మెస్సీపై అభిమానంతో.. కోల్‌కతాలో తన ఇంటినే..

హైదరాబాద్: భారత్ వరల్డ్ కప్‌లో ఆడకపోయినా..ఎక్కువగా బెంగాల్,ఈశాన్య రాష్ర్టాలలో ఫుట్‌బాల్‌కు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న ఫిఫా ప్రపంచకప్ కారణంగా ఇప్పటికే అక్కడి వాతావరణమంతా వేడేక్కింది. ఆ ప్రాంతాలలో ఉండే వీక్షకులు తన అభిమాన జట్లపై భారీ అంచనాలనే పెంచుకున్నారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 24 పరగణాల జిల్లాలోని నవాబ్ గంజ్‌కు చెందిన షిబ్ శంకర్‌పాత్ర కొత్త పద్ధతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ప్రత్యక్షంగా చూసేందుకు రష్యా వెళ్లి రావాలనుకున్నా
పాత్ర స్థానికంగా టీస్టాల్ నడుపుతుంటాడు..అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అభిమాని. అతను ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు రష్యా వెళ్లి రావాలనుకున్నాడు. అక్కడకు వెళ్లి వచ్చేందుకు డబ్బు సరిపోదని తెలుసుకుని తను నివసించే ఇంటిని పూర్తిగా అర్జెంటీనా ఆటగాళ్లు ధరించే జెర్సీ రంగుతో నింపడమే కాదు.. ఇంట్లో కూడా మెస్సీ కటౌట్లతో నింపేశాడు.

పూజగది సైతం అవే రంగులు
దీంతో అతని మూడంతస్తుల బిల్డింగ్ మొత్తం నీలి, తెలుపు రంగులతో కొత్తగా కనిపిస్తుంది. ఆఖరికి పూజగది సైతం అవే రంగులు. ప్రతి నాలుగేళ్లకోసారి ఇలా రంగులను వేయిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. దీంతో ఇంటికి కొత్త కళ వచ్చిందని శంకర్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఒక్కటేమిటీ మెస్సీ ఇష్టాలన్నీ తెలుసు
‘నేను పొగ తాగను, మద్యం కూడా సేవించను. కానీ నాకు అర్జెంటీనా, మెస్సీ అంటే చెప్పలేనంత అభిమానం. ఈ అభిమానం నాకొక్కడికే పరిమితం కాలేదు. నా పిల్లలకు కూడా మెస్సీ అంటే ఎంతో ఇష్టం. అతని గురించి వాళ్లకు కూడా పూర్తిగా తెలుసు. మెస్సీ ఎలాంటి ఆహారం తీసుకుంటాడు.. ఏ కారు అంటే ఇష్టం. ఇలా ఒక్కటేమిటీ మెస్సీ ఇష్టాలన్నీ తెలుసు' అని చెప్పుకుంటూ పాత్ర మురిసిపోయాడు.

మెస్సీ నేరుగా చూశా, నా కల నిజమైంది:
ఇక 2011లో అర్జెంటీనా జట్టు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్డేడియంలో వెనిజువెలతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో మెస్సీ నేరుగా చూసే అదృష్టం కలిగిందని.. మొత్తానికి నా కల నిజమైందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి తన టీ స్టాల్, ఇంటికి అర్జెంటీనా రంగులు వేయిస్తున్నట్లు తెలిపాడు. 2012 నుంచి మెస్సీ పుట్టినరోజు వేడుకలను సైతం చుట్టుపక్కల వాళ్లంతా ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. నేరుగా మ్యాచ్ చూసే అవకాశం లేకున్నా.. ఎలాగైనా తన అభిమాన ఆటగాడు ఈసారి రెచ్చిపోయి ఆడి కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు' పాత్ర పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications