Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ, రొనాల్డోలకు సవాల్: లా లీగా బెస్ట్‌ ప్లేయర్ గ్రైజ్మన్

మాడ్రిడ్: ఈ ఏడాది లా లీగా టోర్నీలో బెస్ట్ ప్లేయర్ అవార్డుకు అట్లెటికో మాడ్రిడ్ ఫార్వర్డ్‌ప్లేయర్ అంటోనే గ్రైజ్మన్ ఎంపికయ్యాడు. ఇప్పటివరకు లీగ్ జెయింట్స్ రియల్‌మాడ్రిడ్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో, బార్సిలోనా క్లబ్‌కు చెందిన లియానెల్ మెస్సీలను అధిగమించి ఆంటోనే గ్రైజ్మన్ ఎంపిక కావడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోచ్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు అట్లెటికో'స్ డియాగో సిమ్మోన్, టాప్ నాన్ ఈయూ ప్లేయర్ అవార్డుకు బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ సౌరేజ్ పేర్లు నామినేట్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే బార్సిలోనా అంతర్జాతీయ ప్లేయర్ మెస్సీకు బెస్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ గుర్తింపునిస్తూ వాలెంసియాతో మ్యాచ్ తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో నిర్వాహకులు ప్రకటించారు.

ఈ దఫా లా లీగా అవార్డుల్లో అట్లెటికో జట్టు డామినేట్ చేస్తోంది. బెస్ట్ గోల్ కీపర్‌గా ఎంపికైన జాన్ ఒబ్లాక్, టాప్ డిఫెండర్ డియాగో గోదిన్, ఫ్రెంచ్‌మన్ గ్రైజ్మన్ కూడా ఫ్యాన్స్ అవార్డులకు ఎంపికయ్యారు. అయితే రియల్ మాడ్రిడ్ వట్టి చేతులతో వెళ్లాల్సిన అవసరం లేదనుకోండి. ఎందుకంటే బెస్ట్ మిడ్ ఫీల్డర్‌గా లుక్కా మొడ్రిక్.. రియల్ మాడ్రిడ్ కుర్రాడే మరి.

Griezmann beats Messi and Ronaldo to Liga award

బాల్లోన్‌కూ వారి మధ్యే ప్రధాన పోటీ

ఈ ఏడాది బాల్లోన్ డీ'ఓర్ ట్రోఫీ కోసం లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఫ్రాన్స్ ఫుట్ బాల్ లెజెండ్ థైర్రీ హెన్రీ వ్యాఖ్యానించారు. వీరితోపాటు అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్ ఆంటోన్నే గ్రైజ్మన్ కూడా పోటీ పడతాడని 'పుమా' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హెన్రీ తెలిపారు. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మంగళవారం 2016 సంవత్సరానికి బాల్లోన్ డీ'ఓర్ అవార్డు కోసం 30 మంది ప్లేయర్ల జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ జాబితాలో పోర్చుగల్ కు చెందిన క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా ప్లేయర్ లియానెల్ మెస్సీల పేర్లు చేరాయి. మెస్సీ ఐదు సార్లు బాల్లోన్, మూడుసార్లు రొనాల్డో గెలుచుకున్నారు. గత ఐదేళ్లుగా ఈ అవార్డు కోసం మెస్సీ, రొనాల్డోలే తొలి రెండు స్థానాల్లో నిలుస్తున్నారు.

'వారిద్దరూ అసాధారణమైన ప్లేయర్లు. నేనింత వరకు అటువంటి శక్తి సామర్థ్యాలు గల ప్లేయర్లను చూడలేదు. ఒక సీజన్‌లో వారు 50 గోల్స్, 60, 90 గోల్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. డిఫెండర్లు వారిని నిలువరించలేరా? అన్న ప్రశ్న అసంబద్ధం. అది మనమెవ్వరం చూడలేం' అని హెన్రీ వ్యాఖ్యానించాడు.

'నేను లియోతో కలిసి ఆడినప్పుడు ఆయన గెలిస్తే నేనెలా ఫీలవుతానో మీకు తెలుసా. రొనాల్డో, లియానెల్ మెస్సీ మధ్య మరొకరిని చూడటం చాలా కష్టం' అని హెన్రీ అన్నాడు. ఆరేళ్ల తర్వాత బాల్లోన్ డీ'ఓర్ అవార్డుల నిర్ణయం విధానం మారిపోయింది. ఇంతకుముందు ఫిఫాతో కలిసి వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అవార్డులను ఎంపికచేసేవారు.

కానీ ఈ ఏడాది నుంచి బాల్లోన్ డీ' ఓర్ అవార్డు నిర్వాహకులు తొలి పద్ధతిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి నేషనల్ లీమ్ కోచ్‌లు, కెప్టెన్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో గాక కేవలం జర్నలిస్టుల కమిటీ ఓటింగ్ ద్వారానే అవార్డుల ఎంపిక జరుగనున్నది.

'రాయల్‌స్పానిష్'పై ఫిఫా ఆంక్షలు
రాయల్ స్పానిష్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఆర్ఎఫ్ఇఎఫ్)పై ఫిఫా ఆంక్షలు విధించింది. ఈ క్లబ్ అంతర్జాతీయంగా అండర్ - 18 కుర్రాళ్ల పేర్ల నమోదులో పలు నిబంధనలను ఉల్లంఘించిందని ఫిఫా క్రమశిక్షణా కమిటీ దర్యాప్తులో నిర్ధారణ అయింది. విదేశీ మైనర్ ఆటగాళ్ల పేర్ల నమోదు విషయంలో ఫిఫా రూల్స్‌లో 19వ అధికరణాన్ని ఉల్లంఘించి ఒప్పందాలు చేసుకున్నదని తేల్చింది.

నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరు నెలల్లోపు ఆర్ఇఎఫ్ఎఫ్‌ను 2,17,40 డాలర్ల జరిమానా చెల్లించాలని ఫిఫా ఆదేశించిందని ఇఫె వార్తా కథనం ప్రచురించింది. 2007 నుంచి 2014 మధ్య అట్లెటికో డి మాడ్రిడ్, 2005 నుంచి 2014 మధ్య రియల్ మాడ్రిడ్ జట్లలో మైనర్ బాలలకు ప్రాతినిధ్యం కల్పించారని దర్యాప్తులో తేలిందని ఫిఫా క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదికలో తెలిపింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+