న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం షురూ.. ఎక్కడంటే?!!

Guangzhou to build worlds largest professional football stadium

షాంఘై: ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. 'ఫ్లవర్‌ సిటీ'గా పేరున్న గాంగ్‌ఝౌ నగరంలో కమలం ఆకారంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. చైనా జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌ అయిన గాంగ్‌ఝౌ ఎవర్‌గ్రెండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ యాజమాన్యం దీని రూపకర్త. ఆ క్లబ్‌ యాజమాన్యం గురువారం స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించింది.

ఆర్చర్ అద్భుతమైన పేసర్.. అతడికి పోటీతత్వం ఎక్కువ: గెలెస్పీఆర్చర్ అద్భుతమైన పేసర్.. అతడికి పోటీతత్వం ఎక్కువ: గెలెస్పీ

సుమారు 1.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) లక్ష మంది ప్రేక్షక సామర్థ్యం ఉండేలా నిర్మిస్తున్న ఈ స్టేడియం 2022 చివరి వరకూ సిద్ధం కానుంది. 2022లోగా దీనిని పూర్తి చేసి.. గాంగ్‌ఝౌ ఎవర్‌గ్రెండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తమ హోమ్‌ గ్రౌండ్‌గా ఉపయోగించుకోనుంది. బార్సిలోనాలోని ప్రముఖ స్టేడియం 'క్యాంప్‌ నో' కంటే పెద్దగా నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని కమలం ఆకారంలో తీర్చిదిద్దనున్నారు. దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచే దిశగా చైనా ప్రభుత్వం స్టేడియాలను నిర్మించేందుకు క్లబ్‌లను ప్రోత్సహిస్తోంది.

మరోవైపు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం (సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం) ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతికెక్కిన విషయం తెలిసిందే. లక్షకు పైగా మంది కూర్చొనే ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ) కంటే పెద్దది. మొతేరా స్టేడియం ఇప్పటికే సిద్దమయింది. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మొతేరా స్టేడియం తుది మెరుగులు దిద్దుకుని మ్యాచులకు ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధమంది.

ఈ ఏడాది చివర్లో ఆసియా ఎలెవన్-ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ కన్నా పెద్దది కావడం విశేషం. సర్దార్ పటేల్ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. ఎంసీజీ 90 వేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డులకెక్కింది. ఇప్పుడా ఆ రికార్డు సర్దార్ పటేల్ స్టేడియం సొంతం కానుంది.

Story first published: Friday, April 17, 2020, 7:44 [IST]
Other articles published on Apr 17, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X