Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డో, మెస్సీలతో పోల్చుకుని ఇంకా.. బాగా ఆడాలి

 Griezmann needs trophies to be compared with Messi and Ronaldo: Torres

హైదరాబాద్: ఏ జట్టులో అయినా సహచర ఆటగాడికి సూచనలివ్వడం మామూలే. కానీ, వేరే ఆటగాళ్లతో పోల్చి అలాంటి రికార్డులు నెలకొల్పానడం చాలా అరుదు. అలా.. అట్లెటికో మాడ్రిడ్ ఫార్వార్డ్ ఆటగాడు ఫెర్నాండో టొర్రెస్ తన జట్టు ఆటగాడైన ఆంటోనీ గ్రీజ్‌మన్‌ను దిగ్గజాలైన లియోనల్ మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డోలతో పోల్చుకోమంటూ సూచిస్తున్నాడు. గ్రీజ్‌మన్ అసాధారణ ప్రతిభను మెరుగుపరుచుకోవాలనే నేపథ్యంలోనే ఇలా ప్రతిపాదించాడు.

గ్రీజ్‌మన్ ఏం తక్కువ కాదు. గతేడాది జరిగిన బాలోన్ డీ ఆర్ అవార్డుల ఎంపికలోనూ చివరిగా తీసిన జాబితాలో విజేత రొనాల్డో, లియోనల్ మెస్సీ తర్వాత వ్యక్తిగా జాబితాలో నిలిచాడు. ఇంతేగాక, గ్రీజ్‌మన్ జాతీయ జట్టు తరపునే కాకుండా మిగిలిన జట్ల తరపున ఆడితే సరిపోదని కేవలం స్కోరు సంపాదిస్తే సరిపోదని పేర్కొన్నాడు అతని సహచరుడు.

అతని స్నేహితుడు కూడా రొనాల్డో, మెస్సీ అంతటి స్థాయి పొందడానికి తగిన అర్హతలున్నవాడని ఈ సందర్భంగా ఆంటోనీ టొర్రసె తెలిపాడు. మెస్సీ, రొనాల్డోలు ఫేమ్ బాగా పొందడంతో అతను ఏ మాత్రం హైలెట్ కాలేకపోతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అట్లెటికో మాడ్రిడ్ జట్టు తరపున ఆడి ఇంకా చాలా సంపాదించగలడనే నమ్మకాన్ని వ్యక్త పరిచాడు.

గ్రీజ్‌మన్ గత సీజన్ అనంతరం అట్లెటికొ మాడ్రిడ్ జట్టు నుంచి బదిలీ అయ్యేందుకు యత్నించాడు. కానీ, పెద్ద మొత్తంలో లాభం చేకూరదన్న యోచనతో తిరిగి అట్టెటికొ జట్టుకే ఆడేందుకే సిద్ధపడ్డాడు. గతేడాది సమ్మర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అతను 90 మిలియన్ పౌండ్లకు కుదురుకున్నట్లు సమాచారం. ఆ జట్టు పాల్గొన్న 13 పోటీలలో పాల్గొన్న గ్రీజ్‌మన్ 26 గోల్‌ల స్కోరును చేశాడు.

ఇప్పటికే అట్లెటికో జట్టు దేశీ వాలీగా జరిగిన పోటీల్లో 12పాయింట్లతో బార్సిలోనా జట్టు కంటే వెనుకబడి ఉంది. వచ్చే వారాంతంలో జరగనున్న యూరోపా లీగ్ సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచి మళ్లీ పునర్వైభవాన్ని తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంది అట్లెటికో.

Story first published: Wednesday, April 18, 2018, 18:12 [IST]
Other articles published on Apr 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+