For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైవ్ మ్యాచ్ గురించి తెలుసుకోవాలంటే.. ఇక నుంచి గూగుల్‌లో ఫ్రీ..

Google Search, Google News Get New Features for 2018 FIFA World Cup

హైదరాబాద్: 'ఫిఫా' ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ 2018.. ఈ క్రీడా సంరంభం గురించి యావత్‌ ఫుట్‌బాల్‌ అభిమానులే కాకుండా అంతర్జాతీయంగా క్రీడాభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అంటేనే అభిమానుల్లో ఉరకలెత్తే ఉత్సాహం, నరాలు తెగేంత ఉత్కంఠ, అంతులేని ఆనందం కనిపించడం సర్వసాధారణం. ఇంతటి ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ ఫుట్‌బాల్‌ అభిమానులకు గూగుల్‌లో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మ్యాచ్‌ వివరాలను ఎప్పటికప్పుడు లైవ్‌లో స్కోరును తెలియపరిచేలా ప్రత్యేక ఫీచర్‌ను తీసుకురానుంది. అంతేకాదు మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్‌ను 30నిమిషాల నిడివిగల వీడియోలో చూపించే విధంగా వీడియో ఆప్షప్‌ను అందులో ఉంచింది. తమ ఫేవరెట్‌ గ్రూప్‌ టేబుల్స్‌ను, వాటి స్టాటిస్టిక్స్‌, ట్రెండింగ్‌లో ఉన్న ఆటగాళ్ల వివరాలు అందులో ఉంచనుంది. స్కోర్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్‌లకు చేరేలా ఏర్పాట్లు చేస్తూ ఉంది. మ్యాచ్‌ను తిలకించలేని అభిమానులకు మంచి అనుభూతిని, సంతృప్తిని కలిగించేలా ఆయా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచాయ్‌ తెలిపారు.

'మ్యాచ్‌ వీక్షించలేని, దాని గురించి శోధించలేనంత సమయం కూడా లేని అభిమానులకు సందేశాల రూపంలో మొబైల్‌కు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ అందుతాయి. అంతేకాకుండా వరల్డ్‌కప్‌ ట్రాకర్‌ పేరుతో గూగుల్‌ న్యూస్‌ యాప్‌ను ఈ సందర్భంగా ప్రవేశపెట్టనున్నాం. ఇది ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని పిచాయ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఈ ట్రాకర్‌లో 'స్పాట్‌లైట్‌' అనే ఫీచర్‌ ద్వారా లైవ్‌ స్కోర్స్‌ వీడియోలు, మ్యాచ్‌ హైలెట్స్‌, ఫలితాలు, షెడ్యూల్‌ తదితర వివరాలు చూసే అవకాశం ఉంది' అని గూగుల్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ యోవ్‌ స్కోర్ట్‌బర్గ్‌ తెలిపారు. అంతేకాదు, మనకు ఏయే జట్ల గురించి వివరాలు కావాలో, కావలసిన కొన్ని మ్యాచ్‌ల వరకే అప్ డేట్స్ కావాలన్నా అందులోనే ఎంచుకునే సదుపాయం కల్పిస్తారట.

Story first published: Sunday, June 10, 2018, 14:05 [IST]
Other articles published on Jun 10, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+