి. ఈ మ్యాచ్ లో ఓటమి పాలైతే సెమీస్ ఆశలు వదులుకోవాల్సిందేనన్న అవగాహన రెండు జట్లలోనూ ఉంది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఆడినా సెమీస్ లో బెర్త్ ఖాయంగా ఉంటుందని పుణె కోచ్ హబాస్ ధీమాగా ఉన్నాడు.

మరోవైపు చెన్నైయిన్ ఎఫ్ సి గత ఐదు మ్యాచ్ ల్లో మూడింట ఓటమిభారంతో సతమతమవుతున్నది. అయితే సూపర్ మాచన్స్ తో మ్యాచ్ ఒకింత కష్టంగా ఉండొచ్చని హబాస్ వ్యాఖ్యానించాడు. '45 రోజుల గడువులోగా జట్టును శక్తిమంతమైందిగా తీర్చిదిద్డడం, సమిష్టితత్వాన్ని అలవర్చడం చాలా కష్టం.

ప్రతి జట్టూ సెమీస్ లోకి దూసుకెళ్లాలని ఆశిస్తుంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందిన వారే సెమీస్ కు వెళ్లగలరు. ఇదే అంశం చెన్నైయిన్ జట్టుకు కూడా వర్తిస్తుంది. నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ కు వెళ్లగలం. సమర్థమైన జట్టు చెన్నైయిన్ పై గెలుపొందడం ఆశామాషీ కాదు' అని హబాస్ మీడియాతో చెప్పాడు.

ఈ ఏడాది ప్రారంభంలో తనపై తొలి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిషేధం అమలులో ఉండటంతోపాటు కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగడం ఒకింత విభిన్నంగా ఉన్నదని తెలిపారు. తమకు జట్టు నిర్మాణానికే కొంత సమయం పట్టిందని తెలిపాడు.

Habas expects a tough encounter against Chennaiyin

అయితే ప్రస్తుతం హై ఇంటెన్సిటీ అటాకింగ్ వ్యూహాన్ని అమలుచేయబోతున్నామన్నాడు. మార్కో మాటరాజ్జీ వంటి కోచ్ సారధ్యంలోని చెన్నైయిన్ జట్టును ఢీ కొట్టాలంటే ఇటువంటి వ్యూహమే అమలు చేయాల్సి ఉంటుందని హబాస్ వ్యాఖ్యానించాడు. చెన్నైయిన్ జట్టుతో మంచి మ్యాచ్ ఆడగలమనే భావిస్తున్నట్లు చెప్పాడు.

ఎఎఫ్ సి ఫైనల్స్ ముగిసిన తర్వాత బెంగళూరు ఎఫ్ సి జట్టు నుంచి జట్టులో చేరిన ఎగెన్సోన్ లింగ్డో ముంబై సిటీపై చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. సెకండాఫ్ లో లింగ్డో గోల్ వల్లే పుణె విజయం సాధించింది. ఏగెన్ తన వద్ద ఉన్న అస్త్రాల్లో ఒకడని హబాస్ తెలిపాడు.

పిచ్ పై ఒక్కో ప్లేయర్ కు ఒక్కో బాధ్యత అప్పగిస్తామని, కానీ లింగ్డో గొప్ప ఆటగాడని, పలు బాధ్యతలు నిర్వర్తించగల సమర్థుడని తెలిపాడు. ఎడుయారో ఫెరీరా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయక ప్లేయర్ అని అభివర్ణించాడు. తమకు చాలా మంచి ప్లేయర్లు ఉన్నారని, ప్రతిగేమ్ కూడా చాలా టైట్ గా ఉంటుందని, ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందన్నాడు. తాము చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశామని, పుణె సిటీతో ఉన్నందుకు సంతోషంగా ఉందని ఫెరీరా వ్యాఖ్యానించాడు.

సెమీసే లక్ష్యమన్న మాటరాజ్జీ

సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లడమే తమ లక్ష్యమని చెన్నైయిన్ కోచ్ మార్కో మాటరాజ్జీ వ్యాఖ్యానించాడు. గత రెండు మ్యాచ్ ల్లో ఏడు గోల్స్ ప్లస్ ఆరు పాయింట్లు కోల్పోయి... మొత్తం 9 మ్యాచ్ లలో 10 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైన డిఫెండింగ్ చాంపియన్ ఇప్పటికీ సెమీస్ పై ఆశలు పెట్టుకోవడం ఆసక్తికరమే.

మంగళవారం పుణెతో జరిగే మ్యాచ్ లో విజయం కోసం ఫ్యాన్స్ మద్దతు చాలా కీలకమని చెప్పాడు. భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకు తరలి వచ్చి జట్టుకు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చాడు మాటరాజ్జీ. తమ జట్టు ఏం చేయాలన్నా ఫ్యాన్స్ మద్దతుతోనే సాధ్యమన్నాడు. డిఫెండింగ్ చాంపియన్లుగా సూపర్ మాచన్స్ గత తొమ్మిది మ్యాచ్ లల్లో 14 గోల్స్ మాత్రమే చేయడంతో డిఫెన్సివ్‌లో దారుణమైన రికార్డు మూటగట్టుకున్నది.

అయితే తమ వైఫల్యాలపై పదేపదే ద్రుష్టి సారించదలుచుకోలేదని మాటరాజ్జీ అన్నాడు. ఫౌల్స్, గోల్ కీపర్ అశ్రద్ధ, కౌంటర్ అటాకింగ్ లేకపోవడం వల్లే తమ జట్టు పలు మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యామన్నాడు మాటరాజ్జీ. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లలో ఏడు, ముంబై సిటీతో జరిగిన మ్యాచ్ లో ఫ్రీ కిక్ చాన్స్ లను మిసయ్యామన్నాడు.

తామేమీ అశ్రద్ధగా లేకపోయినా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని అన్నాడు. ముంబై, కేరళ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో సెకండాఫ్ లో గోల్ చేయమని దూదూను ఆదేశించినా.. ఫుట్ బాల్ వంటి క్రీడల్లో అనుకున్నంత తేలికేం కాదన్నాడు. చివరి నిమిషాల్లో తాము గోల్స్ ఇవ్వడం వల్లే ఇంతకుముందు చెన్నైయిన్ తో జరిగిన మ్యాచ్‌లో సికె వినీత్ రెండు గోల్స్‌తో కేరళను గెలిపించాడని మాటరాజ్జీ గుర్తుచేశాడు.

తమకు సబ్ స్ట్యూట్స్ ఉన్నారని, ఫిట్ నెస్ సమస్యే కాదన్నాడు. ఇప్పటికీ సెమీస్ కు దూసుకెళ్లగల సామర్థ్యం తమకు ఉన్నదని తెలిపాడు. ప్రస్తుతం గోవా పూర్తిగా దిగువ స్థానంలో ఉన్నదని, ఇప్పటికీ ప్లేఆఫ్ దశకు దూసుకెళ్లేందుకు తమకు అవకాశాలు ఉన్నాయన్నాడు. కానీ డిఫెండింగ్ చాంపియన్ జట్టుగా ఆ స్థాయికి దిగువనే ఈ సీజన్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితికి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని మాటారాజ్జీ పేర్కొన్నాడు. ప్రతికూల సమయంలోనూ ఫ్యాన్స్ అండ తమకు కావాలన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+