Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మారడోనా జట్టు పనిబట్టిన జర్మనీ

Arne Friedrich
కేప్ టౌన్: అర్జెంటీనాపై జర్మనీ అనూహ్య విజయం సాధించింది. కోచ్‌గా కూడా అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించాలనుకున్న డీగో మారడోనాకు భంగపాటు తప్పలేదు. శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ జర్మనీ 4-0 గోల్స్‌తో అర్జెంటీనాపై ఘనవిజయం సాధించింది. సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన మారడోనా బృందం ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జర్మనీ జోరుకు పూర్తిగా తలవంచింది. అర్జెంటీనా డిఫెన్స్‌ వైఫల్యాలను సొమ్ము చేసుకున్న జర్మనీ గోల్స్‌ మోత మోగించింది. 20 ఏళ్ల ముల్లర్‌ గోల్‌తో మూడో నిమిషంలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జర్మనీ ఆ తర్వాత పట్టుసడలించలేదు. ద్వితీయార్థంలో క్లోజ్‌ రెండు గోల్స్‌ (68, 89), అనె ఫ్రైడ్రిచ్‌ (74) గోల్‌తో జర్మనీ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. జర్మనీకిది వరుసగా మూడో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌.

మూడో నిమిషంలోనే..: దిగ్గజాల మధ్య మ్యాచ్‌లో జర్మనీ మూడో నిమిషంలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లి అర్జెంటీనాకు షాకిచ్చింది. స్వెయిన్‌స్టీజర్‌ ఫ్రీకిక్‌ను ముల్లర్‌ సద్వినియోగం చేశాడు. తలతో బంతిని నెట్లోకి నెట్టాడు. అర్జెంటీనా డిఫెన్స్‌ అతణ్ని స్వేచ్ఛగా వదిలేసింది. రెట్టించిన విశ్వాసంతో మ్యాచ్‌ చివరి వరకూ జర్మనీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందంటే కారణం ఆ తొలి గోలే. పొడోల్‌స్కీ, క్లోజ్‌, ముల్లర్‌ అర్జెంటీనా రక్షణశ్రేణిలోకి దూసుకుపోయారు.

మరోవైపు అర్జెంటీనా కూడా దాడులకు ప్రయత్నంచేసినా బలమైన జర్మనీ డిఫెన్స్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభ పది నిమిషాలు జర్మనీ దాడులను కాచుకున్నాక అర్జెంటీనా కాస్త కుదుటపడింది. మెస్సి, కార్లో టెవెజ్‌, గొంజాలో, హిగైన్‌ సమన్వయంతో కదిలారు. అయినా జర్మనీ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయరు. తొలి అరగంటలో అర్జెంటీనాకు ఒకే ఒక చక్కని గోల్‌ అవకాశం వచ్చింది. మెస్సి.. టెవెజ్‌కు ఇచ్చిన పాస్‌ను జర్మనీ గోల్‌కీపర్‌ మాన్యుయల్‌ నెయర్‌ మధ్యలోనే అడ్డుకున్నాడు. మరోవైపు జర్మనీ మాత్రం అనేక గోల్‌ స్కోరింగ్‌ అవకాశాలు సృష్టించుకుంది. 24వ నిమిషంలో క్లోజ్‌ కొట్టిన షాట్‌ బార్‌పై నుంచి దూసుకెళ్లింది. ఆరు నిమిషాల తర్వాత పొడోల్‌స్కీ దూరం నుంచి కొట్టిన షాట్‌ నెట్‌కూ దూరంగా వెళ్లింది. తొలి అర్ధభాగం ముగుస్తుందనగా అర్జెంటీనా పుంజుకుంది. మారియా (అర్జెంటీనా) తక్కువ ఎత్తులో కొట్టిన షాట్‌ నుయర్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత హిగైన్‌ షాట్‌ను కూడా. 36వ నిమిషంలో అర్జెంటీనా స్కోరు సమం చేసేదే! హిగైన్‌ బంతిని నెట్లోకి నెట్టాడు. కానీ అది ఆఫ్‌ సైడ్‌.

రెండో అర్ధభాగంలో తొలి 20 నిమిషాలు అర్జెంటీనా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎటాకింగ్‌ గేమ్‌తో గోల్స్‌ చేసేలా కనిపించింది. కానీ టెవెజ్‌, మెర్టెసాకర్‌ షాట్లను జర్మనీ డిఫెన్స్‌ సమర్థంగా అడ్డుకుంది. ఆ కాసేపు ఆధిపత్యం తర్వాత అర్జెంటీనా ఆట పూర్తిగా గాడి తప్పింది. జర్మనీ స్త్ట్రెకర్లు దూసుకొస్తుంటే అర్జెంటీనా వద్ద సమాధానమే లేకపోయింది. డిఫెండర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోలాగే జర్మనీ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. 100వ మ్యాచ్‌ ఆడుతున్న క్లోజ్‌ 68వ నిమిషంలో జర్మనీ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అర్జెంటీనా డిఫెన్స్‌ చెల్లాచెదురైన వేళ.. అలవోకగా గోల్‌కొట్టాడు. పొడోల్‌స్కీ పాస్‌ ఇవ్వగా.. ఖాళీగా ఉన్న నెట్లోకి బంతిని పంపించాడు. నిజానికి అప్పుడే మ్యాచ్‌లో అర్జెంటీనా ఓటమి ఖరారైంది. ఏవైనా ఆశలు మిగిలి ఉంటే అవి కాస్తా ఆరు నిమిషాల తర్వాత ఆవిరయ్యాయి. ఫ్రైడ్‌రిచ్‌ జర్మనీ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. జర్మనీ గోల్స్‌ మోత అంతటితో ఆగలేదు. 89వ నిమిషంలో క్లోజ్‌ తన రెండో గోల్‌ కొట్టాడు. ఓజిల్‌ పాస్‌ను 12 గజాల దూరం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్లోకి పంపించాడు. రెండో ఎల్లో కార్డుకు గురైన ముల్లర్‌ సెమీఫైనల్‌కు దూరమయ్యాడు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+