ఫుట్ బాల్: జర్మనీ మస్తు మస్తు, ఆస్ట్రేలియా చిత్తు చిత్తు
By Santaram
oi-Santaram
డర్బన్: ఈసారి ప్రపంచ కప్ అంతగా ఫేవరేట్ కాని మాజీ చాంపీయన్ జర్మనీ విజృంభించి ఆడింది. ఆదివారం గ్రూప్ 'డి'లో తన తొలి మ్యాచ్ లో చెలరేగిపోయింది. గోల్స్ మోత మోగించిన జర్మనీ..4-0 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. పొడోల్‌స్కీ (8వ నిమిషం), క్లోజ్ (26), ముల్లర్ (67), కకౌ (70) జర్మనీకి గోల్స్ అందించారు. మ్యాచ్‌లో జర్మనీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరంభంలో ఆసీస్ పోటీ ఇచ్చేలా కనిపించినా క్రమంగా జర్మనీ జోరుకు తలవంచింది.
జర్మనీ విరామం లేకుండా దాడులు చేసింది. ఎనిమిదో నిమిషంలో తొలి ఫలితం సాధించింది. ముల్లర్ అందించిన పాస్‌ను పొడోల్‌స్కీ గోల్‌గా మలిచాడు. తర్వాత లామ్ అద్భుతమైన క్రాస్ అందించగా క్లోజ్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. ద్వితీయార్ధంలోనూ జర్మనీ జోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. 56వ నిమిషంలో ష్వీన్‌స్టెజర్ (జర్మనీ)ను వెనకనుంచి ఢీకొన్న కాహిల్ రెడ్ కార్డుతో మైదానాన్ని వీడాడు. దాంతో ఆసీస్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ జట్టు డిఫెన్స్‌ను జర్మనీ ఆటగాళ్లు చెల్లాచెదురు చేశారు. ఫలితమే ముల్లర్, కకౌల గోల్స్.
నాగ్ కింగ్స్-బాలయ్య లయన్స్, వారియర్స్-చిరు చితాస్‌లో సభ్యులు కలిసి ఫైనల్ మ్యాచ్‌లో పొల్గొనడం చూపరులను ఆకట్టుకుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడడంతో ఆటను 10 ఓవర్లకు కుదించారు.