జొహానెస్ బర్గ్: ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో జర్మనీ, ఘనా జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. బుధవారం రాత్రి జర్మనీ 1-0తో ఘనాను ఓడించింది. ఆరు పాయింట్లతో గ్రూప్-డిలో అగ్రస్థానం సాధించి రెండో రౌండుకు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఘనా ఓడినా మెరుగైన గోల్ తేడాతో ముందుకెళ్లింది. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో ఘనాతో సమంగా నిలిచింది.
సెర్బియా గ్రూప్ లో చివరి స్థానంలో నిలిచింది. నాకౌట్లో జర్మనీ.. ఇంగ్లాండ్‌తో, ఘనా..అమెరికాతో తలపడతాయి. మ్యాచ్ లో ఆరంభం నుంచి జర్మనీ దూకుడుగా ఆడింది. ఐతే ఘనా డిఫెన్స్ మెరుగ్గా ఉండటంతో తొలి అర్ధభాగంలో గోల్ నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో జర్మనీ మరింత ధాటిగా ఆడింది. 60వ నిమిషంలో ఓజిల్ 25 గజాల దూరం నుంచి అద్భుతమైన గోల్ కొట్టి జర్మనీకి ఆధిక్యాన్నందించాడు