పనిచేయని జికో మంత్రం: ముంబై-గోవా మ్యాచ్ డ్రా
మార్గోవా: ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ 11వ రౌండ్ కు చేరుకున్న జికో శిక్షణలో ముందుకు సాగుతున్న గోవా జట్టు పేలవ ప్రదర్శన యదాతథంగా కొనసాగుతున్నది. సొంతగడ్డపై ముంబై ఎఫ్‌సి జట్టుపై బుధవారం రాత్రి ఫాటోర్డాలో జరిగిన మ్యాచ్‌లో నిరాశాజనక ఫలితం మిగిల్చింది.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన గోవా జట్టు ప్రస్తుత సీజన్‌లో 11 పాయింట్లు మాత్రమే సాధించి ఏడోస్థానంలో కొనసాగుతున్నది. నార్త్ఈస్ట్ 10 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇక మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌లలో విజయం సాధిస్తే తప్ప గోవాజట్టు సెమీ ఫైనల్స్‌కు చేరడం అసాధ్యంగానే కనిపిస్తున్నది.
ఇక డియాగో ఫోర్లాన్ ఆధ్వర్యంలోని ముంబై సిటీ జట్టు 0-0 స్కోరుతో డ్రాగా ముగించినా 11 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో రెండోస్థానంతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకున్నది. మ్యాచ్ ప్రారంభం నుంచి ముంబై జట్టు డిఫెన్సివ్‌గా ఆడుతూ మ్యాచ్‌పై పట్టు సాధించింది.

ఎనిమిది మంది భారతీయ ఆటగాళ్లకు చోటు
వరుసగా రెండో గేమ్ లో ఎఫ్ సి గోవా చీఫ్ కోచ్ జికో పలువురు దేశీయ ఆటగాళ్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ఇంతకుముందు నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది మంది దేశీయ ఆటగాళ్లను బరిలోకి దించడంతో విజయం సాధించిన జికో.. ముంబై సిటీతో జరిగిన ఈ మ్యాచ్ లో ఎనిమిది మంది భారతీయ ఆటగాళ్లకు చోటు కల్పించాడు. ఐఎస్ఎల్ నిబంధనల ప్రకరాం ఆరుగురు విదేశీ ఆటగాళ్లతోనూ మ్యాచ్‌లో పాల్గొనవచ్చు. కానీ ప్రత్యర్థి జట్టు ముంబై సిటీ ఎఫ్ సి మాత్రం ఇంటర్నేషనల్ ప్లేయర్ల కోటా ప్రకారం రంగంలోకి దిగిన డియాగో సేన మ్యాచ్‌ను ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు.

ముందుకు సాగిన సునీల్ ఛెత్రి
సారధి ఫోర్లాన్ తోపాటు బెంగళూరు ఎఫ్ సి ప్లేయర్ సునీల్ ఛెత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ముందుకు సాగారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యర్థి జట్టుపై బ్రేక్ పాయింట్ సాధించేందుకు విఫలయత్నంచేశారు. సునీల్ ఛెత్రి తొలుత పంపిన బంతిని గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి ఏమాత్రం కష్టపడకుండానే తప్పించాడు. ఫోర్లాన్ సైతం రెండుసార్లు కట్టిమణిని పరీక్షించినా గోల్ పాయింట్ సాధించే అవకాశం లేకపోయింది. 27వ నిమిషంలో ఛెత్రి పంపిన బంతిని ఫోర్లాన్ కిక్ కొట్టేలోగా కట్టిమణి స్వాధీనంచేసుకోవడంతో గోల్ సాధించే అవకాశం మిస్సయింది.

గోవా కుర్రాళ్లు సైతం అటాకింగ్ వ్యూహంతో
మ్యాచ్ ముగింపు దశలోనూ మరోసారి ఫోర్లాన్ కార్నర్ ద్వారా గోల్ పాయింట్ సాధించేందుకు చేసిన యత్నాన్ని కట్టిమణి అడ్డుపడ్డాడు. ఇక ఎఫ్ సి గోవా కుర్రాళ్లు సైతం అటాకింగ్ వ్యూహంతో పాయింట్లు పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 14వ నిమిషంలో రాఫెల్ కొయెల్హో గత మ్యాచ్ విన్నర్ రోమియో ఫెర్నాండెజ్ పంపిన బంతిని గోల్ పోస్ట్ దరికి పంపే ప్రయత్నాలు సద్వినియోగం కాలేదు. 22వ నిమిషంలోనూ రోమియో, రాఫెల్ ద్వయం నెలకొల్పిన మరో అవకాశం కూడా లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది.

ఆది నుంచి ఒత్తిలో ముంబై
సెకండాఫ్ లో ముంబై సిటీ పలు దఫాలు గోల్ పాయింట్ సాధించే క్రమానికి చేరువలో చేరుకున్నది. ప్రమాదకర ప్రాంతంలో సునీల్ ఛెత్రి కల్పించిన సెటప్‌లో ఇన్ సైడ్ బాక్స్‌లో గ్రెగరీ ఆర్నోలిన్ కు పంపిన బంతిని తేలిగ్గా గోల్ పోస్ట్ దారి పట్టించేందుకు ఫోర్లాన్ కు వచ్చిన అవకాశం మిస్సయింది. తొలిసారి కిక్ దిగ్భ్రాంతికరంగా తప్పిపోవడంతో మరోసారి ఛెత్రి కొట్టిన బంతిని గోవా డిఫెండర్ అడ్డుకున్నాడు. దీంతో కట్టిమణి ముందు నుంచి దూసుకువెళ్లింది. 65వ నిమిషంలో డియాగో తనకు తాను గోల్ చేసే అవకాశం మిస్ చేసుకున్నాడు. ముంబై ఒత్తిడి కొనసాగిస్తున్నా ఛెత్రి 83వ నిమిషంలో కర్లింగ్ చేసినా బంతి నేరుగా గోవా బ్రెజిలియన్ స్ట్రయికర్ జులియో సీజర్ చేతిలో పడింది. అయితే చివరి నిమిషంలో గోల్ కీపర్ మాత్రమే గోవా పాయింట్ సాధించకుండా అడ్డుకోగలిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications